ఐయోనిక్ 5 బుకింగ్ డేట్ ఫిక్స్ చేసిన Hyundai.. పూర్తి వివరాలు

ఇప్పటికే చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి, ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అయితే 'హ్యుందాయ్' కంపెనీ నేను సైతం అంటూ 'ఐయోనిక్ 5' ఎలక్ట్రిక్ కారుని ఇప్పటికే వెల్లడించింది. కాగా ఇప్పుడు బుకింగ్స్ గురించి సమాచారం అందించింది.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, హ్యుందాయ్ ఐయోనిక్ 5' (Hyundai Ioniq 5) బుకింగ్స్ 2022 డిసెంబర్ 20 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP)పై ఆధారపడి ఉంటుంది. కావున మంచి డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, పర్ఫామెన్స్ కూడా అంతకు మించి ఉండే అవకాశం ఉంటుంది.

ఐయోనిక్ 5 బుకింగ్ డేట్ ఫిక్స్ చేసిన Hyundai

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదలకానున్న హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు రెండు పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో మొదటిది సింగిల్-మోటార్ లేఅవుట్. ఇది 169 హెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై దాదాపుగా 354 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 58kWh బ్యాటరీ ప్యాక్ మరియు 72.6kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటాయి.

అయితే కంపెనీ యొక్క హై ట్రిమ్ డ్యూయల్-మోటార్, ఆల్-వీల్-డ్రైవ్ లేఅవుట్‌ను పొందుతుంది. కావున ఇది 325 హెచ్‌పి పవర్ మరియు 605 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుని 220 కిలోవాట్ డిసి ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం చార్జ్ చేసుకోవచ్చు. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ '2022 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా కైవసం చేసుకుంది.

హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది దాదాపు రూ. 38 లక్షల నుంచి రూ. 45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుందని ఆశిస్తున్నాము. ఐయానిక్ 5 విడుదలైతే ఇది కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడి ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు విడుదలైన తరువాత కియా ఈవి6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

హ్యుందాయ్ కంపెనీ గతంలో చెన్నై రోడ్లపై ఈ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ చేసింది. బహుశా ఇది విదేశాల నుండి దిగుమతి చేసుకున్న మోడల్ కావచ్చని తెలుస్తోంది. హ్యుందాయ్ తమ సిస్టర్ కంపెనీ కియా మాదిరిగా తమ ఎలక్ట్రిక్ కారును విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకోవడం లేదు. దానికి బదులుగా, ఇక్కడే భారతదేశంలో ఈ కారును అసెంబుల్ చేసి, ఈవీ6 కన్నా తక్కువ ధరకే విక్రయించాలని చూస్తోంది.

భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రోజు రోజుకి అమాంతం పెరిగిపోతున్న సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలను మంచి డిమాండ్ ఉంది. ఈ తరుణంలో హ్యుందాయ్ కంపెనీ ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారుని (Hyundai Ioniq 5) విడుదల చేస్తే తప్పకుండా మంచి ఆదరణ పొందుతుంది అని భావిస్తున్నాము. అయితే దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఇది ఎలాంటి ఆదరణ పొందుతుంది అనే వివరాలు త్వరలో తెలుస్తాయి.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు 2023 లో జరగనున్న 'ఆటో ఎక్స్‌పో' లో విడుదయ్యే అవకాశం ఉంది. 2023 ఆటో ఎక్స్‌పో గ్రేటర్ నోయిడాలో 2023 జనవరి నెలలో జరుగుతుంది. ఇందులో హ్యుందాయ్ ఐయోనిక్ 5 తో పాటు అనేక ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైకులు కూడా ప్రదర్శించబడతాయి. 2023 ఆటో ఎక్స్‌పో గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New hyundai ioniq 5 bookings details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X