కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ వెల్లడి.. అనేక కొత్త మార్పులతో వస్తున్న సరికొత్త హెక్టర్..

బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్, భారత మార్కెట్లో స్థిరంగా వృద్ధి బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ భారత మార్కెట్లో కేవలం ఎస్‌యూవీ మోడళ్లను మాత్రమే విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. కంపెనీ తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో పరిమిత మోడళ్లను మాత్రమే కలిగి ఉన్నప్పటికీ, వాటికి బలమైన డిమాండ్‌ను పొందుతోంది. ఎమ్‌‌జి మోటార్ ఇండియా తొలిసారిగా హెక్టర్ ఎస్‌యూవీని విడుదల చేయడం ద్వారా భారత మార్కెట్లో అధికారికంగా ప్రవేశించింది. కాగా, గతేడాది కంపెనీ ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ 2021 మోడల్ ను విడుదల చేసింది మరియు ఇది ఈ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా ఉంది.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ వెల్లడి.. అనేక కొత్త మార్పులతో వస్తున్న సరికొత్త హెక్టర్..

తాజా సమాచారం ప్రకారం, ఎమ్‌జి మోటార్ ఇండియా (MG Motor India) తమ హెక్టర్ (Hector) మోడల్ లో ఇప్పుడు ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీకి సంబంధించి ఓ లేటెస్ట్ టీజర్ ను కూడా విడుదల చేసింది. గతంలో కంపెనీ కొత్త మోడల్ హెక్టర్ లోపలి వైపు క్యాబిన్‌లో చేసిన మార్పులను హైలైట్ చేయగా, ఈ కొత్త టీజర్ ఇప్పుడు 2022 మోడల్ హెక్టర్ ఎస్‌యూవీ వెలుపలి భాగంలో చేసిన మార్పులను వెల్లడిస్తోంది.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ వెల్లడి.. అనేక కొత్త మార్పులతో వస్తున్న సరికొత్త హెక్టర్..

హెక్టర్ యొక్క లేటెస్ట్ టీజర్ లో కంపెనీ ఇందులో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియా వివరాలను వెల్లడించింది. ఇందులో కొత్త గ్రిల్‌ కనిపిస్తుంది. కంపెనీ ఈ కొత్త గ్రిల్ డిజైన్ ను "ఆర్గైల్-ప్రేరేపిత డైమండ్ మెష్ గ్రిల్"గా ప్రచారం చేస్తోంది, ఇది ప్రస్తుతం హెక్టర్ మోడల్ లో అందిస్తున్న గ్రిల్ కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇదివరకటి టీజర్ లో కంపెనీ తమ కొత్త హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్ లో అప్‌డేట్ చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను కూడా హైలైట్ చేసింది.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ వెల్లడి.. అనేక కొత్త మార్పులతో వస్తున్న సరికొత్త హెక్టర్..

మునుపటి టీజర్‌లలో కంపెనీ ఇందులోని కొత్త స్క్రీన్‌ను ప్రదర్శిస్తూ, హెక్టర్ మరింత పెద్ద 14 ఇంచ్ పోర్ట్రెయిట్ ఓరియెంటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందడానికి సిద్ధంగా ఉందని కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ కొత్త యూనిట్ ఇప్పటికే ఉన్న 10.4 ఇంచ్ యూనిట్‌ను భర్తీ చేస్తుందా లేక ప్రస్తుత యూనిట్‌తో పాటు ఎంపిక చేసిన వేరియంట్‌లలో మాత్రమే అందించబడుతుందా అనేది తెలియాల్సి ఉంది. నవీకరించబడిన ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు, కారు కొత్త డ్యాష్‌బోర్డ్, హారిజాంటల్ ఎయిర్ కండిషనింగ్ వెంట్‌లు, స్క్వేర్డ్ పుష్-స్టార్ట్, యాచ్-స్టైల్ గేర్ లివర్ వంటి ఇతర అప్‌డేట్‌లతో సహా అనేక ఇతర అప్‌గ్రేడ్‌లను కూడా పొందే అవకాశం ఉంది.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ వెల్లడి.. అనేక కొత్త మార్పులతో వస్తున్న సరికొత్త హెక్టర్..

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ లోని క్లీనర్ డ్యాష్‌బోర్డ్ మరియు తక్కువ డయల్స్/బటన్‌ల కారణంగా, ఈ కొత్త MG కారు ప్రీమియం అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త మార్పులతో వస్తున్న కొత్త 2022 హెక్టర్ రిచ్ మరియు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడానికి వీలుగా కారు క్యాబిన్ స్థలాన్ని పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దానికి అనుగుణంగా కంపెనీ ఈ కొత్త 2022 మోడల్ లో మార్పులు చేర్పులు చేస్తోంది.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ వెల్లడి.. అనేక కొత్త మార్పులతో వస్తున్న సరికొత్త హెక్టర్..

ఓ నివేదిక ప్రకారం, కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఈ ఏడాది పండుగ సీజన్ లో మార్కెట్లో విడులయ్యే అవకాశం ఉంది. ఈ దీపావళి సీజన్‌లో హెక్టర్ ఎస్‌యూవీ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను కంపెనీ ఆవిష్కరించనుంది. కొత్త-తరం ఎమ్‌జి హెక్టర్‌లో ఆశించే అత్యంత ముఖ్యమైన మార్పులలో లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) అని నమ్ముతారు.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ వెల్లడి.. అనేక కొత్త మార్పులతో వస్తున్న సరికొత్త హెక్టర్..

ఈ ADAS క్రింద అందుబాటులో ఉన్న ఫీచర్లలో లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ ఆథెంటికేషన్ మరియు రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ మొదలైన ఫీచర్లను పొందే అవకాశం ఉంది. ఇవే కాకుండా, కంపెనీ ఈ కారులో మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్ మరియు అధునాతన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా పొందే అవకాశం ఉంది.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ వెల్లడి.. అనేక కొత్త మార్పులతో వస్తున్న సరికొత్త హెక్టర్..

దీనితో పాటు, ఇది కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా ఉంటుంది. ఇంకా ఇందులో 360-డిగ్రీ కెమెరా, పానోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్ గా సర్దుబాటు చేయగల కో-డ్రైవర్ సీటు, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, కీలెస్ ఎంట్రీ మరియు ఎనిమిది-స్పీకర్లతో కూడిన ప్రీమియం ఆడియో సిస్టమ్‌ మొదలైన ఫీచర్లు కూడా లభించనున్నాయి.

కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ వెల్లడి.. అనేక కొత్త మార్పులతో వస్తున్న సరికొత్త హెక్టర్..

ఇక ఇంజన్ ఆప్షన్లలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇందులోని 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ 170 Bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్టాండర్డ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. అలాగే, ఇందిలోని 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 143 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

Most Read Articles

English summary
New 2022 mg hector facelift teaser released front design details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X