కొత్త సంవత్సరంలో కార్ల ధరలను పెంచిన రెనో (Renault); ఏయే మోడల్ ధర ఎంత పెరిగిందంటే..!

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా (Renault India) కూడా ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే కొత్త సంవత్సరంలో తమ కార్లను ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ జనవరి నెలలో రెనో కార్ల ధరలు మోడల్ మరియు వేరియంట్ ను బట్టి రూ. 31,000 వరకూ పెరిగాయి. మరి ఏయే మోడల్ పై ఎంత మేర ధరలు పెరిగాయనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త సంవత్సరంలో కార్ల ధరలను పెంచిన రెనో (Renault); ఏయే మోడల్ ధర ఎంత పెరిగిందంటే..!

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న విభాగాలలో సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం కూడా ఒకటి. ఇప్పటికే ఈ విభాగంలో అనేక కార్ కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టగా, ఈ విభాగంలో తన సత్తాను చూపేందుకు రెనో గతేడాది ఫిబ్రవరి నెలలో తమ కైగర్ (Renault Kiger)కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. కేవలం రూ. 5.45 లక్షల ప్రారంభ ధరకే మార్కెట్లోకి వచ్చి బడ్జెట్ కార్ ప్రియులను ఆకట్టుకున్న ఈ చిన్న ఎస్‌యూవీ ధరను కంపెనీ ఇప్పుడు భారీగా పెంచింది.

కొత్త సంవత్సరంలో కార్ల ధరలను పెంచిన రెనో (Renault); ఏయే మోడల్ ధర ఎంత పెరిగిందంటే..!

రెనో కైగర్ ధరను కంపెనీ సుమారు రూ. 31,000 వరకూ పెంచింది. తాజా ధరల పెంపు తర్వాత ప్రస్తుతం రెనో కైగర్ ధరలు రూ. 5.79 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. అయితే, కంపెనీ ఈ కారును మొదట్లో చాలా తక్కువ ధరకే మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. విడుదల సమయంలో ఈ కారు ప్రారంభ ధర రూ. 5.45 లక్షలుగా ఉండేది. ఆ తర్వాత దాని ధరను తొలిసారిగా రూ. 15,000 మేర పెంచారు. ఇ్పపుడు తాజాగా మరోసారి రూ. 31,000 మేర పెంచారు.

Kiger Old Price New Price Difference
RXE ₹5.64 Lakh ₹5.79 Lakh ₹15,000
RXL ₹6.54 Lakh ₹6.72 Lakh ₹18,000
RXT ₹7.02 Lakh

₹7.23 Lakh

₹21,000
RXL AMT ₹7.04 Lakh ₹7.27 Lakh ₹23,000
RXT Dual Tone ₹7.22 Lakh ₹7.46 Lakh ₹24,000
RXT (O) ₹7.37 Lakh ₹7.58 Lakh ₹21,000
RXT AMT ₹7.52 Lakh ₹7.78 Lakh ₹26,000
RXT (O) Dual Tone ₹7.57 Lakh ₹7.81 Lakh ₹24,000
RXT AMT Dual Tone ₹7.72 Lakh ₹8.01 Lakh ₹29,000
RXZ ₹7.91 Lakh ₹8.10 Lakh ₹19,000
RXT (O) AMT ₹7.87 Lakh ₹8.13 Lakh ₹26,000
RXZ Dual Tone ₹8.11 Lakh ₹8.33 Lakh ₹22,000
RXT (O) AMT Dual Tone ₹8.07 Lakh ₹8.36 Lakh ₹29,000
RXZ AMT ₹8.41 Lakh ₹8.65 Lakh ₹24,000
RXZ AMT (Dual Tone) ₹8.61 Lakh ₹8.88 Lakh ₹27,000
Turbo-petrol
RXT ₹8.12 Lakh ₹8.33 Lakh ₹21,000
RXT Dual Tone ₹8.32 Lakh ₹8.56 Lakh ₹24,000
RXT CVT ₹9.00 Lakh ₹9.13 Lakh ₹13,000
RXZ Turbo ₹9.01 Lakh ₹9.20 Lakh ₹19,000
RXT CVT Dual Tone ₹9.20 Lakh ₹9.36 Lakh ₹16,000
RXZ Turbo Dual Tone ₹9.21 Lakh ₹9.43 Lakh ₹22,000
RXZ Turbo CVT ₹9.89 Lakh ₹9.9 Lakh ₹10,000
RXZ Turbo CVT Dual Tone ₹10.09 Lakh ₹10.23 Lakh ₹14,000
కొత్త సంవత్సరంలో కార్ల ధరలను పెంచిన రెనో (Renault); ఏయే మోడల్ ధర ఎంత పెరిగిందంటే..!

రెనో కైగర్ ఎస్‌యూవీని కంపెనీ రెండు పెట్రోల్ (1.0 లీటర్ న్యాచురల్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్) ఇంజన్ ఆప్షన్లతో విక్రయిస్తోంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు. ఇది ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్‌టి మరియు ఆర్ఎక్స్‌జి అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెనో కైగర్ ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యువి300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

కొత్త సంవత్సరంలో కార్ల ధరలను పెంచిన రెనో (Renault); ఏయే మోడల్ ధర ఎంత పెరిగిందంటే..!

