కస్టమర్లలో పెరుగుతున్న ఆందోళన.. XUV700 కి ముచ్చటగా మూడవ సారి రీకాల్ ప్రకటించిన Mahindra

'మహీంద్రా అండ్ మహీంద్రా' యొక్క పాపులర్ ఎస్‌యువి 'ఎక్స్​యూవీ700' (XUV700) కోసం కంపెనీ ఇప్పుడు ముచ్చటగా మూడవ సారి రీకాల్ ప్రకటించడం జరిగింది. ఇంతకీ ఇందులోని సమస్య ఏమిటి, రీకాల్ ప్రకటించడానికి గల కారణం ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

కస్టమర్లలో పెరుగుతున్న ఆందోళన.. XUV700 కి ముచ్చటగా మూడవ సారి రీకాల్ ప్రకటించిన Mahindra

ప్రజలకు ఎంతగానో నమ్మికైన బ్రాండ్, అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ పొందిన బ్రాండ్ ఇప్పుడు మూడవసారి రీకాల్ కి గురైంది. ఈ వార్త మహీంద్రా XUV700 కష్టమర్ల గుండెల్లో గుబులు రేపింది. ఇప్పటికే రెండుసార్లు కంపెనీ ఈ SUV కోసం రీకాల్ ప్రకటించింది.

కస్టమర్లలో పెరుగుతున్న ఆందోళన.. XUV700 కి ముచ్చటగా మూడవ సారి రీకాల్ ప్రకటించిన Mahindra

ఇప్పుడు ఈ SUV లో 'ఆల్టర్నేటర్ బెల్ట్ మరియు ఆటో-టెన్షనర్' సరిచేయడం కోసం రీకాల్ ప్రకటించింది. ఇంతకు మొదటిసారి ప్రాప్ షాఫ్ట్‌ని తనిఖీ చేసి, అవసరమైతే భర్తీ చేయడానికి మొదటి రీకాల్ ప్రకటించింది. రెండవ సారి AWD వేరియంట్‌లలో రియర్ కాయిల్ స్ప్రింగ్‌లను తనిఖీ చేయడం కోసం రీకాల్ ప్రకటించింది.

కస్టమర్లలో పెరుగుతున్న ఆందోళన.. XUV700 కి ముచ్చటగా మూడవ సారి రీకాల్ ప్రకటించిన Mahindra

మొదటి రెండు సార్లు ప్రకటించిన రీకాల్స్ కంటే ఇప్పుడు ప్రకటించిన రీకాల్ క్రిటికల్ రీకాల్ గా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఆల్టర్నేటర్ బెల్ట్ అనేది వాహనం యొక్క ఇంజిన్‌ను ఆల్టర్నేటర్‌కు అనుసంధానించబడే ఒక భాగం. ఇది ఆల్టర్నేటర్ యొక్క పనితీరును నిరారిస్తుంది. నిజానికి ఇది బ్యాటరీని రీ-ఛార్జ్ చేయడానికి వాహనం యొక్క ఇంజిన్ నుండి శక్తిని పొందుతుంది.

కస్టమర్లలో పెరుగుతున్న ఆందోళన.. XUV700 కి ముచ్చటగా మూడవ సారి రీకాల్ ప్రకటించిన Mahindra

ఆల్టర్నేటర్ బెల్ట్ స్నాప్ అయినట్లయితే, అది వాహనం యొక్క బ్యాటరీని వేగంగా డిశ్చార్జ్ చేయడానికి దారి తీస్తుంది. ఇది వాహనం త్వరగా విచ్ఛిన్నం కావడానికి దారితీస్తుంది. కావున ముందస్తుగానే కంపెనీ దీనిని గుర్తించి సరిచేయడానికి ఈ రీకాల్ ప్రకటించింది. ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించిన సమస్యలు తలెత్తలేదు. అయితే భవిష్యత్ లో ఎలాంటి ప్రమాదం జరగకుండా కంపెనీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కావున కస్టమర్లు తమ XUV700 ను సమీప మహీంద్రా డీలర్‌షిప్‌లో చెక్ చేసుకోవచ్చు.

కస్టమర్లలో పెరుగుతున్న ఆందోళన.. XUV700 కి ముచ్చటగా మూడవ సారి రీకాల్ ప్రకటించిన Mahindra

ఇదిలా ఉండగా.. మహీంద్రా కంపెనీ తన ఎక్స్​యూవీ700 కోసం బుకింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 1.5 లక్షల బుకింగ్స్ పొందింది. ప్రస్తుతానికి కంపెనీ 50,000 యూనిట్లను డెలివరీ చేసింది. ఇంకా 1 లక్ష యూనిట్లు డెలివరీ చేయాల్సి ఉంది. ఇప్పటికి కూడా కొన్ని వేరియంట్స్ కోసం కస్టమర్లు దాదాపు 2 సంవత్సరాల వరకు ఎదురుచూడాల్సి ఉంది.

కస్టమర్లలో పెరుగుతున్న ఆందోళన.. XUV700 కి ముచ్చటగా మూడవ సారి రీకాల్ ప్రకటించిన Mahindra

నిజానికి మహీంద్రా కంపెనీ తన XUV700 కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన కేవలం 3 గంటల సమయంలోనే 50,000 బుకింగ్స్ స్వీకరించి గొప్ప రికార్డ్ సృష్టించింది. దీన్ని బట్టి చూస్తే ఈ SUV కి ప్రారంభం నుంచి ఎంత డిమాండ్ ఉందొ స్పష్టంగా అర్థమవుతుంది.

కస్టమర్లలో పెరుగుతున్న ఆందోళన.. XUV700 కి ముచ్చటగా మూడవ సారి రీకాల్ ప్రకటించిన Mahindra

మహీంద్రా కంపెనీ ఇప్పుడు తన ఆధునిక SUV లోని కొన్ని వేరియంట్స్ లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేసింది, అదే సమయంలో కొన్ని వేరియంట్లలో ఫీచర్స్ తగ్గించింది. ఎక్స్​యూవీ700 లోని MX, AX3, AX5, AX7 మరియు AX7 L వేరియంట్లలో మార్పులు జరిగాయని తెలుస్తుంది. ఈని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

కస్టమర్లలో పెరుగుతున్న ఆందోళన.. XUV700 కి ముచ్చటగా మూడవ సారి రీకాల్ ప్రకటించిన Mahindra

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముంహుకు సాగుతున్న మహీంద్రా XUV700 కి ఒక్కసారిగా రీకాల్ ప్రకటించడం కస్టమర్లకు కొంత గందరగోళాన్ని కలిగించింది. అందులోనూ ఒకే నెలలో మూడు సార్లు కాబట్టి తప్పకుండా కొంత ఆందోళన చెందుతారు. అయితే కంపెనీ ప్రస్తుతం తన వాహనాలలో భవిష్యత్ లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ముందస్తు చర్యగా ఈ రీకాల్ ప్రకటించడం జరిగింది. కస్టమర్లు తప్పకుండా దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.

Most Read Articles

English summary
Mahindra xuv700 recalled again reason details
Story first published: Thursday, July 28, 2022, 17:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X