అత్యంత శక్తివంతమైన లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మెంటే (Lamborghini Urus Performante) ఆవిష్కరణ

ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్ఘిని (Lamborghini) తయారు చేసిన మొట్టమొదటి సూపర్ ఎస్‌యూవీ ఉరుస్ (Urus) లో కంపెనీ మరింత శక్తివంతమైన వేరియంట్‌ను విడుదల చేసింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న మాంటెరీ కార్ వీక్‌ 2022 (Monterey Car Week 2022) లో లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే (Lamborghini Urus Performante) పేరిట కంపెనీ ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే అదనంగా 16 బిహెచ్‌పిల శక్తిని పొందుతుంది మరియు స్టాండర్డ్ ఉరుస్ కంటే 47 కిలోలు తేలికగా ఉంటుంది.

అత్యంత శక్తివంతమైన లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మెంటే (Lamborghini Urus Performante) ఆవిష్కరణ

లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే అదే మునుపటి 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్ నుండి శక్తిని పొందడం కొనసాగిస్తోంది. అయితే, ఈ ఇంజన్ ఇప్పుడు సాధారణ ఉరుస్ కంటే 16bhp ఎక్కువ (మొత్తంగా 657bhp) శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియుదీని 850 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది మరియు ఇది ఇంజన్ నుండి వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది.

అత్యంత శక్తివంతమైన లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మెంటే (Lamborghini Urus Performante) ఆవిష్కరణ

లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే పనితీరు విషయానికి వస్తే, కంపెనీ క్లెయిమ్ చేయబడిన దాని ప్రకారం, ఈ సూపర్ ఎస్‌యూవీ కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది మరియు ఇది స్టాండర్డ్ ఉరుస్ కంటే 0.3 సెకన్లు వేగంగా ఉంటుంది. అలాగే, ఇది గంటకు 0 నుండి 200 కిమీ వేగాన్ని చేరుకోవడానికి 11.5 సెకన్ల సమయం పడుతుంది. లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే యొక్క గరిష్ట వేగంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు, దీని టాప్ స్పీడ్ గంటకు 306 కిమీగా ఉంటుంది.

అత్యంత శక్తివంతమైన లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మెంటే (Lamborghini Urus Performante) ఆవిష్కరణ

స్టాండర్డ్ ఉరుస్‌లో కనిపించే సాధారణ డ్రైవింగ్ మోడ్‌లతో పాటు, కొత్త పెర్ఫార్మంటే మోడల్‌లో కొత్త ర్యాలీ మోడ్‌ను కూడా జోడించారు. ఈ కొత్త డ్రైవింగ్ మోడ్ ఎస్‌యూవీ యొక్క ఫన్-టు-డ్రైవ్ స్పోర్టినెస్‌ను మరియు డర్ట్ ట్రాక్‌లపై థ్రిల్లింగ్‌ను సరికొత్త స్థాయికి తీసుకువెళుతుందని కంపెనీ చెబుతోంది. స్టీల్ స్ప్రింగ్ సస్పెన్షన్ సెటప్ కోసం యాంటీ రోల్ మరియు డంపింగ్ సిస్టమ్‌లను ఆప్టిమైజ్ చేయడం ద్వారా ఈ కొత్త మోడ్ ఉరుస్ పెర్ఫార్మంటే యొక్క ఓవర్‌స్టీర్ లక్షణాలను మెరుగుపరుస్తుందని లాంబోర్ఘిని పేర్కొంది.

అత్యంత శక్తివంతమైన లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మెంటే (Lamborghini Urus Performante) ఆవిష్కరణ

లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే తేలికైన 22 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉండి, వాటిపై పిరెల్లి పి జీరో ట్రోఫియో R 285/40 R22 (ముందు) మరియు 325/35 R22 (వెనుక) టైర్‌లతో అమర్చబడి ఉంటుంది. ఉరుస్ పెర్ఫార్మంటేకి అమర్చిన ఈ ట్రోఫియో ఆర్ (Trofeo R) టైర్లను పీరెల్లి (Pirelli) మొదటిసారిగా లాంబోర్ఘిని సహకారంతో ఈ ఎస్‌యూవీ కోసం ప్రత్యేకంగా సెమీ-స్లిక్ టైర్ కాంపౌండ్‌తో అభివృద్ధి చేసింది.

