భారతదేశంలో మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కరోలా ఆల్టిస్ హైబ్రిడ్‌ను ప్రవేశపెట్టిన టొయోటా!

జపనీస్ కార్ కంపెనీ టొయోటా భారతదేశంలో హైబ్రిడ్, ఫ్లెక్స్-ఫ్యూయెల్ మరియు ఫ్యూయెల్-సెల్ ఇంజన్ వాహనాలను అభివృద్ధి చేయడంలో చాలా చురుకుగా పనిచేస్తోంది. ఇప్పటికే స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‍తో కూడిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసిన టొయోటా, అంతకు ముందు టొయోటా మిరాయ్ అనే హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ వాహనాన్ని భారత రోడ్లపై ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.

భారతదేశంలో మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కరోలా ఆల్టిస్ హైబ్రిడ్‌ను ప్రవేశపెట్టిన టొయోటా!

కాగా, టొయోటా ఇప్పుడు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సహకారంతో పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రవేశపెట్టబడిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల కోసం టొయోటా తమ మొదటి కరోలా ఆల్టిస్ హైబ్రిడ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును ప్రారంభించింది. టొయోటా కరోలా ఆల్టిస్ హైబ్రిడ్ ద్వారా కనుగొన్న విషయాలు భారతదేశంలో రాబోయే ఫ్లెక్స్-ఫ్యూయెల్ యుగంలో ఆసక్తిని పెంచడానికి విలువైన సమాచారాన్ని అందించనుంది. మరి ఈ ప్రత్యేకమైన కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

భారతదేశంలో మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కరోలా ఆల్టిస్ హైబ్రిడ్‌ను ప్రవేశపెట్టిన టొయోటా!

ఫ్లెక్స్ ఫ్యూయెల్ అంటే ఏమిటి?

టొయోటా కరోలా ఆల్టిస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు గురించి తెలుసుకోవడానికి ముందుగా మనం ఫ్లెక్స్ ఫ్యూయెల్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. పేరుకి తగినట్లు ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్ కలిగిన కార్లలో ఇంధన ఆప్షన్లు కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. సాధారణ పెట్రోల్ వాహనాలు కేవలం పెట్రోల్ ఇంధనంతో మాత్రమే నడుస్తాయి. అయితే, ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలు 83 శాతం వరకు పెట్రోల్ మరియు 17 శాతం ఇథనాల్​ కలయికతో కూడిన ఇంధనంతో పనిచేస్తాయి. ప్రస్తుతం, మనం వినియోగిస్తున్న పెట్రోల్‌లో ఇథనాల్ కలిసి ఉన్నప్పటికీ, దాని శాతం చాలా తక్కువగా ఉంటుంది.

భారతదేశంలో మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కరోలా ఆల్టిస్ హైబ్రిడ్‌ను ప్రవేశపెట్టిన టొయోటా!

రానున్న సంవత్సరాలలో భారత ప్రభుత్వం పెట్రోల్ ఇంధనంలో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి పెంచాలని చూస్తోంది. ఇదే గనుక జరిగితే మనదేశంలోని ఆటోమొబైల్ సంస్థలు తప్పనిసరిగా ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్లను ఉపయోగించాల్సి ఉంటుంది. సాంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనలతో పోలిస్తే, ఫ్లెక్స్​ ఫ్యూయెల్ ఇంజన్‌తో నడిచే​ కార్లు చాలా సమర్థవంతమైనవిగా చెబుతారు. పూర్తి పెట్రోల్ వాహనాలతో పోలిస్తే, ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్ కలిగిన వాహనాల యాక్సలరేషన్ మరియు ​పెర్ఫార్మెన్స్​ కూడా మెరుగ్గా ఉంటుంది. అయితే, పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల మైలేజీ తగ్గుతుందని గమనించాలి.

భారతదేశంలో మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కరోలా ఆల్టిస్ హైబ్రిడ్‌ను ప్రవేశపెట్టిన టొయోటా!

ఎడమ చేతి వైపు స్టీరింగ్ వీల్

ఇక భారత్‌లో ప్రవేశపెట్టబడిన టొయోటా కరోలా ఆల్టిస్ విషయానికి వస్తే, దేశంలో పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన చేపట్టిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ ప్రాజెక్టులో భాగంగా టొయోటా ఈ కారును విదేశాల నుండి భారతదేశానికి దిగుమతి చేసుకుంది. అందుకే, ఇది అమెరికన్ మార్కెట్లలో కనిపించే కార్ల మాదిరిగా ఎడమ చేతి వైపు స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంటుంది. సమాచారం ప్రకారం, ఈ కారును ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్లు సర్వసాధారణంగా ఉపయోగించబడే బ్రెజిల్ నుండి తీసుకోబడిందని నమ్ముతారు. ఈ తరం కరోలా హైబ్రిడ్ రెండు సంవత్సరాలుగా విదేశీ మార్కెట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

భారతదేశంలో మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కరోలా ఆల్టిస్ హైబ్రిడ్‌ను ప్రవేశపెట్టిన టొయోటా!

