కలిసొచ్చిన 2021.. పెరిగిన డిసెంబర్ సేల్స్: Nissan India

2021 డిసెంబర్ నెల ముగిసింది, 2022 జనవరి నెల కూడా ప్రారంభమయ్యింది. అయితే ఈ నేపథ్యంలో భాగంగా నిస్సాన్ కంపెనీ తమ 2021 డిసెంబర్ నెల అమ్మకాల నివేదికను విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కలిసొచ్చిన 2021.. పెరిగిన డిసెంబర్ సేల్స్: Nissan India

జపనీస్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియా (Nissan India) భారతీయ మార్కెట్లో తన 2021 డిసెంబర్ అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం నిస్సాన్ ఇండియా డిసెంబరు 2021 లో నిస్సాన్ మరియు డాట్సన్ బ్రాండ్‌ల మొత్తం 3,010 వాహనాల దేశీయ మార్కెట్లో విక్రయించినట్లు తెలిపింది. ఇందులో నిస్సాన్ యొక్క మాగ్నైట్ విజయవంతమైన మోడల్ గా నిలిచింది.

కలిసొచ్చిన 2021.. పెరిగిన డిసెంబర్ సేల్స్: Nissan India

నిస్సాన్ ఇండియా అందించిన సమాచారం ప్రకారం, 2021 డిసెంబర్ నెలలో దేశీయ మార్కెట్లో 159% భారీ వృద్ధిని నమోదు చేసినట్లు తెలిసింది. నిస్సాన్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఏడాది 27,965 వాహనాలను విక్రయించగలిగింది. అయితే 2020 సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు కంపెనీ కేవలం 6,609 వాహనాలను మాత్రమే విక్రయించింది.

కలిసొచ్చిన 2021.. పెరిగిన డిసెంబర్ సేల్స్: Nissan India

కంపెనీ యొక్క అమ్మకాలు 2020 కంటే 2021 లో ఎక్కువగా ఉన్నాయి. 2021 లో 2020 కంటే కూడా 323 శాతం వృద్ధిని నమోదు చేసుకోగలిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమ్మకాలు 2021 లో బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.

కలిసొచ్చిన 2021.. పెరిగిన డిసెంబర్ సేల్స్: Nissan India

ఇక కంపెనీ యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, భారతీయ తీరాల నుండి 2021 సంవత్సరంలో మొత్తం 28,582 వాహనాలను ఎగుమతి చేసినట్లు నివేదికల ప్రకారం తెలుస్తోంది. అయితే, గత ఏడాది 2020 లో కంపెనీ మొత్తం 17,785 వాహనాలను ఎగుమతి చేసింది. ఎగుమతుల్లో కూడా కంపెనీ 61 శాతం వృద్ధిని నమోదు చేసింది.

కలిసొచ్చిన 2021.. పెరిగిన డిసెంబర్ సేల్స్: Nissan India

నిస్సాన్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ 2021 డిసెంబర్ విక్రయాల గురించి మాట్లాడుతూ.. దేశంలో కరోనా మహమ్మరి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కూడా కంపెనీ మంచి అమ్మకాలను పొందగలిగింది. అయితే ప్రస్తుతం కంపెనీ సెమీకండక్టర్ చిప్ కొరతను ఎదుర్కుంటోంది. అయినప్పటికీ అమ్మకాల్లో 323 శాతం పెరుగుదలను నమోదు చేయగలిగాము.

కలిసొచ్చిన 2021.. పెరిగిన డిసెంబర్ సేల్స్: Nissan India

నిస్సాన్ ఇండియా తన నిస్సాన్ మాగ్నైట్‌ SUV ని 35,000 యూనిట్లను డెలివరీ చేయగలిగింది. నిస్సాన్ మాగ్నైట్ కోసం ఇప్పటి వరకూ 75,567 యూనిట్లకు పైగా బుకింగ్స్ పొందగలిగింది. నిస్సాన్ మాగ్నైట్ కారణంగా భారతదేశంలో కంపెనీ అమ్మకాలు కూడా పెరిగాయి.

కలిసొచ్చిన 2021.. పెరిగిన డిసెంబర్ సేల్స్: Nissan India

అంతే కాకుండా, భారత దేశంలో నిస్సాన్ ఇండియా మార్కెట్ వాటా కూడా మునుపటికంటే మరింత పెరిగింది. ఏప్రిల్-అక్టోబర్ 2021 కాలంలో కంపెనీ వాటా ఏడాది క్రితం 0.37 శాతంగా (4,431 యూనిట్లు) ఉంటే అది ఇప్పుడు 1.38 శాతానికి (22,304 యూనిట్లు) శాతానికి పెరిగింది.

కలిసొచ్చిన 2021.. పెరిగిన డిసెంబర్ సేల్స్: Nissan India

ప్రస్తుతం భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ XE (బేస్), XL (మిడ్), XV (హై) మరియు XV (ప్రీమియం) అనే వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులోని ప్రతి వేరియంట్ కూడా న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. కాకపోతే, ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ మాత్రం అందుబాటులో లేదు. మాగ్నైట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్‌ గేర్‌బాక్స్ తో లభిస్తుండగా, 1.0 టర్బో పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. నిస్సాన్ మాగ్నైట్‌ దేశీయ మార్కెట్లో 2020 డిసెంబర్ 02 న రూ. 4.99 లక్షల వద్ద విడుదలైంది.

కలిసొచ్చిన 2021.. పెరిగిన డిసెంబర్ సేల్స్: Nissan India

నిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి పవర్‌ను మరియు 152 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే, 1.0 లీట్ న్యాచురల్ ఇంజన్ 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

కలిసొచ్చిన 2021.. పెరిగిన డిసెంబర్ సేల్స్: Nissan India

నిస్సాన్ నుండి వచ్చిన ఈ కాంపాక్ట్ ఎస‌యూవీ ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు కోసం ఇటీవల ASEAN NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో, నిస్సాన్ మాగ్నైట్ కు 5 స్టార్లకు గానూ 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ సేఫ్టీ రేటింగ్ కూడా నిస్సాన్ మాగ్నైట్ అమ్మకాల పెరుగుదలకు మరొక కారణంగా చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Nissan india sales december 3010 units 159 percent growth details
Story first published: Saturday, January 1, 2022, 13:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X