కొత్త 2022 BMW 8 Series ఆవిష్కరణ.. ఈ ఏడాది భారతదేశంలో విడుదలయ్యే ఛాన్స్!

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ (BMW) తమ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 8 సిరీస్‌ సెడాన్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కొత్త 2022 మోడల్ కూప్ బాడీ స్టైల్ లో మునుపటి కన్నా మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఫేస్‌లిఫ్ట్‌లో భాగంగా, 2022 BMW 8 Series ఇప్పుడు కొత్త 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ఎనిమిది ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కొత్త మోడల్ ఈ ఏడాదిలో భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది.

కొత్త 2022 BMW 8 Series ఆవిష్కరణ.. ఈ ఏడాది భారతదేశంలో విడుదలయ్యే ఛాన్స్!

మొత్తం ఎనిమిది కలర్ ఆప్షన్లలో నాలుగు మెటాలిక్ ఆప్షన్లు మరియు నాలుగు మ్యాట్ ఫినిషింగ్ ఆప్షన్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ కారు ముందు బంపర్‌పై కొత్త స్ప్లిటర్ మరియు వెనుక బంపర్‌లో డిఫ్యూజర్‌ను కూడా అమర్చారు. దీనితో పాటుగా ఇందులో ఇల్యూమినేటెడ్ కిడ్నీ గ్రిల్ కూడా ఇవ్వబడింది. ఇంటీరియర్స్ లో చేసిన మార్పుల విషయానికి వస్తే, కొత్త 2022 మోడల్ బిఎమ్‌డబ్ల్యూ 8-సిరీస్ కారులో పెద్ద 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది.

కొత్త 2022 BMW 8 Series ఆవిష్కరణ.. ఈ ఏడాది భారతదేశంలో విడుదలయ్యే ఛాన్స్!

ఇక ఇందులో మరొక ప్రదానమైన మార్పు గురించి మాట్లాడితే, ఇది ఇప్పుడు కొత్త కార్బన్ ఫైబర్-ఫినిష్డ్ స్పోర్ట్స్ ఫ్రంట్ సీట్లతో లభ్యం కానుంది. ఇది చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా మంచి స్పోర్టీ ఫీల్ ను కూడా ఇస్తుంది. అయితే, ఈ ఫినిషింగ్ కారణంగా కాళ్లకు అడ్డుగా అనవసరమైన కార్బన్ ఫైబర్ ముక్క ఉన్నట్లు అనిపిస్తుంది మరియు దాని కారణంగా కారు లోపలికి ప్రవేశించేటప్పుడు మరియు నిష్క్రమించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

కొత్త 2022 BMW 8 Series ఆవిష్కరణ.. ఈ ఏడాది భారతదేశంలో విడుదలయ్యే ఛాన్స్!

ఇందులో పవర్‌ట్రెయిన్‌ మరిుయ డ్రైవ్‌ట్రైన్ మార్కెట్-నిర్దిష్టమైనది. ఈ కారులో ఆరు-సిలిండర్లతో కూడిన శక్తివంతమైన పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ ఆప్షన్లను ఉన్నాయి. అలాగే, ఇందులో మరింత స్పోర్టీ అప్పీల్ కోరుకునే వారికి విలాసవంతమైన ట్విన్-టర్బో వి8 ఇంజన్‌ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. భారతదేశంలో ప్రస్తుతం లభిస్తున్న ప్రీ-ఫేస్‌లిఫ్ట్ బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ 3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తోంది మరియు దీని గరిష్ట పవర్ అవుట్‌పుట్ 340 బిహెచ్‌పిలుగా ఉంటుంది.

కొత్త 2022 BMW 8 Series ఆవిష్కరణ.. ఈ ఏడాది భారతదేశంలో విడుదలయ్యే ఛాన్స్!

కొత్త 2022 బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ లో 4.4-లీటర్ ట్విన్-టర్బో వి8 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 600 బిహెచ్‌పిల శక్తిని జనరేట్ చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటాయి. మునుపటిలాగానే, ఈ ఫేస్‌లిఫ్టెడ్ బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ కారు రెండు డోర్లు మరియు నాలుగు-డోర్ల కూపే మరియు కన్వర్టిబుల్‌గా అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో మాత్రం ఈ కారు స్టాండర్డ్ ఫోర్ డోర్ కూప్ స్టైల్ లో ఇందుబాటులో ఉంటుంది.