అత్యంత శక్తివంతమైన లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మెంటే (Lamborghini Urus Performante) ఆవిష్కరణ

కొత్త లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మెంటే కొలతలను గమనిస్తే, ఇది 5,137 మిమీ పొడవు, 2,026 మిమీ వెడల్పు మరియు 1,618 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ఉరుస్ పెర్ఫార్మంటే యొక్క వీల్‌బేస్ 3,006 మిమీ మరియు దీని బరువు 2,150 కిలోలుగా ఉంటుంది. స్టాండర్డ్ ఉరుస్ మోడల్‌తో పోలిస్తే, కొత్త లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే 25 మిమీ ఎక్కువ పొడవు, 16 మిమీ ఎక్కువ వెడల్పును కలిగి ఉండి, స్టాండర్డ్ ఉరుస్ కంటే 47 కిలోలు తేలికైనదిగా ఉంటుంది. తేలికైన కార్బన్-ఫైబర్ భాగాలను ఉపయోగించడం ద్వారా దీని బరువును గణనీయంగా తగ్గించగలిగారు.

అత్యంత శక్తివంతమైన లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మెంటే (Lamborghini Urus Performante) ఆవిష్కరణ

లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే డిజైన్ విషయానికి వస్తే, ఇది దాదాపుగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, లుక్స్ పరంగా చాలా సూక్ష్మమైన అప్‌డేట్‌లు ఇందులో ఉన్నాయి. ఈసారి ఇది ఇటాలియన్ మార్క్‌కి కాస్తంత భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కొత్త ఉరుస్ పెర్ఫార్మంటే మరింత శక్తివంతమైన ఇంజన్ కోసం కూలింగ్‌ను పెంచడంలో సహాయపడే వెంట్‌లతో కూడిన కొత్త కార్బన్ ఫైబర్ బానెట్‌ను కలిగి ఉంది. ఉరుస్ కొత్త ఎయిర్ కర్టెన్‌తో అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ బంపర్‌ను కూడా కలిగి ఉంది.

అత్యంత శక్తివంతమైన లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మెంటే (Lamborghini Urus Performante) ఆవిష్కరణ

కొత్త ఉరుస్ పెర్ఫార్మంటే కోసం మూడు డిజైన్ వీల్ ఆప్షన్‌లు ఉన్నాయి. వీటిలో రెండు 22 ఇంచ్ సైజులో ఉంటే, ఒకటి మాత్రం 23 ఇంచ్ సైజులో ఉంటుంది. లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే యొక్క విస్తృతమైన ట్రాక్ కార్బన్ ఫైబర్‌తో ఫినిష్ చేయబడిన వీల్ఆర్చ్ లను కలిగి ఉండేలా చేసింది. వెనుక వైపున, ఉరుస్ పెర్ఫార్మంటే అవెంటడార్ ఎస్‌విజే మోడల్ నుండి ప్రేరణ పొందిన కార్బన్ ఫైబర్ వింగ్స్ తో కొత్త రియర్ వింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ వింగ్ డౌన్‌ఫోర్స్ స్థాయిలను 38 శాతం పెంచుతుంది.

అత్యంత శక్తివంతమైన లాంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మెంటే (Lamborghini Urus Performante) ఆవిష్కరణ

ఉరుస్ పెర్ఫార్మంటే వెనుక బంపర్ మరియు డిఫ్యూజర్ కార్బన్ ఫైబర్‌తో పాటు అక్రాపోవిక్ అందించిన తేలికపాటి టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఇక ఈ కారులోని ఇంటీరియర్స్‌లో చిన్నపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. కొత్త ఉరుస్ పెర్ఫార్మంటే లోపలి భాగంలో సరికొత్త స్టిచింగ్ ప్యాటర్న్ మరియు బ్లాక్ ఆల్కాంటారా అప్‌హోలెస్ట్రీ ప్రధానంగా ఆకట్టుకుంటుంటాయి. ఉరుస్ పెర్ఫార్మంటే డోర్ హ్యాండిల్స్, ఎయిర్ వెంట్స్, స్పాయిలర్ లిప్ మరియు బోనెట్‌ లపై డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో చాలా ప్రత్యేకంగా మరియు స్టాండర్డ్ మోడల్ నుండి భిన్నంగా కనిపిస్తుంది.

Most Read Articles

English summary
Lamborghini urus performante super suv revealed at monterey car week details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X