సెల్టోస్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఆగష్టు నుంచి పెరగనున్న ధరలు: పూర్తి వివరాలు

కియా మోటార్స్ (Kia Motors) వాహన ప్రియులకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ విడుదల చేసింది. అదేమిటంటే కంపెనీ తన 'సెల్టోస్' (Seltos) ధరలను 2022 ఆగష్టు నుంచి పెంచనుంది. ఇంతకీ కంపెనీ ఎంత ధరలను పెంచనుంది, ఎందుకు పెంచనుంది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం రండి.

సెల్టోస్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఆగష్టు నుంచి పెరగనున్న ధరలు: పూర్తి వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం కియా సెల్టోస్ ధరలు ఆగష్టు నుంచి రూ. 14,000 నుంచి రూ. 30,000 అధికం కానుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్ ప్రారంభ ధర రూ. 10.19 లక్షలు. అయితే ఈ ధర ఆగష్టు నుంచి రూ. 10.49 లక్షలకు చేరుకుంటుంది.

సెల్టోస్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఆగష్టు నుంచి పెరగనున్న ధరలు: పూర్తి వివరాలు

కంపెనీ ఇప్పుడు తన సెల్టోస్ లో మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ అందించడంలో భాగంగా 6 ఎయిర్ బ్యాగులు అందించనుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో టయోటా హైరైడర్ మరియు మారుతి గ్రాండ్ విటారా వాటి వాటికీ గట్టి పోటీ ఇవ్వడానికి ఈ సేఫ్టీ ఫీచర్స్ అప్డేట్ చేస్తోంది. అయితే ఇప్పటి వరకు సెల్టోస్ 4-ఎయిర్‌బ్యాగ్‌లతో అందించబడింది. అయితే రానున్న రోజుల్లో 6-ఎయిర్‌బ్యాగ్‌లు అందివ్వనుంది.

సెల్టోస్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఆగష్టు నుంచి పెరగనున్న ధరలు: పూర్తి వివరాలు

కియా మోటార్స్ మొదటి తన కారెన్స్ SUV లో 6 ఎయిర్ బ్యాగులు అందించింది. ఇప్పుడు సెల్టోస్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు పొందుతున్న కంపెనీ యొక్క రెండవ మోడల్ అవుతుంది.

కియా సెల్టోస్ పెట్రోల్ వేరియంట్ మొత్తమ్ 10 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో బేస్ మోడల్ HTE 1.5 మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ. 30,000 ఎక్కువ కానుంది. కావున ఈ వేరియంట్ ధర 2022 ఆగష్టు నుంచి రూ. 10.49 లక్షలకు అందుబాటులో ఉంటుంది.

సెల్టోస్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఆగష్టు నుంచి పెరగనున్న ధరలు: పూర్తి వివరాలు

అదే సమయంలో ఎక్స్-లైన్ 1.4 డిసిటి వేరియంట్ ధర రూ. 14,000 పెరిగి రూ. 18.29 లక్షలకు చేరుకుంటుంది. ఇందులోని GTX(O) 1.4 మ్యాన్యువల్ ధర రూ. 20,000 పెరుగుతుంది, కావున దీని ధర రూ. 16.05 లక్షలకు చేరుకుంటుంది.

సెల్టోస్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఆగష్టు నుంచి పెరగనున్న ధరలు: పూర్తి వివరాలు

ఇక డీజిల్ వేరియంట్స్ విషయానికి వస్తే, ఇందులో మొత్తం 8 వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో బేస్ వేరియంట్ అయిన HTE 1.5 మాన్యువల్ వేరియంట్ రూ. 30,000 పెరుగుదలకు పొంది రూ. 11.39 లక్షలకు చేరుతుంది. ఇందులోని టాప్ వేరియంట్ ధర రూ. ఎక్స్-లైన్ 1.5 ఆటోమాటిక్ వేరియంట్ రూ. 20,000 పెరుగుదలను పొందుతుంది. కావున దీని ధర 2022 ఆగస్టు నుంచి రూ. 18.65 లక్షలకు చేరుకుంటుంది.

సెల్టోస్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఆగష్టు నుంచి పెరగనున్న ధరలు: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కియా కార్లలో సెల్టోస్ ఒకటి. కంపెనీ తన సెల్టోస్ ధరలను ఇదివరకే గత ఏప్రిల్ నెలలో పెంచింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఆగష్టులో కూడా పెంచనుంది. అయితే ఇకపైన కియా సెల్టోస్ 6 ఎయిర్ బ్యాగులతో రానుంది. ఇది వాహన వినియోగదారుల యొక్క భద్రతను మరింత మెరుగుపరుస్తుంది.

సెల్టోస్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఆగష్టు నుంచి పెరగనున్న ధరలు: పూర్తి వివరాలు

కియా సెల్టోస్ లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు డిస్క్ బ్రేక్ మొదలైనవి ఉన్నాయి. కంపెనీ యొక్క ఈ కారు ఇప్పటికే సేఫ్టీ విషయంలో 3-స్టార్ రేటింగ్ కూడా పొందింది.

సెల్టోస్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఆగష్టు నుంచి పెరగనున్న ధరలు: పూర్తి వివరాలు

కియా సెల్టోస్‌లో మొత్తం మూడు ఇంజన్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. అవి వరుసగా 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.4-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్.

సెల్టోస్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఆగష్టు నుంచి పెరగనున్న ధరలు: పూర్తి వివరాలు

1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్ 6,300 ఆర్‌పిఎమ్ వద్ద 115 పిఎస్ పవర్ మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 144 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్సన్ పొందుతుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ 140 పిఎస్ పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ డిసిటి ఆప్సన్స్ పొందుతుంది.

ఇక చివరగా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 115 పిఎస్ పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ ఎంపికలను పొందుతుంది.

సెల్టోస్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఆగష్టు నుంచి పెరగనున్న ధరలు: పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సెల్టోస్ ఇప్పుడు ధరల పెరుగుదల అందుకున్న తరువాత ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం త్వరలోనే తెలుస్తుంది. అదే విధంగా కంపెనీ 2023 నాటికి సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయనున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించింది. ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Kia seltos price hike upto rs 30000 august 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X