దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న టాప్ 5 కార్లు - వివరాలు

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో రోజురోజుకి చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో చాలా కంపెనీలు కొత్త కొత్త బైకులు మరియు కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ నెలలో దేశీయ విఫణిలో మారుతి ఎస్-ప్రెస్సో CNG వంటి కార్లు విడుదలయ్యాయి. కాగా రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న కార్లు ఏవి? వాటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న టాప్ 5 కార్లు - వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కార్లలో బివైడి అటో 3, టయోటా ఇన్నోవా హైక్రాస్, ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్, జీప్ గ్రాండ్ చెరోకీ మరియు మెర్సిడెస్ బెంజ్ యొక్క జిఎల్‌బి వంటివి ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న టాప్ 5 కార్లు - వివరాలు

బివైడి అటో 3 [BYD ATTO 3]:

చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) 'ఆటో 3' (Atto 3) అనే కొత్త ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ ఎలక్ట్రిక్ కారుపైన భారీతీయ మార్కెట్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న మొదటి 500 మంది కస్టమర్లకు 2023 జనవరి నాటికి డెలివరీ చేయనున్నట్లు కూడా కంపెనీ తెలిపింది.

దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న టాప్ 5 కార్లు - వివరాలు

బివైడి అటో 3 అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ SUV లో పెద్ద 60.48 kWh బ్యాటరీ ప్యాక్ మరియు చిన్న 49.92kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటాయి. ఇందులోని పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 521 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని కూడా పొందుతుంది. ఒక్క ఛార్జ్ తో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న టాప్ 5 కార్లు - వివరాలు

టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross):

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా కంపెనీ దేశీయ మార్కెట్లో కొత్త 'ఇన్నోవా హైక్రాస్' విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే ఇది దేశీయ మార్కెట్లో విడుదలకానున్న ఎమ్‌పివి. టయోటా ఇన్నోవాకు ప్రత్యామ్నాయంగా కంపెనీ ఇన్నోవా హైక్రాస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న టాప్ 5 కార్లు - వివరాలు

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదలకానున్న కొత్త 'ఇన్నోవా హైక్రాస్' ఇన్నోవా క్రిస్టా యొక్క హై-ఎండ్ వేరియంట్. ఇది లాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌కు బదులుగా మోనోకోక్ ఛాసిస్‌పై నిర్మించబడి ఉంటుంది. కావున ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అదే సమయంలో ఇది పెట్రోల్ ఇంజిన్‌తో ఫ్రంట్ వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్ ఆప్సన్ పొందే అవకాశం ఉంటుంది. ఇది తప్పకుండా భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న టాప్ 5 కార్లు - వివరాలు

జీప్ గ్రాండ్ చెరోకీ (Jeep Grand Cherokee):

అమెరికన్ కార్ బ్రాండ్ అయిన 'జీప్' దేశీయ మార్కెట్లో 2022 నవంబర్ 11 న కొత్త 'గ్రాండ్ చెరోకీ' విడుదల చేయడానికి సిద్దమవుతుంది. కొత్త 'జీప్ గ్రాండ్ చెరోకీ' అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందనుంది. ఇది రాంగ్లర్ , కంపాస్ మరియు మెరిడియన్ తరువాత విడుదల కానున్న నాలుగవ మోడల్ కానుంది.

దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న టాప్ 5 కార్లు - వివరాలు

కొత్త 2022 జీప్ గ్రాండ్ చెరోకీ కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్ మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో డీజిల్ ఇంజిన్ ఆప్సన్ వచ్చే అవకాశం లేదు. కావున ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను మాత్రమే పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఆటో, స్పోర్ట్, మడ్/సాండ్ మరియు స్నో అనే డ్రైవింగ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇంజిన్ యొక్క పవర్ అవుట్‌పుట్స్ మరియు ధరలు ఇంకా వెల్లడికాలేదు. ఇవన్నీ లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న టాప్ 5 కార్లు - వివరాలు

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌బి (Mercedes-Benz GLB):

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ అయినా 'మెర్సిడెస్ బెంజ్' భారతీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతున్న కార్ తయారీ సంస్థల్లో ఒకటి. ఈ కంపెనీ భారతీయ మార్కెట్లో 'జిఎల్‌బి' అనే 7 సీటర్ SUV ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త SUV భారతదేశంలో తయారుచేయబడే అవకాశం లేదు, కావున మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌బి (Mercedes-Benz GLB) 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 188 బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందించే అవకాశం ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న టాప్ 5 కార్లు - వివరాలు

ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ (MG Hector Facelift):

ఎంజి మోటార్స్ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి కూడా మంచి అమ్మకాలతో మంచి ఆదరణ పొందుతూ ఉంది. ఇప్పటికే కంపెనీ ఎంజి హెక్టర్ విడుదల చేసింది. కాగా ఇందులో 'ఫేస్‌లిఫ్ట్' వెర్షన్ విడుదల చేయడానికి ఇప్పుడు సన్నద్ధమవుతోంది. ఈ SUV దాని మునుపటి మోడల్ కంటే కూడా ఆధునిక డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ఇప్పుడు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న టాప్ 5 కార్లు - వివరాలు

కొత్త ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ SUV లో డిజైన్ మరియు ఫీచర్స్ అప్డేట్స్ జరిగినప్పటికీ ఇంజిన్ మరియు పర్ఫామెన్స్ లో ఎటువంటి మార్పులు లేదు. కావున ఈ కొత్త SUV కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే మంచి పర్ఫెమెన్స్ అందిస్తుందని ఆశిస్తున్నాము.

దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న టాప్ 5 కార్లు - వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇండియన్ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న కార్లను గురించి తెలుసుకున్నాము, అయితే ఈ కార్ల యొక్క ధరలు మరియు ఇతర వివరాలు కూడా ఇంకా తెలియరావాల్సి ఉంది. కావున ఈ కొత్త కార్లను గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవటానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Top five upcoming uvs in india byd atto 3 Innova hycross and more
Story first published: Monday, October 31, 2022, 10:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X