కస్టమర్ల మనసు దోచుకుంటున్న 'కియా సెల్టోస్'.. అప్పుడే అరుదైన రికార్డ్ సొంతం

భారతదేశంలో ప్రారంభమైన అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'కియా మోటార్స్' (Kia Motors) యొక్క 'సెల్టోస్' (Seltos) ఇప్పుడు అమ్మకాల్లో ఏకంగా అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కేవలం మూడు సంవత్సరాల కాలంలో ఇంత గొప్ప రికార్డ్ సాధించిన కియా కారు ఇదే అవుతుంది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.. రండి.

కస్టమర్ల మనసు దోచుకుంటున్న 'కియా సెల్టోస్'.. అప్పుడే అరుదైన రికార్డ్ సొంతం

కియా సెల్టోస్ మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి 3,00,000 యూనిట్ల విక్రయాలను పొందింది. కియా కంపెనీ యొక్క మొత్తం అమ్మకాల్లో దాదాపు 60% అమ్మకాల్లో సెల్టోస్ ఉండటం గమనార్హం. ఇటీవల కంపెనీ దేశంలో మొత్తం 5 లక్షల కార్లను విక్రయించగలిగినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు 91 కంటే ఎక్కువ దేశాలకు 103,033 యూనిట్ల సెల్టోస్‌లను ఎగుమతి చేసింది. దీన్ని బట్టి చూస్తే.. కంపెనీ యొక్క ఈ మోడల్ కి మార్కెట్లో ఎంత ఆదరణ ఉందో స్పష్టంగా అర్థమవుతోంది.

కస్టమర్ల మనసు దోచుకుంటున్న 'కియా సెల్టోస్'.. అప్పుడే అరుదైన రికార్డ్ సొంతం

ఎక్కువమంది కొనుగోలుదారులు డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన సెల్టోస్ యొక్క కొత్త IMT వేరియంట్ కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకటం 2022 సంవత్సరంలో ప్రతి 10 మంది సెల్టోస్ కొనుగోలుదారులలో ఒకరు ఈ వేరియంట్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. అదే సమయంలో సెల్టోస్ హెచ్‌టిఎస్ పెట్రోల్ వేరియంట్ కూడా బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఎక్కువమంది వైట్ కలర్ సెల్టోస్‌ కొనటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

కస్టమర్ల మనసు దోచుకుంటున్న 'కియా సెల్టోస్'.. అప్పుడే అరుదైన రికార్డ్ సొంతం

కంపెనీ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్ల అమ్మకాలు దాదాపు సమానంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని గురించి కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యూన్-సిక్ సోహన్ మాట్లాడుతూ.. ఇటీవల, మేము సెల్టోస్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా ప్రవేశపెట్టాము. ఇది వాహన వినియోగాదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కావున రానున్న రోజుల్లో ఇది మరింత మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.

కస్టమర్ల మనసు దోచుకుంటున్న 'కియా సెల్టోస్'.. అప్పుడే అరుదైన రికార్డ్ సొంతం

ప్రస్తుతం కంపెనీ తన సెల్టోస్ లో 6 ఎయిర్ బ్యాగులు అందిస్తోంది. కావున ఇప్పుడు ఇంహులో రెండు సైడ్ ఎయిర్ బ్యాగులు అందుబాటులో ఉంటాయి. కావున ఇది మునుపటికంటే కూడా చాలా సురక్షితంగా ఉంటుంది. కానీ ఇప్పుడు దీని ధర కొంత పెరిగింది .

కస్టమర్ల మనసు దోచుకుంటున్న 'కియా సెల్టోస్'.. అప్పుడే అరుదైన రికార్డ్ సొంతం

కియా సెల్టోస్ టెక్ లైన్ మరియు GT లైన్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అయితే ఈ టెక్ లైన్ లైనప్ HTE, HTK, HTK ప్లస్, HTX మరియు HTX ప్లస్ అనే మరో 5 సబ్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అదే సమయంలో GT లైన్ కింద GTX (O) మరియు GTX ప్లస్ అనే రెండు సబ్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి.

కస్టమర్ల మనసు దోచుకుంటున్న 'కియా సెల్టోస్'.. అప్పుడే అరుదైన రికార్డ్ సొంతం

కియా సెల్టోస్‌లో మొత్తం మూడు ఇంజన్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. అవి వరుసగా 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.4-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్ 6,300 ఆర్‌పిఎమ్ వద్ద 115 పిఎస్ పవర్ మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 144 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్సన్ పొందుతుంది.

కస్టమర్ల మనసు దోచుకుంటున్న 'కియా సెల్టోస్'.. అప్పుడే అరుదైన రికార్డ్ సొంతం

టర్బో పెట్రోల్ ఇంజిన్ 140 పిఎస్ పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ డిసిటి ఆప్సన్స్ పొందుతుంది. ఇక చివరగా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 115 పిఎస్ పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ ఎంపికలను పొందుతుంది.

కస్టమర్ల మనసు దోచుకుంటున్న 'కియా సెల్టోస్'.. అప్పుడే అరుదైన రికార్డ్ సొంతం

కియా సెల్టోస్ లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు డిస్క్ బ్రేక్ మొదలైనవి ఉన్నాయి. కంపెనీ యొక్క ఈ కారు ఇప్పటికే సేఫ్టీ విషయంలో 3-స్టార్ రేటింగ్ కూడా పొందింది.

కస్టమర్ల మనసు దోచుకుంటున్న 'కియా సెల్టోస్'.. అప్పుడే అరుదైన రికార్డ్ సొంతం

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

'కియా సెల్టోస్' భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడానికి ఎప్పటికప్పుడు దోహదపడుతూనే ఉంది. ఈ కారణంగానే కంపెనీ 5 లక్షల యూనిట్లను విక్రయించగలిగింది. అంతే కాకుండా కియా ఇండియా భారతదేశంలో తన 3వ వార్షికోత్సవాన్ని ఆగస్టు 22న జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది, కియా సెల్టోస్ భారతదేశంలో ప్రారంభించబడి మూడు సంవత్సరాలు పూర్తయింది. అంతే కాకుండా కియా సెల్టోస్ ధరలు ఆగష్టు 01 నుంచి గరిష్టంగా 30,000 పెరిగాయి.

Most Read Articles

English summary
Kia seltos crosses 3 lakh unit sales milestone details
Story first published: Saturday, August 13, 2022, 10:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X