సఫారీలో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్.. ధరలు & వివరాలు

భారతీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందతున్న సఫారీ మోడల్ లో మరో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త వేరియంట్స్ లో ఒకటి టాటా సఫారి XMAS కాగా, మరొకటి టాటా సఫారి XMS.

Recommended Video

భారతీయ మార్కెట్లో Tata Nexon కొత్త వేరియంట్ లాంచ్ | వివరాలు

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త వేరియంట్స్ యొక్క ధరలు, అప్డేటెడ్ ఫీచర్స్ వంటి వాటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సఫారీలో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్.. ధరలు & వివరాలు

టాటా మోటార్స్ యొక్క కొత్త సఫారీ వేరియంట్స్ యొక్క ప్రారంభ ధరలు రూ. 17.96 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). అయితే ఇప్పుడు ఈ కొత్త వేరియంట్స్ ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. అంతే కాకూండా కంపెనీ ఇప్పుడు ఈ కొత్త సఫారీ వేరియంట్‌లను #ReclaimYourLife అనే ట్యాగ్‌లైన్‌తో ప్రచారం చేస్తోంది.

సఫారీలో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్.. ధరలు & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సఫారీ వేరియంట్స్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

సఫారీలో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్.. ధరలు & వివరాలు

కంపెనీ ఈ రెండు కొత్త వేరియంట్స్ లాంచ్ చేస్తూ.. ఈ అప్డేటెడ్ కార్లను అన్‌చార్టర్డ్ భూభాగాలలో ప్రయాణించడానికి మరియు #Reclaim YourLife కోసం ఇప్పుడే https://cars.tatamotors.com/suv/safari బుక్ చేసుకోండి, అంటూ టాటా మోటార్స్ కార్స్ ట్వీట్ చేసింది.

సఫారీలో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్.. ధరలు & వివరాలు

ప్రస్తుతం టాటా సఫారీ యొక్క XMAS మరియు XMS వేరియంట్‌లు ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ప్రారంభ ధరలు ధర రూ. 17.96 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే అదే సమయంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యొక్క ప్రారంభ ధరలు రూ. 19.26 లక్షలు (ఎక్స్-షోరూమ్).

సఫారీలో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్.. ధరలు & వివరాలు

టాటా సఫారీ యొక్క కొత్త వేరియంట్స్ రెండూ కూడా క్రయోటెక్ 170 పిఎస్ డీజిల్ ఇంజన్ పొందుతాయి. కావున మంచి పనితీరుని అందిస్తాయి. అయితే ఈ వేరియంట్స్ యొక్క డిజైన్ మరియు కొన్ని ఫీచర్స్ మునుపటి మాదిరిగానే ఉన్నాయి.

సఫారీలో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్.. ధరలు & వివరాలు

అయితే ఇందులో ఉన్న అప్డేటెడ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ రెండు వేరియంట్‌లలో పనోరమిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 8 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కువమంది ఈ ఫీచర్స్ కోరుకుంటారు, కావున ఇది తప్పకుండా మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

సఫారీలో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్.. ధరలు & వివరాలు

ఇప్పటికే భారతీయ మార్కెట్లో టాటా సఫారీ స్టాండర్డ్, డార్క్ మరియు అడ్వెంచర్ పర్సోనా అనే వేరియంట్స్ లో అమ్ముడవుతోంది. ఈ జాబితాలోకి ఇప్పుడు మరో రెండు కొత్త వేరియంట్స్ కూడా చేరాయి. కావున సఫారీలో కొత్త వేరియంట్ కోరుకునే కస్టమర్లు పండుగ సీజన్ లో సొంతం చేసుకోవచ్చు.

సఫారీలో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్.. ధరలు & వివరాలు

టాటా సఫారి SUV లో 2.0 లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 168 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

సఫారీలో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్.. ధరలు & వివరాలు

ఇదిలా ఉండగా టాటా మోటార్స్ యొక్క హారియర్ కూడా మరో రెండు కొత్త వేరియంట్స్ లో విడుదలైంది. అవి XMAS మరియు XMS వేరియంట్స్. వీటి ధరలు రూ. 18.50 లక్షలు (ఎక్స్-షోరూమ్), రూ. 17.20 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇవి రెండు వేరియంట్లు ఆధునిక డిజైన్ మరియు పరికరాలను పొందుతాయి.

టాటా హారియర్ XMS వేరియంట్ అనేది XM మరియు XT వేరియంట్‌ల మధ్య ఉంటుంది. అంతే కాకూండా ఇది కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే హారియర్ XMAS వేరియంట్ XMA మరియు XTA+ వేరియంట్‌ల మధ్య ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సఫారీలో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్.. ధరలు & వివరాలు

నిజానికి పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఇప్పటివరకు హారియర్ యొక్క XT+ మరియు XTA+ వేరియంట్‌లలో అందుబాటులో ఉండేది. అయితే ఈ ఫీచర్ ఉండటం వల్ల ఈ వేరియంట్స్ ధరలు వరుసగా రూ. 18.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 19.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఇప్పుడు కంపెనీ విడుదల చేసిన కొత్త వేరియంట్స్ (XMS మరియు XMAS) లో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. కాగా ధరలు కూడా XT+ మరియు XTA+ వేరియంట్స్ కంటే కూడా రూ. 1 లక్ష తక్కువగా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata safari xms and xmas variants launched price features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X