Kia Carens కొత్త వీడియో రిలీజ్ చేసిన చేసిన Kia Motors

దక్షిణ కొరియా వాహన తయారీ దిగ్గజం కియా మోటార్స్ (Kia Motors) దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల చేయనున్న కొత్త MPV కియా కారెన్స్ (Kia Carens). ఈ MPV ని కంపెనీ విడుదల చేయడానికి ముందే ఇందులోని వేరియంట్ల వారిగా ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ వంటి వాటిని గురించిన సమాచారం వెల్లడించింది. అయితే ఇప్పుడు TVC వీడియో విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Kia Carens కొత్త వీడియో రిలీజ్ చేసిన చేసిన Kia Motors

కంపెనీ విడుదల చేసిన ఈ వీడియోలో బోల్డ్‌గా మరియు SUV లాగా కనిపించే కియా కారెన్స్ యొక్క అద్భుతమైన డిజైన్ చూడవచ్చు. ఇందులో ఈ MPV యొక్క ముందు భాగంలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఇవ్వబడ్డాయి, వీటిని కంపెనీ స్టార్ మ్యాప్ DRLగా ప్రచారం చేస్తోంది. ఈ కారులోని టెయిల్‌ల్యాంప్‌కు కూడా ఇదే డిజైన్ పొందుతుంది.

Kia Carens కొత్త వీడియో రిలీజ్ చేసిన చేసిన Kia Motors

ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, బోస్ సౌండ్ సిస్టమ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు 16 ఇంచెస్ డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి మొత్తం సమాచారం ఇక్కడ చూడవచ్చు. ఇది మొత్తానికి అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

Kia Carens కొత్త వీడియో రిలీజ్ చేసిన చేసిన Kia Motors

కియా కారెన్స్ (Kia Carens) అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ మరియు రియర్ డిస్క్ బ్రేక్‌లు, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, బ్రేక్ అసిస్ట్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను దాదాపు అన్ని వేరియంట్‌లలో పొందుతుంది.

Kia Carens కొత్త వీడియో రిలీజ్ చేసిన చేసిన Kia Motors

కియా కారెన్స్ యొక్క ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో రెండవ వరుస వన్-టచ్ ఎలక్ట్రిక్ టంబుల్ సీట్, ఛార్జింగ్ కోసం 5 USB టైప్ సి పోర్ట్‌లు, లెదర్ అపోల్స్ట్రే, రూఫ్ రైల్స్, డైనమిక్ మార్గదర్శకాలతో రియర్ పార్కింగ్ కెమెరా, కీలెస్ ఎంట్రీ, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ ఉన్నాయి.

Kia Carens కొత్త వీడియో రిలీజ్ చేసిన చేసిన Kia Motors

అంతే కాకుండా ఇందులో పుష్- బటన్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ-గ్లేర్ రియర్‌వ్యూ మిర్రర్, వైర్‌లెస్ ఛార్జర్ విత్ కూలింగ్ ఫంక్షన్ మరియు రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు వంటి మరిన్ని ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి.

Kia Carens కొత్త వీడియో రిలీజ్ చేసిన చేసిన Kia Motors

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త కియా కారెన్స్ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. అవి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ ఉంటాయి. వేరియంట్‌ని బట్టి ఇంటీరియర్ కలర్ మరియు సీట్ ప్యాటర్న్ భిన్నంగా ఉంటాయి. లగ్జరీ ప్లస్ మినహా అన్ని వేరియంట్‌లు 7-సీటర్ వాహనంగా అందించబడతాయి.

Kia Carens కొత్త వీడియో రిలీజ్ చేసిన చేసిన Kia Motors

ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటాయి. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జతచేయబడుతుంది. ఇందులోని 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 138 బిహెచ్‌పి పవర్ మరియు 1,500-3,200 ఆర్‌పిఎమ్ వద్ద 242 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ DCT కలిగి ఉంటుంది.

Kia Carens కొత్త వీడియో రిలీజ్ చేసిన చేసిన Kia Motors

ఇక 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 113 బిహెచ్‌పి పవర్ మరియు 1,500-2,750 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ ఎమ్ టార్క్ అందిస్తుది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటో మాటిక్ గేర్ బాక్స్ కి జత చేయబడి ఉంటుంది.

Kia Carens కొత్త వీడియో రిలీజ్ చేసిన చేసిన Kia Motors

కియా కారెన్స్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

కంపెనీ ఈ MPV కోసం 2022 జనవరి 14 నుంచి బుకింగ్స్ స్వీకరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కొత్త కియా కారెన్స్ MPV దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత 6/7 సీట్ల MPV విభాగంలో ప్రవేశిస్తుంది. ఈ విభాగానికి దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. కావున కియా యొక్క కొత్త కార్ కూడా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశించవచ్చు.

Kia Carens కొత్త వీడియో రిలీజ్ చేసిన చేసిన Kia Motors

Kia Carens యొక్క ధరలు గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు, అయితే ఇది రూ.15 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో, టాప్ వేరియంట్ ధర రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు. ఈ కొత్త MPV భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత టయోటా ఇన్నోవా క్రిష్టా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Kia carens mpv tvs video released details explained
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X