గత వారం భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త వాహనాలు: ఎస్-ప్రెస్సో సిఎన్‌జి నుంచి కీవే ఎస్ఆర్125 వరకు..!!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉంటాయి. ఇందులో కార్లు, బైకులు మరియు ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి. గత వారంలో కూడా దేశీయ విఫణిలో కొన్ని కొత్త కార్లు, బైకులు విడుదలయ్యాయి. ఇందులో మారుతి సుజుకి యొక్క ఎస్-ప్రెస్సో సిఎన్‌జి, లెక్సస్ కంపెనీ యొక్క అప్డేటెడ్ 'ఈఎస్ 300హె' మరియు బైకులు ఉన్నాయి.
మనం ఈ కథనంలో గత వారంలో విడుదలైన ఈ కొత్త ఉత్పత్తులను గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి:
భారతీయ వాహన విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న 'మారుతి సుజుకి' యొక్క 'ఎస్-ప్రెస్సో' ఇప్పుడు 'సిఎన్‌జి' వెర్షన్ లో అందుబాటులో ఉంది. ఇది తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఈ కొత్త సిఎన్‌జి వెర్షన్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి LXi మరియు VXi. వీటి ధరలు వరుసగా రూ. 5.90 లక్షలు మరియు రూ. 6.10 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మారుతి సుజుకి సిఎన్‌జి లైనప్‌లో S-ప్రెస్సో CNG అనేది 10 వ మోడల్. S-ప్రెస్సో CNG యొక్క ఇంజిన్ 5300 ఆర్‌పిఎమ్ వద్ద 56.69 పిఎస్ పవర్ అందిస్తుంది. అయితే CNG మోడ్‌లో 3400 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 82.1 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో CNG దాదాపుగా 32.73 కిమీ/కేజీ పరిధిని అందిస్తుంది. మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపైన క్లిక్ చేయండి.

లెక్సస్ ఈఎస్ 300హె:
ఇప్పటికే భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న లెక్సస్ 'ఈఎస్ 300హెచ్' అప్డేటెడ్ వెర్షన్ లో విడుదలైంది. ఈ అప్డేటెడ్ సెడాన్ ప్రారంభ ధర రూ. 59.71 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఎక్స్‌క్విజిట్ మరియు లగ్జరీ అనే రెండు ట్రిమ్స్ లో లభిస్తుంది.

ఈ కొత్త సెడాన్ డిజైన్ మరియు ఫీచర్స్ కూడా చాలా ఆధునికంగా ఉన్నాయి, కానీ ఇందులోని ఇంజిన్ లో ఎటువంటి అప్డేట్ జరగలేదు. కావున ఇందులో 2.5-లీటర్, 4-సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 176 బిహెచ్‌పి పవర్ మరియు 221 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఇందులో 118 బిహెచ్‌పి పవర్ మరియు 202 ఎన్ఎమ్ టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ అప్డేటెడ్ సెడాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బివైడి ఆటో 3:
చైనా కంపెనీ అయిన BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) దేశీయ మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ SUV 'ఆటో 3' (Atto 3) ని గత వారం అధికారికంగా ఆవిష్కరించింది. ధరలు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కాగా ఈ ఎలక్ట్రిక్ కారు కోసం కంపెనీ ఇప్పటికీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

కొత్త అటో 3 ఎలక్ట్రిక్ SUV పెద్ద 60.48 kWh బ్యాటరీ ప్యాక్ మరియు చిన్న 49.92kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇందులోని పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 521 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని కూడా పొందుతుంది. ఒక్క ఛార్జ్ తో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. బివైడి ఆటో 3 గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కీవే ఎస్ఆర్125:
గత వారం కీవే ఇండియా మార్కెట్లో తన ఎస్ఆర్125 బైక్ విడుదల చేసింది. ఈ బైక్ రెట్రో డిజైన్ కలిగి సరసమైన ధర వద్ద లభిస్తుంది. ఈ బైక్ ధర రూ. 1,19,000 (ఎక్స్ షోరూమ్ - ఇండియా). ఈ బైక్ మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి గ్లోసీ రెడ్, గ్లోసీ బ్లాక్ మరియు గ్లోసీ వైట్ కలర్స్. ఈ కొత్త బైక్ కొనాలనుకునే కస్టమర్లు రూ. 1,000 చెల్లించి www.keeway-india.com వెబ్సైట్ లో లేదా సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. కాగా ఈ నెల చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయి.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కీవే ఎస్ఆర్125 బైక్ సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, 125సీసీ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 9.7 హెచ్‌పి మరియు 8.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పర్ఫామెన్స్ అందించడానికి అనుకూలంగా ఉంటుంది. కీవే ఎస్ఆర్125 గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ వాహన మార్కెట్లో రోజురోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంది, కావున రోజురోజుకి మార్కెట్లో విడుదలయ్యే వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. కావున ఎప్పటికప్పుడు మార్కెట్లో విడుదయ్యే కొత్త బైకులు మరియు కారును గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