కొత్త 2022 BMW 8 Series ఆవిష్కరణ.. ఈ ఏడాది భారతదేశంలో విడుదలయ్యే ఛాన్స్!

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2022 BMW 8 Series ఈ విభాయంలో పోర్ష్ పనామెరా వంటి మోడళ్లతో పోటీపడుతుంది. దీనితో పాటు, ఇది ఈ విభాదంలో Mercedes-AMG GT 4 డోర్ కూప్ మరియు Audi RS7 స్పోర్ట్‌బ్యాక్‌ వంటి మోడళ్లతో కూడా పోటీపడుతుంది.

కొత్త 2022 BMW 8 Series ఆవిష్కరణ.. ఈ ఏడాది భారతదేశంలో విడుదలయ్యే ఛాన్స్!

ఇదిలా ఉంటే, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఇటీవలే తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎక్స్3 (2022 BMW X3) ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఈ ఎస్‌యూవీ యొక్క X3 xDrive30i SportX ప్లస్ ట్రిమ్‌ను రూ. 59.90 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తుండగా, ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ అయిన X3 xDrive30i M స్పోర్ట్‌ను రూ. 65.90 లక్షలకు (ఎక్స్-షోరూమ్) ధరతో విక్రయిస్తోంది. కొత్త 2022 మోడల్ BMW X3 ఎస్‌యూవీని కంపెనీ ఆధునిక పరికరాలు, ఫీచర్లు మరియు కొత్త ఇంజన్‌తో అప్‌గ్రేడ్ చేసింది.

కొత్త 2022 BMW 8 Series ఆవిష్కరణ.. ఈ ఏడాది భారతదేశంలో విడుదలయ్యే ఛాన్స్!

కంపెనీ ఈ కారు భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి చేస్తోంది మరియు ఇది రెండు పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీ కోసం తన అన్ని అధీకృత డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్ లను ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు ఆన్‌లైన్ లో కూడా ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త కారులో ఆకర్షణీయమైన హెడ్‌లైట్, ఎల్ఈడి టెయిల్ లైట్, ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్ మరియు క్రోమ్ ఫినిషింగ్‌లో డిజైన్ చేసిన ఫ్రంట్ కిడ్నీ గ్రిల్‌ల వంటి డిజైన్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుంది.

కొత్త 2022 BMW 8 Series ఆవిష్కరణ.. ఈ ఏడాది భారతదేశంలో విడుదలయ్యే ఛాన్స్!

ఇంకా ఇందులో ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబల్ డంపర్‌లతో కూడిన అడాప్టివ్ సస్పెన్షన్‌ సెటప్ కూడా అందించబడింది. ఫలితంగా, ఇది డ్రైవింగ్ కండిషనింగ్ ను బట్టి సర్దుబాటు అవుతుంది. అంతేకాకుండా, ఈ కారులో స్టీరింగ్ వీల్ కు దిగువన ప్యాడిల్ షిఫ్టర్‌లను కూడా అందించారు మరియు ఇది గేర్‌షిఫ్టింగ్ మరియు డ్రైవింగ్ అనుభూతిని మరింత స్పోర్టీగా మారుస్తుంది. ఇంకా ఇందులో ఆటోమేటిక్ బ్రేకింగ్ ఫంక్షన్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్‌తో కూడిన ఆటోమేటిక్ డిఫరెన్షియల్ బ్రేక్ ఫీచర్లను స్టాండర్డ్ గా అందిస్తున్నారు.

కొత్త 2022 BMW 8 Series ఆవిష్కరణ.. ఈ ఏడాది భారతదేశంలో విడుదలయ్యే ఛాన్స్!

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2022 BMW X3 ఎస్‌యూవీలో 2-లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 252 బిహెచ్‌పి పవర్ ను మరియు 350 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఇంజన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
New 2022 model bmw 8 series facelift unveiled india launch expected soon details
Story first published: Friday, January 28, 2022, 15:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X