పిట్ట కొంచెమైనా కూత ఘనమేనండోయ్.. అమ్మకాల్లో 'టాటా పంచ్' అరుదైన రికార్డ్

టాటా మోటార్స్ (Tata Motors) యొక్క 'టాటా పంచ్' (Tata Punch) దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలో ఉత్పత్తిలో మరియు విక్రయాల్లో అరుదైన రికార్డ్ సృష్టించింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

అమ్మకాల్లో 'టాటా పంచ్' అరుదైన రికార్డ్.. ఇంతలోనే అన్ని యూనిట్లా..!!

మైక్రో SUV విభాగంలో విడుదలైన 'టాటా పంచ్' ఇప్పటికి ఒక లక్ష యూనిట్లను విక్రయించి కొత్త మైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. 2021 అక్టోబర్ నెలలో అడుగుపెట్టిన టాటా పంచ్ ఇప్పటి వరకు 1,00,000 యూనిట్ల విక్రయాలను సాధించినట్లు, ఆ 1,00,000వ యూనిట్‌ను టాటా మోటార్స్ పూణేలోని తయారీ కేంద్రంలో విడుదల చేసింది. కేవలం 10 నెలల కాలంలో ఇంత గొప్ప రికార్డ్ సృష్టించిన తొలి ఎస్‌యూవీ ఇదేనని టాటా మోటార్స్ సగర్వంగా తెలిపింది.

అమ్మకాల్లో 'టాటా పంచ్' అరుదైన రికార్డ్.. ఇంతలోనే అన్ని యూనిట్లా..!!

నిజానికి టాటా పంచ్ కంపెనీ యొక్క అతి తక్కువ ధర వద్ద లభిస్తున్న మైక్రో SUV. ఇది అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన పరికరాలను కలిగి ఉండటమే కాకుండా అత్యధిక సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంది. ఈ కారణంగానే ఈ SUV కి మార్కెట్లో ఇంత డిమాండ్ ఉంది.

అమ్మకాల్లో 'టాటా పంచ్' అరుదైన రికార్డ్.. ఇంతలోనే అన్ని యూనిట్లా..!!

టాటా పంచ్ ధర ఇప్పుడు దేశీయ మార్కెట్లో రూ. 5.93 లక్షల నుండి రూ. 9.48 లక్షల మధ్య ఉంది. ఇది ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది. పంచ్ మైక్రో SUV నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్.

అమ్మకాల్లో 'టాటా పంచ్' అరుదైన రికార్డ్.. ఇంతలోనే అన్ని యూనిట్లా..!!

టాటా పంచ్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ మరియు 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది.

అమ్మకాల్లో 'టాటా పంచ్' అరుదైన రికార్డ్.. ఇంతలోనే అన్ని యూనిట్లా..!!

టాటా పంచ్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

అమ్మకాల్లో 'టాటా పంచ్' అరుదైన రికార్డ్.. ఇంతలోనే అన్ని యూనిట్లా..!!

ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

అమ్మకాల్లో 'టాటా పంచ్' అరుదైన రికార్డ్.. ఇంతలోనే అన్ని యూనిట్లా..!!

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

అమ్మకాల్లో 'టాటా పంచ్' అరుదైన రికార్డ్.. ఇంతలోనే అన్ని యూనిట్లా..!!

టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మైక్రో SUV అత్యంత సురక్షితమైన వాహనం. ఎందుకంటే ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ పొంది అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి.

ఇటీవల భారతీయ సినీనటి మరియు గాయని 'సోమా లైశ్రామ్' (Soma Laishram) యొక్క 'టాటా పంచ్' (Tata Punch) ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో టాటా పంచ్ రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలో పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి పెద్ద ప్రమాదం జరగలేదు. ఇది టాటా పంచ్ యొక్క భద్రతకు నిలువెత్తు నిదర్శనం.

అమ్మకాల్లో 'టాటా పంచ్' అరుదైన రికార్డ్.. ఇంతలోనే అన్ని యూనిట్లా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

టాటా పంచ్ దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి సరాసరి నెలకు 10,000 యూనిట్లను విక్రయిస్తున్నట్లు మనకు స్పష్టమవుతోంది. ఈ కారణంగానే అతి తక్కువ కాలంలోనే 1,00,000 యూనిట్ల మైలురాయిని చేరుకోగలిగింది. టాటా పంచ్ మంచి అమ్మకాలు పొందుతున్న కారణంగా మరియు ఇతర కొత్త వాహనాలు మార్కెట్లో విడుదలైన కారణంగా కంపెనీ అమ్మకాల్లో కూడా ముందంజలో ఉంది.

Most Read Articles

English summary
Tata punch becomes fastest suv to cross 1 lakh mark details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X