గత వారం భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త కార్లు.. వాటి వివరాలు
గత వారం దేశీయ మార్కెట్లో చాలా కార్లు విడుదలయ్యాయి, ఇందులో అడ్వాన్స్‌డ్ ఎంజి గ్లోస్టర్, టాటా నెక్సాన్ ఈవి యొక్క జెట్ ఎడిషన్, రెనాల్ట్ కంపెనీ యొక్క కైగర్, క్విడ్, ట్రైబర్ ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్స్ మరియు కియా సోనేట్ ఎక్స్ లైన్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ కూడా ఆవిష్కరించబడింది.
Recommended Video
భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త కార్లను గురించి మరింత సమాచారం ఈ కథనంలో క్లుప్తంగా తెలుసుకుందాం.. రండి.

అడ్వాన్స్‌డ్ ఎంజి గ్లోస్టర్:
ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీగా అవతరించిన 'ఎంజి మోటార్ ఇండియా' హెక్టర్, జెడ్ఎస్ ఈవి మరియు గ్లోస్టర్ వంటి వాటిని విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగింది. అయితే కంపెనీ యొక్క అమ్మకాలను మరింత పెంచుకోడానికి గ్లోస్టర్ లో అప్డేటెడ్ మోడల్ విడుదల చేసింది.

కంపెనీ విడుదల చేసిన ఆ అప్డేటెడ్ గ్లోస్టర్ పేరు 'అడ్వాన్స్‌డ్ ఎంజి గ్లోస్టర్'. దీని ప్రారంభ ధర రూ. 31.99 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 40.77 లక్షలు. ఈ 2022 గ్లోస్టర్ SUV 6 సీటర్ మరియు 7 సీటర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. 7 సీటర్ సూపర్, షార్ప్ మరియు శావీ అనే మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 31.99 లక్షలు, రూ. 36.87 లక్షలు మరియు రూ. 38.44 లక్షలు. 6 సీటర్ శావీ అనే వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 38.44 లక్షలు. దీని మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపైన క్లిక్ చేయండి.

టాటా నెక్సాన్ ఈవి జెట్ ఎడిషన్:
గత వారం టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ ఈవి జెట్ ఎడిషన్ లో విడుదలైంది. ఇది రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి ప్రైమ్ ఎడిషన్ మరియు మాక్స్ ఎడిషన్. వీటి ధరలు వరుసగా రూ. 17.50 లక్షలు మరియు రూ. 19.54 లక్షలు. ఈ కొత్త జెట్ ఎడిషన్ దాని టాప్ స్పెక్ XZ+ లక్స్ వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది.

నెక్సాన్ EV ప్రైమ్ జెట్ ఎడిషన్ 30.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది 129 hp ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడింది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 312 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అదే సమయంలో టాటా నెక్సాన్ EV మాక్స్ జెట్ ఎడిషన్ 40.5 kWh బ్యాటరీని పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 437 కిమీ పరిధిని అందిస్తుందని 'ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' (ARAI) చేత ధృవీకరించబడింది. దీని మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపైన క్లిక్ చేయండి.

రెనాల్ట్ కైగర్, క్విడ్, ట్రైబర్ ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్స్:
భారతదేశంలో పండుగ సీజన్ ప్రారభం కావడంతో గత వారం మార్కెట్లో రెనాల్ట్ కంపెనీ తన కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ మోడళ్లలో ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది. ఇవి ఇప్పటికే విక్రయించబడుతున్న స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంటాయి. వీటి కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ ప్రారభించింది.
ఈ కొత్త కొత్త లిమిటెడ్ ఎడిషన్ కార్ల ధరలు వాటి స్టాండర్డ్ వేరియంట్‌ల ధరలతోనే విక్రయించబడుతుంది. కావున కొనుగోలుదారులు వీటిని సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీని మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపైన క్లిక్ చేయండి.

కియా సోనేట్ ఎక్స్ లైన్:
సోత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'కియా మోటార్స్' (Kia Motors) దేశీయ విఫణిలో గత వారం 'కియా సోనేట్ ఎక్స్ లైన్' విడుదల చేసింది. ఈ కొత్త 'కియా సోనేట్ ఎక్స్ లైన్' డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో డీజిల్ ఇంజిన్ ఆప్సన్ కలిగిన సోనేట్ ఎక్స్ లైన్ ధర రూ. 13.99 లక్షలు, కాగా పెట్రోల్ ఇంజిన్ కలిగిన సోనేట్ ఎక్స్ లైన్ ధర రూ. 13.39 లక్షల వరకు ఉంది.

కియా సోనెట్ ఎక్స్ లైన్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్స్ పొందుతుంది. ఇందులోని పెట్రోల్ ఇంజిన్ 120 పిఎస్ పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 115 పిఎస్ పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపైన క్లిక్ చేయండి.

టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ:


Click it and Unblock the Notifications








