సంక్రాంతికి ముందే దేశీయ మార్కెట్లో Porsche నుంచి మరో రెండు కార్లు విడుదల: ధర & వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ పోర్షే (Porsche) భారతీయ మార్కెట్లో ఈ కొత్త సంవత్సరంలో రెండు ఆధునిక కార్లను విడుదల చేసింది. ఇందులో ఒకటి '718 కేమాన్ జిటిఎస్ 4.0' (718 Cayman GTS 4.0) కాగా, మరొకటి '718 బాక్స్‌స్టర్ జిటిఎస్ 4.0' (718 Boxster GTS 4.0). ఈ రెండు మోడల్స్ అధూరిక ఫీచర్స్ మరియు పరికరాలు కలిగి ఉంటాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త కార్లను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సంక్రాంతికి ముందే Porsche నుంచి మరో రెండు కార్లు విడుదల: ధర & వివరాలు

పోర్షే ఇండియా విడుదల చేసిన ఈ కార్ల ధరలు వరుసగా రూ. రూ. 1,46,50,000 (718 కేమాన్ జిటిఎస్ 4.0) మరియు రూ. 1,49,78,000 (718 బాక్స్టార్ జిటిఎస్ 4.0). ఇక్కడ తెలిపిన అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ. కొత్త పోర్స్చే 718 కేమాన్ ఏది రెండు-డోర్ల కూపే మోడల్, అయితే పోర్స్చే 718 బాక్స్‌స్టర్ మోడల్ రెండు-డోర్ల క్యాబ్రియోలెట్‌గా అందించబడుతుంది.

సంక్రాంతికి ముందే Porsche నుంచి మరో రెండు కార్లు విడుదల: ధర & వివరాలు

బ్రాండ్ యొక్క ఈ కొత్త స్పోర్ట్స్ కార్ల యొక్క ఎక్స్టీరియర్ విషయానికి వస్తే, ఇందులో LED DRLలతో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లు, GTS-ఫ్రంట్ ఆప్రాన్, 20 ఇంచెస్ శాటిన్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ ఎక్స్‌టర్నల్ ఎయిర్‌బ్లేడ్‌లు, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లు మరియు బ్లాక్ ఫ్రంట్ స్పాయిలర్ వంటివి అందుబాటులో ఉంటాయి.

సంక్రాంతికి ముందే Porsche నుంచి మరో రెండు కార్లు విడుదల: ధర & వివరాలు

ఇక ఇంజిన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే, పోర్స్చే జిటిఎస్ 4.0 యొక్క రెండు మోడల్‌లు 4.0-లీటర్ ఆరు-సిలిండర్ ఫ్లాట్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటాయి. ఈ ఇంజన్ 395 బిహెచ్‌పి పవర్ మరియు 430 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి పనితీరుని అందిస్తాయి. కావున వాహన వినియోగదారునికి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇంజిన్ 7-స్పీడ్ పిడికె ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

సంక్రాంతికి ముందే Porsche నుంచి మరో రెండు కార్లు విడుదల: ధర & వివరాలు

ఈ కొత్త మోడల్స్ లో పోర్స్చే స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ కంట్రోల్, టార్క్ వెక్టరింగ్, ఎలక్ట్రోమెకానికల్ పవర్ స్టీరింగ్, లాంచ్ కంట్రోల్ మరియు స్పోర్ట్ క్రోనో ప్యాకేజీ వంటి సేఫ్టీ మరియు పర్ఫామెన్స్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అంతే కాకూండా కొత్త పోర్స్చే 718 జిటిఎస్ స్పోర్ట్స్ సస్పెన్షన్‌తో గట్టి స్ప్రింగ్‌లు, గట్టి యాంటీ-రోల్ బార్‌లను పొందుతుంది.

సంక్రాంతికి ముందే Porsche నుంచి మరో రెండు కార్లు విడుదల: ధర & వివరాలు

పోర్షే ఇండియా యొక్క ఆధునిక మోడల్స్ ఫీచర్ల విషయానికొస్తే, ఈ రెండు కొత్త పోర్స్చే మోడల్‌లు పోర్స్చే కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్ (PCM)తో కూడిన 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను పొందుతాయి. అంతే కాకుండా, ఇది 4.6 ఇంచెస్ కలర్ స్క్రీన్, ఆటోమేటిక్ ఏసీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి వాటిని పొందుతుంది.