మార్కెట్లో రెనో విక్రయిస్తున్న క్విడ్ హ్యాచ్‌బ్యాక్ మరియు చవకైన ఎమ్‌పివి ట్రైబర్ ధరలను కూడా పెంచింది. రెనో క్విడ్ ధరలు వేరియంట్ ను బట్టి రూ. 11,000 నుండి రూ. 16,000 మేర పెరిగాయి. తాజా ధరల పెంపు అనంతరం, మార్కెట్లో రెనో క్విడ్ ప్రారంభ ధర రూ. 4.12 లక్షల నుండి రూ. 4.25 లక్షలకు (ఎక్స్-షోరూమ్)కు పెరిగింది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ అయిన రెనో క్విడ్ క్లైంబర్ ఏఎమ్‌టి వేరియంట్ ధర రూ. 5.71 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Kwid Old Price New Price Difference
RXE 0.8L ₹4.12 Lakh ₹4.25 Lakh ₹13,000
RXL 0.8L ₹4.42 Lakh ₹4.58 Lakh ₹16,000
RXL 1.0L ₹4.58 Lakh ₹4.69 Lakh ₹11,000
RXT 0.8L ₹4.72 Lakh ₹4.88 Lakh ₹16,000
RXL AMT ₹4.98 Lakh ₹5.09 Lakh ₹11,000
RXT 1.0L ₹4.95 Lakh ₹5.10 Lakh ₹15,000
Climber ₹5.16 Lakh ₹5.31 Lakh ₹15,000
RXT AMT ₹5.35 Lakh ₹5.50 Lakh ₹15,000
Climber AMT ₹5.56 Lakh ₹5.71 Lakh ₹15,000
కొత్త సంవత్సరంలో కార్ల ధరలను పెంచిన రెనో (Renault); ఏయే మోడల్ ధర ఎంత పెరిగిందంటే..!

రెనో క్విడ్ రెండు రకాల ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 0.8 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కాగా, రెండవది 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇందులోని 0.8 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 54 బిహెచ్‌పి పవర్ ను మరియు 72 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇకపోతే, రెండవ ఇంజన్ ఆప్షన్ అయిన 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 68 బిహెచ్‌పి పవర్ ను మరియు 91 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

కొత్త సంవత్సరంలో కార్ల ధరలను పెంచిన రెనో (Renault); ఏయే మోడల్ ధర ఎంత పెరిగిందంటే..!

భారతదేశంలో అత్యంత చవకైన 7-సీటర్ కారుగా మరియు ఎమ్‌పివిగా రికార్డు కలిగి ఉన్న రెనో ట్రైబర్ ఎమ్‌పివి ధరలను కూడా కంపెనీ భారీగానే పెంచింది. ఈ నెలలో ట్రైబర్ ధరలు రూ. 15,000 నుంచి రూ. 31,000 వరకూ పెరిగాయి. తాజా ధరల పెంపు అనంతరం ట్రైబర్ ధరలు రూ. 5.54 లక్షల నుండి రూ. 5.69 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరిగింది. ఇందులో టాప్-ఆఫ్-ది-లైన్ ఆర్ఎక్స్‌జెడ్ ఏఎమ్‌టి డ్యూయల్ టోన్ వేరియంట్ ధర రూ. 8.02 లక్షల నుండి రూ. 8.25 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరిగింది.

Triber Old Price New Price Difference
RXE ₹5.54 Lakh ₹5.69 Lakh ₹15,000
RXL ₹6.20 Lakh ₹6.41 Lakh ₹21,000
RXL AMT ₹6.70 Lakh ₹6.93 Lakh ₹23,000
RXT ₹6.75 Lakh ₹6.96 Lakh ₹19,000
RXT AMT ₹7.25 Lakh ₹7.48 Lakh ₹23,000
RXZ ₹7.35 Lakh ₹7.56 Lakh ₹31,000
RXZ Dual Tone ₹7.52 Lakh ₹7.73 Lakh ₹19,000
RXZ AMT ₹7.85 Lakh ₹8.08 Lakh ₹23,000
RXZ AMT Dual Tone ₹8.02 Lakh ₹8.25 Lakh ₹23,000
కొత్త సంవత్సరంలో కార్ల ధరలను పెంచిన రెనో (Renault); ఏయే మోడల్ ధర ఎంత పెరిగిందంటే..!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రెనో ట్రైబర్ ఎమ్‌పి కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఇది 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ 7-సీటర్ MPV వయోజన ప్రయాణీకుల కోసం 17 పాయింట్లకు గాను 11.62 మరియు పిల్లల రక్షణ కోసం 49 పాయింట్లకు గాను 27 పాయింట్లను స్కోర్ చేసి మొత్తంగా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొందింది. ఈ కారులో రియర్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ కెమెరా మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు హై స్పీడ్ వార్నింగ్ సిస్టమ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త సంవత్సరంలో కార్ల ధరలను పెంచిన రెనో (Renault); ఏయే మోడల్ ధర ఎంత పెరిగిందంటే..!

కాగా, రెనో విక్రయిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ డస్టర్ ధరలలో ఎలాంటి మార్పులు లేవు. కంపెనీ ఈ కారును పాత ధరకే విక్రయిస్తోంది. ప్రస్తుతం రెనాల్ట్ డస్టర్ ధర రూ. 9.86 లక్షల నుండి రూ. 10.25 లక్షలకు మధ్యలో ఉన్నాయి.

Most Read Articles

English summary
Renault india increases car prices up to rs 31000 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X