Toyota Fortuner కొనుగోలుదారులకు షాక్.. కొత్త సంవత్సరంలో భారీగా పెరిగిన ధరలు..

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా (Toyota) భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టొయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) ధరను పెంచింది. జనవరి 2022 నెల నుండి ఈ ఎస్‌యూవీ ధర రూ. 1.10 లక్షల వరకు పెరిగింది. తాజా ధరల పెంపు అనంతరం టొయోటా ఫార్చ్యూనర్ యొక్క ప్రారంభ ధర రూ. 31.39 లక్షల (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది. ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ కావాలనుకునే వారు రూ. 43.43 లక్షలు (ఎక్స్-షోరూమ్) చెల్లించాల్సి ఉంటుంది.

Toyota Fortuner కొనుగోలుదారులకు షాక్.. కొత్త సంవత్సరంలో భారీగా పెరిగిన ధరలు..

వేరియంట్ల వారీగా పెరిగిన ధరల వివరాలను గమనిస్తే, టొయోటా ఫార్చ్యూనర్ 4x2 మ్యాన్యువల్ పెట్రోల్, 4x2 ఆటోమేటిక్ పెట్రోల్, 4x2 మ్యాన్యువల్ డీజిల్ మరియు 4x2 ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 66,000 పెరగాయి. ధరల పెంపు అనంతరం వాటి ధరలు వరుసగా రూ. 31.39 లక్షలు, రూ. 32.98 లక్షలు, రూ. 33.89 లక్షలు మరియు రూ. 36.17 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. ఇందులో ఇతర వేరియంట్‌ల ధరలను కంపెనీ రూ. 1.10 లక్షల మేర పెంచింది.

Toyota Fortuner కొనుగోలుదారులకు షాక్.. కొత్త సంవత్సరంలో భారీగా పెరిగిన ధరలు..

టొయోటా ఫార్చ్యూనర్ 4x4 మాన్యువల్, 4x4 ఆటోమేటిక్, లెజెండ్ 4x2 ఆటోమేటిక్ డీజిల్ మరియు 4x4 ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 1.10 పెరిగాయి. ప్రస్తుతం, వీటి ధరలు వరుసగా రూ. 36.99 లక్షలు, రూ. 39.28 లక్షలు, రూ. 39.71 లక్షలు, రూ. 43.43 లక్షలకు చేరుకున్నాయి. ముడిసరుకుల ధరలు పెరగడం వల్లే వాహనాల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది.

Toyota Fortuner కొనుగోలుదారులకు షాక్.. కొత్త సంవత్సరంలో భారీగా పెరిగిన ధరలు..

ఇక కొత్త టొయోటా ఫార్చ్యూనర్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్ మరియు లెజెండ్ అనే రెండు రూపాల్లో అందుబాటులో ఉంది. ఈ కారులో ఉపయోగించిన ఇంజన్ గురించి మాట్లాడితే, టొయోటా ఫార్చ్యూనర్ శక్తివంతమైన 2.8-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పి పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ల టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

Toyota Fortuner కొనుగోలుదారులకు షాక్.. కొత్త సంవత్సరంలో భారీగా పెరిగిన ధరలు..

ఇందులో పెట్రోల్ వెర్షన్ కోరుకునే వారి కోసం పవర్‌ఫుల్ 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఇది గరిష్టంగా 166 బిహెచ్‌పి శక్తిని మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది మరియు టూ-వీల్ అలాగే ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుంది.

Toyota Fortuner కొనుగోలుదారులకు షాక్.. కొత్త సంవత్సరంలో భారీగా పెరిగిన ధరలు..

టొయోటా ఫార్చ్యూనర్ లోపలి భాగంలో ఆపిల్ కార్‌ప్లే (Apple CarPlay) మరియు ఆండ్రాయిడ్ ఆటో (Android Auto) సపోర్ట్ తో కూడిన పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎల్ఈడి యాంబియంట్ లైటింగ్, అప్‌గ్రేడ్ చేయబడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ వంటి అనేక ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

Toyota Fortuner కొనుగోలుదారులకు షాక్.. కొత్త సంవత్సరంలో భారీగా పెరిగిన ధరలు..

అంతేకాకుండా, ఇందులో 11 జెబిఎల్ బ్రాండ్ స్పీకర్లు మరియు సబ్‌ వూఫర్‌తో కూడిన ఆడియో సిస్టమ్, మూడు డ్రైవింగ్ మోడ్‌లు (ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్), లెజెండ్ వేరియంట్‌లో సీట్ వెంటిలేషన్ సిస్టమ్, పవర్ బ్యాక్ డోర్ కోసం కిక్ సెన్సార్ మొదలైనవి లభిస్తాయి. ఇంకా ఇందులో 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, రాడార్ గైడెడ్ డైనమిక్ క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి కూడా ఉన్నాయి.

Toyota Fortuner కొనుగోలుదారులకు షాక్.. కొత్త సంవత్సరంలో భారీగా పెరిగిన ధరలు..

కొత్త టయోటా ఫార్చ్యూనర్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, సన్నని ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, కొత్త ఫ్రంట్ బంపర్, చిన్న ఫాగ్ ల్యాంప్స్ మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి. ఇందులో కొత్త ఎల్ఈడి టైల్‌లైట్లు డిజైన్ కూడా చూడొచ్చు. కొత్త మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఇవ్వబడ్డాయి.

Toyota Fortuner కొనుగోలుదారులకు షాక్.. కొత్త సంవత్సరంలో భారీగా పెరిగిన ధరలు..

లెజెండ్ వేరియంట్ విషయానికి వస్తే, ఇది ముందు వైపు నుండి మరింత అగ్రెసివ్ గా కనిపిస్తుంది. ఇందులో సన్నగా ఉండే ఫ్రంట్ గ్రిల్, ఎత్తైన ఫ్రంట్ బంపర్, పెద్ద ఎయిర్ డ్యామ్, కొత్త మరియు విభిన్నమైన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు దీనికి మరింత ప్రీమియం రూపాన్ని అందిస్తాయి. టొయోటా ఫార్చ్యూనర్ బారత మార్కెట్లో 2009లో ప్రవేశపెట్టబడింది మరియు అప్పటి నుండి ఇందులో అనేక కొత్త తరం మోడల్‌లు మరియు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను మార్కెట్లో పరిచయం చేయబడ్డాయి. భారతదేశంలో ఇప్పటివరకు 1.70 లక్షల యూనిట్లకు పైగా ఫార్చ్యూనర్ మోడళ్లు విక్రయించబడ్డాయి.

Toyota Fortuner కొనుగోలుదారులకు షాక్.. కొత్త సంవత్సరంలో భారీగా పెరిగిన ధరలు..

Innova Crysta లో రెండు కొత్త బేస్ వేరియంట్ల విడుదల..

ఇదిలా ఉంటే టొయోటా తమ ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) ఎమ్‌పివిలో రెండు కొత్త బేస్ వేరియంట్‌ లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ పాపులర్ ఎమ్‌పివి ఇప్పుడు కేవలం రూ. 16.89 లక్షల ప్రారంభ ధరకే అందుబాటులోకి వచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన వేరియంట్లలో పెట్రోల్ మ్యాన్యువల్ 7-సీటర్ వేరియంట్ జిఎక్స్ మరియు పెట్రోల్ మ్యాన్యువల్ 8-సీటర్ వేరియంట్ జిఎక్స్ లు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 16.89 లక్షలు మరియు రూ. 16.94 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడ్డాయి.

Most Read Articles

English summary
Toyota fortuner price increased upto rs 1 10 lakh new price list
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X