గత వారం టాప్ కార్ న్యూస్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

గత వారంలో భారతీయ మార్కెట్లో కొన్ని కార్లు విడుదలయ్యాయి. ఇందులో కియా కారెన్స్, రెనాల్ట్ ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్ మరియు బిఎండబ్ల్యు ఎక్స్3 డీజిల్ వంటివి విడుదలయ్యాయి. అంతే కాకుండా టాటా మోటార్స్ యొక్క స్పెషల్ కజిరంగా ఎడిషన్స్ కూడా పరిచయం చేయబడ్డాయి. కావున వీటి గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

కియా కారెన్స్ (Kia Carens):

భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు 'కియా మోటార్స్' తన కియా కారెన్స్ (Kia Carens) MPV విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు కాగా టాప్ మోడల్ ధర రూ. 16.99 లక్షలు. కంపెనీ ఈ ముప్ప్ కోసం బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారంభించినంది. కావున కస్టమర్లు రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

కియా కారెన్స్ MPV మొత్తం 5 వేరియంట్‌లలో అందుబటులో ఉంటుంది. అవి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్స్. కంపెనీ ఈ కొత్త మోడల్ విడుదలతో 6/7 సీట్ల MPV సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. కియా కారెన్స్ ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరుకోవడం కూడా ప్రారంభించింది. కావున డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. ఈ కొత్త కారు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

రెనాల్ట్ ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్ (Renault Triber Limited Edition):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి రెనాల్ట్ (Renault) కంపెనీ యొక్క కార్లకు దేశంలో మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఇటీవల కంపెనీ యొక్క 'రెనాల్ట్ ట్రైబర్' (Renault Triber) దేశీయ మార్కెట్లో ఏకంగా 1 లక్ష యూనిట్ల అమ్మకాలను పొందింది. ఈ సందర్భంగా కంపెనీ ట్రైబర్ ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్ లో కూడా అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 7.24 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్ స్టాండర్డ్ RXT వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్' రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి మూన్‌లైట్ సిల్వర్/బ్లాక్ రూఫ్ కాగా, మరొకటి సెడార్ బ్రౌన్/బ్లాక్ రూఫ్ కలర్స్. ఈ రెండూ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

టాటా కజిరంగా ఎడిషన్స్ (Tata Kaziranga Editions):

ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) కొత్త కజిరంగా ఎడిషన్ తీసుకురానుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికే వెలువడ్డాయి. 2022 IPL లో టాటా పంచ్ యొక్క కజిరంగా ఎడిషన్ ప్రవేశపెట్టింది. అయితే కంపెనీ ఇదే నేపథ్యంలో ఇప్పుడు నెక్సాన్, హారియార్ మరియు సఫారీ వంటి వాటిని కూడా కజిరంగా ఎడిషన్ తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

మొదట కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 IPL లో ప్రవేశపెట్టిన టాటా పంచ్ కజిరంగా ఎడిషన్ వేలంలో విక్రయించనున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు కంపెనీ తీసుకురానున్న నెక్సాన్, హారియార్ మరియు సఫారీ కజిరంగా ఎడిషన్స్ వేలంలో విక్రయిస్తుందా.. లేదా సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతుందా అనే సమాచారం అందుబాటులో లేదు. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

2022 బిఎండబ్ల్యు ఎక్స్3 (2022 BMW X3) డీజిల్:

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ఇటీవల తన కొత్త ఎక్స్3 (X3) SUV ని భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. అయితే మొదట ఇది కేవలం పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే విడుదలయింది. అయితే ఇప్పుడు ఇది డీజిల్ ఇంజిన్ లో కూడా విడుదలైంది. డీజిల్ ఇంజిన్ కలిగిన 2022 BMW X3 ధర రూ. 65.50 లక్షలు.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

2022 BMW X3 డీజిల్ xDrive20d లగ్జరీ ఎడిషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మోడల్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 213 కి.మీ వరకు ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus):

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ 2022 మర్చి 8 న ప్రారభించబడుతుంది. కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ వెంటో స్థానంలో భారతదేశానికి తీసుకురాబోతోంది. ఈ మిడ్ సైజ్ సెడాన్ MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. వెర్టస్ 4,482 మిమీ పొడవు, 1751 మిమీ వెడల్పు, 1472 మిమీ ఎత్తు, ఇది 92 మిమీ పొడవు, 52 మిమీ వెడల్పు, వెంటో కంటే 5 మిమీ ఎక్కువ. దీని వీల్‌బేస్ 2651 మిమీ వద్ద ఉంచబడుతుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Sunday, February 20, 2022, 15:30 [IST]
English summary
Top car news of the week kia carens bmw x3 diesel tata kaziranga edition details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+