2022 Hilux యాక్ససరీస్ విడుదల చేసిన Toyota: పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా (Toyota) ఇటీవల కాలంలో కొత్త టయోటా హైలక్స్ (Toyota Hilux) పికప్ ట్రక్కుని భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. అయితే ఇది 2022 మార్చి నెలలో దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ కొత్త వెహికల్ యొక్క బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కావున కొనుగోలు చేయదలచిన కస్టమర్లు ఈ లైఫ్ స్టైల్ ట్రక్కును రూ. 1 లక్ష చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమయ్యీ అవకాశం ఉంటుంది.

2022 Hilux యాక్ససరీస్ విడుదల చేసిన Toyota: పూర్తి వివరాలు

టయోటా హైలక్స్ ఇండియన్ మార్కెట్లో రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి STD వేరియంట్, మరొకటి హై వేరియంట్. అయితే కంపెనీ ఈ కొత్త మోడల్ మార్కెట్లో విడుదల కాకముందే, కంపెనీ యాక్ససరీస్ విడుదల చేసింది. ఈ యాక్ససరీస్ కొనాలనుకునే వారు కంపెనీ యొక్క ఏదైనా అధికారిక టయోటా డీలర్‌షిప్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ యాక్ససరీస్ గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

2022 Hilux యాక్ససరీస్ విడుదల చేసిన Toyota: పూర్తి వివరాలు

టెంట్ విత్ కేనోఫీ:

2022 టయోట హైలక్స్ తో ఎప్పుడూ సుదూర ప్రాంతాలకు క్యాంపింగ్‌కు వెళ్లే వారి కోసం కంపెనీ టొయోటా టెంట్ విత్ కేనోఫీ అందిస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు వెలువడ్డాయి, కావున ఇది ఎలా ఉంటుందో మీరు ఈ ఫోటోల ద్వారా చూడవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

2022 Hilux యాక్ససరీస్ విడుదల చేసిన Toyota: పూర్తి వివరాలు

రోల్ బార్ మరియు ఓవర్ ఫెండర్:

టయోట హైలక్స్ యొక్క బూట్ లేదా లోడింగ్ బెడ్‌ని తెరిచి ఉంచాలనుకునే వారు రోల్ బార్ మరియు ఓవర్ ఫెండర్‌ వంటి వాటిని కూడా పొందవచ్చు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపించడమే కాకూండా.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీకు అదనపు రక్షణను కూడా అందిస్తుంది. ప్రమాదం సమయంలో ఈ ట్రక్ బోల్తా పడకుండా నిరోధిస్తుంది. కావున ఇది కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

2022 Hilux యాక్ససరీస్ విడుదల చేసిన Toyota: పూర్తి వివరాలు

టన్నౌ కవర్ (Tonneau Cover):

టయోటా కంపెనీ ఇప్పుడు దాని కొత్త హైలక్స్ ట్రక్కు కోసం టన్నౌ కవర్ కూడా అందిస్తుంది. ఇది మొత్తం లోడింగ్ బెడ్‌ను కవర్ చేస్తుంది. ఇది లోడింగ్ బెడ్‌పై నీరు, దుమ్ము మొదలైనవి పేరుకుపోకుండా ఉండటానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకూండా ఇది చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది.

2022 Hilux యాక్ససరీస్ విడుదల చేసిన Toyota: పూర్తి వివరాలు

టెయిల్‌గేట్ అసిస్ట్:

కొత్త 2022 టయోట హైలక్స్ బూట్/టెయిల్‌గేట్ కోసం హైడ్రాలిక్ స్ట్రట్‌లను అందిస్తుంది. వీటి ద్వారా టెయిల్ గేట్ సులభంగా ఓపెన్ అవుతుంది మరియు క్లోస్ అవుతుంది. ఇది మీకు హెడ్జ్ ఫ్రీ బూట్/టెయిల్‌గేట్ యాక్సెస్‌ని ఇస్తుంది, కాబట్టి మీరు మీ వస్తువులను సులభంగా నిల్వ చేసుకోవచ్చు. ఇది కూడా వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

