సంక్రాంతి కానుకగా వస్తున్న కొత్త 2022 Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్; ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్ వివరాలు వెల్లడి

ఇటీవలే తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ కుషాక్‌ (Skoda Kushaq) ని విడుదల చేసి విజయపథంలో ఉన్న చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో (Skoda Auto) ఇప్పుడు మరో కొత్త ఎస్‌యూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 7-సీటర్ ఎస్‌యూవీ 'స్కోడా కొడియాక్' ఫేస్‌లిఫ్ట్ (Skoda Kodiaq Facelift) మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి రాబోతోంది. కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని జనవరి నెలలో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు స్కోడా ఆటో ఇండియా ల్స్, సర్వీసెస్ మరియు మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోలిస్ ధృవీకరించిన సంగతి తెలిసినదే.

సంక్రాంతి కానుకగా వస్తున్న కొత్త 2022 Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్; ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్ వివరాలు వెల్లడి

కాగా, ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, కొత్త స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ ఎస్‌యూవీని జనవరి 14, 2022వ తేదీన మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, కొడియాక్ ఎస్‌యూవీ విడుదలకు ముందే ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కి సంబంధించిన ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ వివరాలు వెల్లడయ్యాయి. స్కోడా తమ కొత్త కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీకి మునుపటి కన్నా మరింత అగ్రెసివ్‌గా ఉండే ఎక్స్టీరియర్ రూపాన్ని అందించబోతోంది.

సంక్రాంతి కానుకగా వస్తున్న కొత్త 2022 Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్; ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్ వివరాలు వెల్లడి

ఎక్ట్సీరియర్ గురించి చెప్పాలంటే, ఇది ముందు భాగంలో స్కోడా యొక్క సిగ్నేచర్ గ్రిల్‌ని పొందుతుంది, ఇది క్రోమ్ సరౌండ్ రిబ్స్‌ని కలిగి ఉండి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, ఇందులో బాడీ కలర్ బంపర్ మరియు ఫ్రంట్ స్పాయిలర్, రిట్రాక్టబుల్ హెడ్‌లైట్ వాషర్, స్లిమ్ ఎల్ఈడి హెడ్‌లైట్‌లతో కూడిన ఇల్యూమినేటెడ్ ఐలాష్‌లు ఇవ్వబడ్డాయి. సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, ఇందులో డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, డోర్ హ్యాండిల్స్‌లో 4 రిక్వెస్ట్ సెన్సార్‌లతో కూడిన అధునాతన కేస్ మరియు ఫంక్షనల్ సిల్వర్ రూఫ్ రెయిల్స్ మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

సంక్రాంతి కానుకగా వస్తున్న కొత్త 2022 Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్; ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్ వివరాలు వెల్లడి

ఇక కొత్త 2022 స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ (2022 Skoda Kodiaq Facelift) రియర్ ప్రొఫైల్ ను గమనించినట్లయితే, ఇరువైపులా డైనమిక్ టర్న్ ఇండికేటర్స్ మరియు దాని మధ్యలో పెద్ద అక్షరాలతో కూడిన 'SKODA' బ్యాడ్జింగ్, వర్చువల్ పెడల్స్‌తో కూడిన ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ వంటి అనేక ఇతర గొప్ప ఫీచర్లు ఇందులో ఇవ్వబడ్డాయి. కేవలం ఎక్స్టీరియర్ లో మాత్రమే కాకుండా, ఇంటీరియర్ లో కూడా గణనీయమైన మార్పులు ఉండనున్నాయి. ఇందులో రీడిజైన్ చేయబడిన క్యాబిన్ ఉంటుంది.

సంక్రాంతి కానుకగా వస్తున్న కొత్త 2022 Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్; ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్ వివరాలు వెల్లడి

ఇటీవల స్కోడా ఆటో ఇండియా విడుదల చేసిన టీజర్ చిత్రాలను గమనిస్తే, కొత్త 2022 స్కోడా కోడియాక్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ బేజ్ ఇంటీరియర్ థీమ్‌ను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే, దాని డ్యాష్‌బోర్డ్‌ చాలా మినిమలిస్ట్ డిజైన్‌ను కలిగి ఉండి, అంతే ప్రీమియం అప్పీల్ ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

సంక్రాంతి కానుకగా వస్తున్న కొత్త 2022 Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్; ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్ వివరాలు వెల్లడి

కారు లోపల డ్యాష్‌బోర్డ్ మధ్యలో బిల్ట్ ఇన్ నావిగేషన్ మరియు వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. డ్రైవర్‌కు వివిధ రకాల సమాచారాన్ని తెలియజేసేందుకు స్టీరింగ్ వెనుక భాగంలో అమర్చిన పెద్ద 10.25 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఇవేకాకుండా, ఇందులో త్రీ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ సిస్టమ్ కూడా ఉంటుంది.

సంక్రాంతి కానుకగా వస్తున్న కొత్త 2022 Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్; ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్ వివరాలు వెల్లడి

ఇంకా ఇందులో అన్ని డోర్లపై స్పీకర్లు (మొత్తం 12 స్పీకర్లతో కూడిన కాంటన్ సౌండ్ సిస్టమ్‌), హీటింగ్ మరియు కూలింగ్ ఫీచర్ తో కూడిన వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 12 వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, సీట్ మెమరీ ఫంక్షన్‌, ఎలక్ట్రానిక్ పానోరమిక్ సన్‌రూఫ్‌, హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, యాంబియంట్ లైటింగ్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 9 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి మరిన్నో ఫీచర్లు ఉన్నాయి.

సంక్రాంతి కానుకగా వస్తున్న కొత్త 2022 Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్; ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్ వివరాలు వెల్లడి

ఇంజన్ ఆప్షన్ విషయానికి వస్తే, కొత్త 2022 స్కోడా కొడియాక్‌ ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ తో లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీని పవర్‌ఫుల్ 2.0 లీటర్, టర్బో పెట్రోల్ ఇంజన్‌తో అందించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 190 bhp శక్తిని మరియు 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7 స్పీడ్ డిసిటి (డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడే అవకాశం ఉంది.

సంక్రాంతి కానుకగా వస్తున్న కొత్త 2022 Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్; ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్ వివరాలు వెల్లడి

ఈ ఇంజన్ నుండి వెలువడే శక్తిని ఈ గేర్‌బాక్స్ నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ కారు కేవలం 7.5 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇక చివరిగా ధరల విషయానికి వస్తే, చెక్ రిబ్లిక్ కంపెనీ తమ కొత్త స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని దాదాపు రూ. 35 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేవచ్చని భావిస్తున్నారు. కంపెనీ గతంలో విక్రయించిన ప్రీ-ఫేస్‌లిఫ్ట్ 5-సీటర్ మోడల్ ను రూ. 33 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విక్రయించింది.

సంక్రాంతి కానుకగా వస్తున్న కొత్త 2022 Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్; ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్ వివరాలు వెల్లడి

కొత్త 2022 స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ హ్యుందాయ్ టక్సన్ మరియు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ వంటి ప్రీమియం కార్లతో పోటీ పడనుంది.

Most Read Articles

English summary
New 2022 skoda kodiaq facelift suv launch around the corner exterior and interior details revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X