సారీ.. 2024 వరకు కార్లు స్టాక్ లేవు, డెలివరీ కావాలంటే ఆ తర్వాతే..!

ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ (Lamborghini) 2024 వరకు డెలివరీ చేయాల్సిన అన్ని కార్లను విక్రయించినట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మరియు వేగవంతమైన కార్లను తయారు చేసే లాంబోర్గినీ, ఉన్నట్టుండి ఇలాంటి ప్రకటన చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. లాంబోర్గినీ కార్లు అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ మరియు లేటెస్ట్ టెక్నాలజీతో తయారవుతాయి.

Recommended Video

లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్

ఈ టెక్నాలజీ కోసం ఉపయోగించే కీలకమైన భాగాలలో సెమీకండక్టర్ చిప్స్ చాలా ప్రధానమైనవి. అయితే, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత ఉండటంతో లాంబోర్గినీ కార్ల ఉత్పత్తి కూడా ప్రభావితమైంది.

సారీ.. 2024 వరకు కార్లు స్టాక్ లేవు, డెలివరీ కావాలంటే ఆ తర్వాతే..!

గడచిన రెండేళ్లలో కరోనా తెచ్చిపెట్టిన కష్టాలను ఎవ్వరూ మర్చిపోలేరు. ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ మహమ్మారి వలన తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కోవిడ్ లాక్‌డౌన్‌ల సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కార్ల ఫ్యాక్టరీలు మూసివేయబడ్డాయి మరియు ఆటో విడిభాగాల సరఫరా గొలుసులో తీవ్రమైన అంతరాయాలు ఏర్పడ్డాయి. అయితే, కోవిడ్ తర్వాత అనేక రంగాలు కోలుకున్నప్పటికీ, ఆటోమొబైల్ పరిశ్రమ మాత్రం ఇప్పటికీ సప్లయ్ చైన్ అంతరాయాలను ఎదుర్కుంటోంది.

సారీ.. 2024 వరకు కార్లు స్టాక్ లేవు, డెలివరీ కావాలంటే ఆ తర్వాతే..!

ఆటోమొబైల్ తయారీలో కీలకమైన విడిభాగాలలో ఇప్పుడు సెమీకండక్టర్స్‌కి పెద్దపీఠ వేయబడింది. ఎందుకంటే, కార్లలో అందించే లేటెస్ట్ టెక్నాలజీ మరియు టెక్ ఆధారిత ఫీచర్లకు ఈ చిప్స్ చాలా అవసరం. కారు యొక్క స్మార్ట్ కీ మొదలుకొని బ్రేకింగ్ సిస్టమ్ వరకూ అన్ని భాగాలలో ఈ చిప్స్ ఉపయోగించబడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ తయారీదారులపై ఈ చిప్స్ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా, కార్ల వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోయింది మరోవైపు పెరిగిన తయారీ ఖర్చుల కారణంగా కార్ల ధరలు కూడా దాదాపు రెట్టింపు స్థాయిలో పెరిగాయి.

సారీ.. 2024 వరకు కార్లు స్టాక్ లేవు, డెలివరీ కావాలంటే ఆ తర్వాతే..!

ఈ నేపథ్యంలో, ఇటాలియన్ కార్ కంపెనీ లాంబోర్గినీ కూడా తమ కార్ల తయారీలో ఆటంకాలను ఎదుర్కుంటోంది. ఇప్పుడు ఎవరైనా కొత్తగా లాంబోర్గినీ కారును బుక్ చేసుకుంటే, వారు దాని డెలివరీ కోసం కనీసం 18 నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. లాంబోర్గినీ సంస్థకు ఇప్పటికే డెలివరీ చేయాల్సిన పెండింగ్ కార్లు చాలానే ఉన్నాయి. అందుకే, ఈ కంపెనీ 2024 వరకూ డెలివరీ చేయాల్సిన కార్లను పూర్తిగా విక్రయించామని ప్రకటించింది. అయితే, ఈ పరిస్థితి ఎప్పటికీ ఇలానే ఉండబోదని, చిప్స్ సరఫరా మెరుగుపడితే కంపెనీ ఉత్పత్తి కూడా మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సారీ.. 2024 వరకు కార్లు స్టాక్ లేవు, డెలివరీ కావాలంటే ఆ తర్వాతే..!