2022 Hilux యాక్ససరీస్ విడుదల చేసిన Toyota: పూర్తి వివరాలు

ఫ్రంట్ అండర్-రన్:

ఫ్రంట్ అండర్-రన్ అనే యాక్ససరీ కొత్త టయోటా హైలక్స్ పికప్ ట్రక్ లో అందించబడుతుంది. దీనిని స్కిడ్ ప్లేట్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే, ఇది స్టైలింగ్ ప్రయోజనాల కోసం మాత్రమేనని మరియు రక్షణ కోసం కాదని మనకు తెలుస్తోంది. కావున కొనుగోలుదారులు తమకు అవసరమైతే కొనుగోలు చేయవచ్చు.

2022 Hilux యాక్ససరీస్ విడుదల చేసిన Toyota: పూర్తి వివరాలు

వైర్‌లెస్ ఛార్జర్:

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో విడుదలవుతున్న దాదాపు ఆధునిక మోడల్స్ అన్నింటిలోనూ ఈ వైర్‌లెస్ ఛార్జర్ అనేది అందుబటులో ఉంటుంది. ఇది ఇప్పుడు చాలా అవసరమైన ఫీచర్. ఇది సెంటర్ కన్సోల్‌లో ఇన్‌స్టాల్ చేయబడుతుంది. అయితే, రూ. 30 లక్షల SUVలలో ఈ ఫీచర్‌ని స్టాండర్డ్‌గా అందించాలని కొందరు భావిస్తున్నారు, కానీ ఇప్పుడు రూ. 10 లక్షల రూపాయలకు అందుబటులో ఉన్న దాదాపు చాలా వాహనాల్లో ఈ ఫీచర్ అందుబటులో ఉంది.

2022 Hilux యాక్ససరీస్ విడుదల చేసిన Toyota: పూర్తి వివరాలు

టైర్ ప్రెజర్ మానిటర్ మరియు కంప్రెసర్:

కొత్త 2022 టయోటా హైలక్స్ ట్రక్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఆప్సన్ తో అందించే అవకాశం లేదు. కావున మీకు ఈ ఫీచర్ కావాలనుకుంటే యాక్ససరీస్ లో పొందవచ్చు. ఇది టైర్ డిఫ్లేట్ అయినప్పుడు దాన్ని నింపడంలో మీకు సహాయపడుతుంది. కావున ఇది కూడా చాలా అద్భుతమైన మరియు ఉపయోగకరమైన ఫీచర్.

2022 Hilux యాక్ససరీస్ విడుదల చేసిన Toyota: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త హైలక్స్ పికప్ ట్రక్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. కావున ఇది వాహన వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

టయోటా హైలక్స్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ మరియు వీల్‌బేస్‌ను 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ ఉంటుంది. దీని బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది.

2022 Hilux యాక్ససరీస్ విడుదల చేసిన Toyota: పూర్తి వివరాలు

టయోటా హైలక్స్ పికప్ ట్రక్ 2.8-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌ అదుబీటులోకి రానుంది. ఇది 204 bhp పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు 4X4 డ్రైవ్‌ట్రెయిన్‌తో జత చేయబడి ఉటుంది, కావున మంచి పనితీరుకి అందిస్తుంది.

2022 Hilux యాక్ససరీస్ విడుదల చేసిన Toyota: పూర్తి వివరాలు

ఈ ట్రక్ ఇటీవల NCAP టెస్ట్ లో ఏకంగా 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. కావున ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ వాహనదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి. దీనికి 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారెంటీ ఇవ్వబడుతుంది, దీనిని 5 సంవత్సరాలు లేదా 2.2 లక్షల కిమీ వరకు పొడిగించవచ్చు.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota hilux pickup truck official accessories revealed details
Story first published: Thursday, January 27, 2022, 17:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X