ఇంజన్ మూడు రకాల శక్తితో అనుకూలంగా ఉంటుంది

టొయోటా కరోలా ఆల్టిస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ హైబ్రిడ్ ఇంజన్‌ పెట్రోల్ మరియు ఇథనాల్ రెండింటితోనూ పనిచేయగల 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఈ కారులో సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కోసం ఓ ఎలక్ట్రిక్ మోటారు కూడా ఉంటుంది. వివిధ డ్రైవ్ మోడ్‌లతో కూడిన ఈ ఇంజన్ ప్రత్యేకమైన సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. బ్రెజిల్‌లో లభించే కరోలా ఆల్టిస్ హైబ్రిడ్ ఇంజన్ గరిష్టంగా 142 ఎన్ఎమ్ (100 శాతం ఇథనాల్‌పై) టార్క్‌తో 101 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, హైబ్రిడ్ మోటార్ 72 బిహెచ్‌పి శక్తిని మరియు 163 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

భారతదేశంలో మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కరోలా ఆల్టిస్ హైబ్రిడ్‌ను ప్రవేశపెట్టిన టొయోటా!

నాన్-హైబ్రిడ్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఆప్షన్

టొయోటా కరోలా ఆల్టిస్ కోసం నాన్-హైబ్రిడ్ 2.0-లీటర్ డ్యూయల్ వివిటి పెట్రోల్ ఇంజన్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఇది కూడా పూర్తిగా పెట్రోల్ లేదా ఇథనాల్ రెండింటితోనూ నడుస్తుంది. ఇది బయో-ఇంధనంపై గరిష్టంగా 177 బిహెచ్‌పి పవర్ ను మరియు 210 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది.

భారతదేశంలో మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కరోలా ఆల్టిస్ హైబ్రిడ్‌ను ప్రవేశపెట్టిన టొయోటా!

ఇంధన సామర్ధ్యం (మైలేజ్)

టొయోటా బ్రెజిల్ లో విక్రయిస్తున్న కరోలా ఆల్టిస్ హైబ్రిడ్ కోసం ఎలాంటి క్లెయిమ్ చేసిన ఇంధన సమర్థ (మైలేజ్) గణాంకాలను ఉదహరించలేదు, అయితే ఈ వాహనం నగరంలో మరియు హైవేలో లీటరుకు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని సాధించగలదని భావిస్తున్నారు. ఈ గణాంకాలు దాని పరిమాణం మరియు బరువును పరిగణనలోకి తీసుకుని అంచనా వేయబడ్డాయి. హోండా సిటీ హైబ్రిడ్ రియల్ టైం డ్రైవింగ్ లో లీటరుకు 23 కిలోమీటర్ల వరకూ మైలేజీని అందించగలదు. ఇదిలా ఉండగా, మారుతి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ లీటరుకు 25 కిలోమీటర్ల వరకూ మైలేజీని అందిస్తుందని గుర్తించాలి.

భారతదేశంలో మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కరోలా ఆల్టిస్ హైబ్రిడ్‌ను ప్రవేశపెట్టిన టొయోటా!

ప్రదర్శన ఉంటుందా?

టొయోటా కరోలా ఆల్సిట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ హైబ్రిడ్ సెడాన్ పరిశోధన కోసం భారతదేశానికి తీసుకురాబడింది. నిజానికి, టొయోటా గడచిన 2020 ప్రారంభంలో భారతదేశం నుండి కరోలా ఆల్టిస్ ను డిస్‌కంటిన్యూ చేసింది. ఈ సెగ్మెంట్‌లో తక్కువ డిమాండ్ మరియు BS-VI కంప్లైంట్ నిబంధనల కారణంగా, తయారీ ఖర్చులు పెరగడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, తాజా పరిణామాలను చూస్తుంటే, భారతదేశంలో టొయోటా చేస్తున్న ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్ ప్రయోగం సక్సెస్ అయినట్లయితే, ఇది తిరిగి భారతదేశంలో ప్రవేశించే అవకాశాలు లేకపోలేదని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

భారతదేశంలో మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కరోలా ఆల్టిస్ హైబ్రిడ్‌ను ప్రవేశపెట్టిన టొయోటా!

భారతీయ డ్రైవింగ్ పరిస్థితులలో ఇథనాల్-మిశ్రమ ఇంధనాన్ని పరీక్షించడానికి పైలట్ ప్రాజెక్ట్ కోసం ప్రవేశపెట్టిన టొయోటా కరోలా ఆల్టిస్ హైబ్రిడ్ వేరియంట్, గతంలో విక్రయించబడిన స్టాండర్డ్ కరోలా ఆల్టిస్ కంటే చాలా ఖరీదైనదిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ, టొయోటా తమ కరోలా ఆల్టిస్‌ను తిరిగి భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని భావించికపోయినా, ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్లను తమ ప్రస్తుత మరియు భవిష్యత్ లైనప్ మోడళ్లలో తప్పకుండా ఉపయోగించే అవకాశం మాత్రం ఉంటుంది. సహజసిద్ధంగా లభించే జీవ ఇంధనాలు మరింత సరసమైనవిగా ఉంటాయి మరియు వాటితో నడిచే వాహనాల నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి.

Most Read Articles

English summary
Toyota brought imported corolla altis hybrid to india with flex fuel engine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X