ఇటాలియన్ కార్ బ్రాండ్ లాంబోర్గినీ, జర్మనీ ప్రధాన కార్యాలయం కలిగిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ కూడా ఈ తరహా సమస్యను ఎదుర్కుంటోంది. తమ కార్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ గురించి లాంబోర్గినీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టెఫాన్ వింకెల్‌మాన్ ఇటీవల ఒక ప్రైవేట్ వార్తాపత్రికతో మాట్లాడుతూ, "లగ్జరీ కార్ బ్రాండ్‌కు అధిక డిమాండ్ ఉంది. 2024 ప్రారంభం వరకు డెలివరీ చేయాల్సిన అన్ని కార్లు అమ్ముడయ్యాయి" అని పేర్కొన్నారు.

సారీ.. 2024 వరకు కార్లు స్టాక్ లేవు, డెలివరీ కావాలంటే ఆ తర్వాతే..!

తమ కస్టమర్లు లాంబోర్గనీ బ్రాండ్‌ను అత్యదికంగా విశ్వసిస్తారని, ఈ కార్లు ఎంత అందంగా ఉన్నాయో మరియు అవి ఎంత ఎక్కువ పనితీరును కలిగి ఉన్నాయో అని వారు చూస్తారని ఆయన చెప్పాడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్థికంగా అంతరాయాలు ఏర్పడినప్పటికీ, లాంబోర్గినీ తమ కస్టమర్ల డిమాండ్‌ను తీర్చడంలో విజయం సాధించిందని ఆయన అన్నారు. "తాము వీలైనంత త్వరగా ప్రతిదీ అప్‌డేట్ చేయడానికి మరియు దానిని సానుకూలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని" వింకెల్‌మాన్ చెప్పారు.

సారీ.. 2024 వరకు కార్లు స్టాక్ లేవు, డెలివరీ కావాలంటే ఆ తర్వాతే..!

ప్రస్తుతం, లాంబోర్గినీ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఉరుస్ అగ్రస్థానంలో ఉంది. ఇది లాంబోర్గినీ బ్రాండ్ నుండి వచ్చిన మొట్టమొదటి పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ. ఇప్పటి వరకూ ఏ ఇతర లాంబోర్గినీ బ్రాండ్ కారు అమ్ముడుపోనంతగా ఈ ఉరుస్ ఎస్‌యూవీ అమ్ముడైంది. మనదేశంలో కూడా అనేక మంది ప్రముఖులు, సినీ పరిశ్రమ సెలబ్రిటీలు ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. లాంబోర్ఘిని ఇటీవల కాలిఫోర్నియాలో జరిగిన మాంటెరీ కార్ వీక్‌ 2022 (Monterey Car Week 2022) లో లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే (Lamborghini Urus Performante) పేరిట ఓ కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది.

సారీ.. 2024 వరకు కార్లు స్టాక్ లేవు, డెలివరీ కావాలంటే ఆ తర్వాతే..!

స్టాండర్డ్ ఉరుస్ మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే అదనంగా 16 బిహెచ్‌పిల శక్తిని పొందుతుంది మరియు స్టాండర్డ్ ఉరుస్ కంటే 47 కిలోలు తేలికగా ఉంటుంది. లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే అదే మునుపటి 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్ నుండి శక్తిని పొందడం కొనసాగిస్తోంది. అయితే, ఈ ఇంజన్ ఇప్పుడు సాధారణ ఉరుస్ కంటే 16bhp ఎక్కువ (మొత్తంగా 657bhp) శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియుదీని 850 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇదొక ఆల్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీ.

సారీ.. 2024 వరకు కార్లు స్టాక్ లేవు, డెలివరీ కావాలంటే ఆ తర్వాతే..!

ఇదిలా ఉంటే, ప్రపంచ వ్యాప్తం అనేక కార్ కంపెనీలు ఇప్పుడు హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, లాంబోర్గినీ కూడా 2024 నాటికి తన అన్ని మోడళ్ల హైబ్రిడ్ వెర్షన్‌లను మరియు 2025 నాటికి తమ మొదటి ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలని యోచిస్తోందని వింకెల్‌మాన్ అన్నారు.

Most Read Articles

English summary
Lamborghini supercars sold out for till 2024 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X