సంక్రాంతికి ముందే Porsche నుంచి మరో రెండు కార్లు విడుదల: ధర & వివరాలు

ఇదిలా ఉండగా.. భారత మార్కెట్లో తమ కొత్త 2021 మకాన్ (Macan) ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. పోర్ష్ ఈ లగ్జరీ స్పోర్ట్స్ ఎస్‌యూవీతో పాటుగా టేకాన్ అనే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును కూడా భారతదేశంలో విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 83.20 లక్షలు మరియు రూ. 1.50 కోట్లు (ఎక్స్-షోరూమ్).

సంక్రాంతికి ముందే Porsche నుంచి మరో రెండు కార్లు విడుదల: ధర & వివరాలు

కొత్త తరం మకాన్ ఎస్‌యూవీలో పోర్ష్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్ యొక్క 10.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డి టచ్ డిస్‌ప్లే ఉంటుంది ఇది Apple CarPlay, నావిగేషన్, వాయిస్ కంట్రోల్, Wi-Fi హాట్‌స్పాట్ మరియు పోర్ష్ కనెక్ట్ యాప్ లను సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ కారులో కొత్త ఇంటీరియర్ ట్రిమ్ ఎంపికలతో పాటుగా కొత్తగా రూపొందించిన సెంటర్ కన్సోల్‌ ఉంటుంది. ఈ సెంటర్ కన్సోల్ పై కంపెనీ చాలా చోట్ల భౌతిక బటన్లకు బదులుగా టచ్ సర్ఫేస్ లను ఉపయోగించింది. యూజర్లు ఇప్పుడు కేవలం చేతి స్పర్శతోనే అనేక ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు మరియు కంట్రోల్ చేయవచ్చు.

సంక్రాంతికి ముందే Porsche నుంచి మరో రెండు కార్లు విడుదల: ధర & వివరాలు

ఇక ఇంజన్ మరియు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కొత్త 2021 పోర్ష్ మకాన్ ఎస్‌యూవీ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని స్టాండర్డ్ మోడల్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజన్ 261 బిహెచ్‌పి పవర్ ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా జతచేయబడి ఉంటుంది.

సంక్రాంతికి ముందే Porsche నుంచి మరో రెండు కార్లు విడుదల: ధర & వివరాలు

అదే విధంగా ఇందులోని శక్తివంతమైన 2.9 లీటర్ ట్విన్-టర్బో వి6 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 375 బిహెచ్‌పి పవర్ ను మరియు 520 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఇందులోని టాప్-స్పెక్ మకాన్ జిటిఎస్ వేరియంట్లో ఇదే ఇంజన్ 434 బిహెచ్‌పి పవర్ ను మరియు 550 ఎన్ఎమ్ టార్క్‌ ను జనరేట్ చేసేలా ట్యూన్ చేయబడింది. ఈ ఇంజన్ కూడా 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తోనే లభిస్తుంది.

సంక్రాంతికి ముందే Porsche నుంచి మరో రెండు కార్లు విడుదల: ధర & వివరాలు

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, బేస్ వెర్షన్ కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 232 కిలోమీటర్లుగా ఉంటుంది. అదే 2.9 లీటర్ వి6 ఇంజన్ ను ఉపయోగించే మకాన్ జిటిఎస్ మోడల్ అయితే, గరిష్టంగా గంటకు 272 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులోని మిడ్-స్పెక్ మకాన్ ఎస్ వేరియంట్ కేవలం 4.6 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

సంక్రాంతికి ముందే Porsche నుంచి మరో రెండు కార్లు విడుదల: ధర & వివరాలు

ఇక Porsche Taycan EV గరిష్టంగా 600 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల రెండు ఎలక్ట్రిక్ మోటార్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 500 కిమీల రేంజ్‌ను అందించే రెండు హై వోల్టేజ్ లిథియం అయాన్ బ్యాటరీల ఎంపికను పొందుతుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. టైకాన్ క్రాస్ టురిస్మో టర్బో ఎస్ వేరియంట్ 761 బిహెచ్‌పి పవర్ మరియు 1050 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది దేశంలో విక్రయించబడుతున్న అత్యంత శక్తివంతమైన EV గా నిలిచింది.

సంక్రాంతికి ముందే Porsche నుంచి మరో రెండు కార్లు విడుదల: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో Porsche Taycan సెడాన్ Audi e-tron GT కి ప్రత్యర్థిగా ఉంది. అంతే కాకుండా Jaguar I-Pace మరియు Mercedes EQC ఎలక్ట్రిక్ వంటి వాటికీ కూడా ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సెడాన్ ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Porsche launches 718 cayman gts 4 0 718 boxster gts 4 0 in india price details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X