Top Car News of The Week.. ఈ ఒక్క ఆర్టికల్‌లో.. ఇప్పుడే చూడండి
భారతీయ మార్కెట్లో గత వారంలో కొన్ని కంపెనీలు కొత్త కార్లను విడుదల చేయగా, మరికొన్ని కంపెనీలు తన వాహనాల యొక్క బుకింగ్స్ ప్రారంభించాయి. ఇంకొన్ని దేశీయ విఫణిలో ఆవిష్కరించబడ్డాయి. వీటన్నింటి గురించి మరింత సమాచారం ఈ ఒకే ఆర్టికల్ ద్వారా ఇప్పుడు మీ కోసం..

2022 ఎంజి జెడ్ఎస్ ఈవి లాంచ్ ( 2022 MG ZS EV Launch):
ఎంజి మోటార్ (MG Motor) కంపెనీ భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త రిఫ్రెష్ చేయబడిన 'ఎంజి జెడ్ఎస్ ఈవి' (MG ZS EV) SUV విడుదల చేసింది. ఈ కొత్త అప్డేటెడ్ SUV ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 21.99 లక్షలు (ఎంట్రీ-లెవల్ ఎక్సైట్ వేరియంట్). ఇక టాప్-స్పెక్ MG ZS ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ. 25.88 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త ZS EV దాని పెట్రోలుతో నడిచే MG ఆస్టర్ SUV కి దగ్గరగా ఉండే కాస్మెటిక్ అప్డేట్స్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. అయితే ఈ 2022 MG ZS EV 461 కిమీ పరిధిని అందించే పెద్ద బ్యాటరీని పొందుతుంది. కొత్త ZS EV ఫేస్‌లిఫ్ట్‌లో ఇప్పుడు అతిపెద్ద అప్‌డేట్ ఇందులోని బ్యాటరీ ప్యాక్. ఇందులో మునుపటి 44.5 kWh బ్యాటరీ ప్యాక్ స్థానంలో 50.3kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ కొత్త మోడల్ 42 కిమీ ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఇది నిజంగా కస్టమర్లకు శుభవార్త అనే చెప్పాలి. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్ లాంచ్ (Lexus NX 350h Launch):
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'లెక్సస్' (Lexus) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన కొత్త 'ఎన్ఎక్స్ 350హెచ్' (NX 350h) విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్' ధర రూ. 64.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త 'లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్' పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో లభిస్తుంది. ఇది మార్కెట్లో మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి ఎక్స్‌క్విజిట్, లగ్జరీ మరియు ఎఫ్-స్పోర్ట్ వేరియంట్స్.

కొత్త లెక్సస్ NX 350h హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో జతచేయబడిన 2.5-లీటర్, 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 192 బిహెచ్‌పి పవర్ విడుదల చేస్తుంది, అయితే ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ 244 బిహెచ్‌పి పవర్ మిశ్రమ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ 6-స్పీడ్ CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బిఎండబ్ల్యు ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ లాంచ్ (BMW X4 Facelift Launch):
జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'బిఎండబ్ల్యు' (BMW) భారతీయ మార్కెట్లో కొత్త బిఎండబ్ల్యు ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్' (BMW X4 Facelift) ను రూ. 70.50 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధర వద్ద విడుదల చేసింది. కంపెనీ ఈ కొత్త ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది. కావున కస్టమర్లు రూ. 50,000 చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు.

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన బిఎండబ్ల్యు ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త లగ్జరీ కార్లు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇక ఇందులోని 3.0-లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ డీజిల్ ఇంజన్ 265 బిహెచ్‌పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు జత చేయబడి ఉంటాయి. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మారుతి సుజుకి సుజుకి డిజైర్ సిఎన్‌జి లాంచ్ (Maruti Suzuki Suzuki Dzire CNG Lanch):
భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి తన కొత్త 'సుజుకి డిజైర్ సిఎన్‌జి' (Suzuki Dzire CNG) విడుదల చేసింది. ఈ కొత్త డిజైర్ సిఎన్‌జి ధర రూ. 8.14 లక్షలు. కంపెనీ ఈ 'మారుతి సుజుకి డిజైర్ సిఎన్‌జి' యొక్క బుకింగ్స్ ప్రారంభించింది. సుజుకి డిజైర్ సిఎన్‌జి' (Suzuki Dzire CNG) మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి విఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ వేరియంట్స్. వీటి ధరలు వరసగా రూ. 8.14 లక్షలు మరియు రూ. 8.82 లక్షలు.

కొత్త మారుతి సుజుకి డిజైర్ సిఎన్‌జి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో జత చేయబడింది. ఈ ఇంజిన్ 89 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 31.12 కిమీ మైలేజ్ అందిస్తుంది. అయితే ఇప్పుడు కంపెనీ యొక్క సిఎన్‌జి ఆప్సన్ 77 బిహెచ్‌పి పవర్ మరియు 98.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ ఇవ్వబడుతుంది. కొత్త మారుతి సుజుకి డిజైర్ సిఎన్‌జి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఆవిష్కరణ (Volkswagen Virtus):
'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) తన 'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్' (Volkswagen Virtus) ను ఆవిష్కరించింది. ఈ కొత్త SUV భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త మోడల్ కానుంది. కావున ఇది త్వరలోనే మార్కెట్లో విడుదలవుతుంది. త్వరలో విడుదలకానున్న ఈ కొత్త మోడల్ అనేక ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 110 బిహెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అంతే కాకుండా ఈ కొత్త మోడల్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను అందించే 1.5 లీటర్ ఇంజన్ కూడా పొందుతుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ వంటి వాటిని పొందుతుంది. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టొయోటా గ్లాంజా బుకింగ్స్ (Toyota Glanza Bookings):
దేశీయ విఫణిలో 'టయోటా' (Toyota) కంపెనీ తన కొత్త 'టొయోటా గ్లాంజా' (Toyota Glanza) విడుదల చేయనుంది. అయితే కంపెనీ ఈ కొత్త మోడల్ యొక్క బుకింగ్స్ ఎట్టకేలకు ప్రారంభించింది. దీని కోసం కష్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో లేదా కంపెనీ యొక్క డీలర్‌షిప్‌ను సందర్శించి రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

కంపెనీ దీనిని E, S, G మరియు V అనే ట్రిమ్స్ లో తీసుకురానుంది. అయితే ఇందులోని బేస్ E ట్రిమ్ లో మినహా అన్ని వేరియంట్‌లలో మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ఆప్సన్స్ పొందుతుంది. ఇది 89 బిహెచ్‌పి పవర్ అందించే శక్తివంతమైన కె-సిరీస్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందుతుంది. కావున ఇది మంచి పరిధిని కూడా అందిస్తుంది. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








