భారత్‌లో విడుదలైన కొత్త BMW X3: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) భారతీయ మార్కెట్లో తన ఎక్స్3 (X3) SUV నిఅధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త లగ్జరీ కార్ ప్రారంభ ధర రూ. 59.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ ఈ కొత్త X3 యొక్క బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన కొత్త BMW X3 విడుదల: ధర & వివరాలు ఇక్కడ చూడండి

BMW X3 ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి X3 xDrive30i SportX Plus కాగా మరొకటి X3 xDrive30i M Sport. వీటి ధరలు వరుసగా రూ. 59.90 లక్షలు మరియు రూ. 65.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇవి రెండూ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఈ కారు భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి చేయబడుతోంది మరియు రెండు పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో విడుదలైన కొత్త BMW X3 విడుదల: ధర & వివరాలు ఇక్కడ చూడండి

కొత్త BMW X3 అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్ మరియు క్రోమ్ ఫినిషింగ్‌తో ఫ్రంట్ కిడ్నీ గ్రిల్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకూండా స్టీరింగ్ వీల్ ప్యాడిల్ షిఫ్టర్‌లు, బ్రేకింగ్ ఫంక్షన్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్‌తో కూడిన ఆటోమేటిక్ డిఫరెన్షియల్ బ్రేక్ (ADB) వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.

భారత్‌లో విడుదలైన కొత్త BMW X3 విడుదల: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఈ కొత్త SUVలో BMW పెర్ఫార్మెన్స్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది, ఇది వీల్స్ వద్ద ఫోకస్డ్ బ్రేకింగ్ ద్వారా వాహనం యొక్క స్థిరత్వాన్ని పెంచుతుంది. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన కొత్త BMW X3 విడుదల: ధర & వివరాలు ఇక్కడ చూడండి

BMW X3 లో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబటులో ఉంటాయి. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, అటెన్షన్ అసిస్టెన్స్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (CBC), ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్ మరియు క్రాష్ సెన్సార్, ISOFIX చైల్డ్ సీట్ మౌంటింగ్ ఉన్నాయి. ఇది కాకుండా, లోడ్ ఫ్లోర్ క్రింద ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ స్పేర్ వీల్ కూడా అందించబడింది.

భారత్‌లో విడుదలైన కొత్త BMW X3 విడుదల: ధర & వివరాలు ఇక్కడ చూడండి

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులోని క్యాబిన్ లేఅవుట్ అప్‌డేట్ చేయబడింది. ఇది 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ గేజ్ క్లస్టర్, లేటెస్ట్ ఐడ్రైవ్ కనెక్టివిటీ, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి వాటిని పొందుతుంది.

భారత్‌లో విడుదలైన కొత్త BMW X3 విడుదల: ధర & వివరాలు ఇక్కడ చూడండి

BMW X3 SUV యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2-లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ అందుబటులో ఉంది. ఈ ఇంజన్ 252 bhp శక్తిని మరియు 350 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ SUV కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 km/h వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. అయితే ఇందులో డీజిల్ మోడల్‌ మరికొద్ది రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

భారత్‌లో విడుదలైన కొత్త BMW X3 విడుదల: ధర & వివరాలు ఇక్కడ చూడండి

BMW X3 దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ జిఎల్‌సి, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, ఆడి క్యూ5 మరియు వోల్వో ఎక్స్‌సి 60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో ఈ కొత్త లగ్జరీ SUV అడుగు పెట్టింది. ఇక ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.

భారత్‌లో విడుదలైన కొత్త BMW X3 విడుదల: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఇదిలా ఉండగా కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇటీవల మార్కెట్లో తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు 'ఐఎక్స్' ను విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 1.15 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంటుంది. ఈ కొత్త మోడల్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన కొత్త BMW X3 విడుదల: ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారత విపణిలో BMW iX ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం ఒకే ఒక వేరియంట్లో మాత్రమే విడుదల చేయబడింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని xDrive40 రూపంలో అందింస్తోంది. కొత్త BMW iX xDrive40 ఎలక్ట్రిక్ కారులో 76.6kWh సామర్థ్యంతో కూడిన ట్విన్ బ్యాటరీ ప్యాక్ సెటప్ ఉంటుంది. ఇది రెండు యాక్సిల్స్ లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్లకు శక్తిని పంపిణీ చేస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి గరిష్టంగా 322 బిహెచ్‌పి శక్తిని మరియు 630Nm టార్క్‌ ని ఉత్పత్తి చేస్తాయి.

భారత్‌లో విడుదలైన కొత్త BMW X3 విడుదల: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఇందులోని సింగిల్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు బిఎమ్‌డబ్ల్యూ యొక్క ఎక్స్‌డ్రైవ్ (xDrive) ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్ల నుండి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది. బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్40 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 6.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు మరియు గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
New bmw x3 suv launched price features specifications details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X