టొయోట లాంచ్ చేసిన కొత్త హైరైడర్: ధరలు కూడా తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో 'టొయోట' (Toyota) కంపెనీ తన కొత్త మిడ్-సైజ్ ఎస్‌యువి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' (Urban Cruiser Hyryder) ని ఇప్పటికే అధికారికంగా ఆవిష్కరించింది. అయితే ధరలు మాత్రం ఈ రోజు విడుదల చేసింది. దేశీయ విఫణిలో కొత్త హైరైడర్ ప్రారంభ ధరలు రూ. 15.11 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా, టాప్ వేరియంట్ ధర రూ 18.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది.

Recommended Video

భారత్‌లో విడుదలైన Tata Nexon EV Max: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో కొత్త టొయోట హైరైడర్ ఎన్ని వేరియంట్స్ లో విడుదలైంది, వాటి ధరలు ఎలా ఉన్నాయి, వంటి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

టొయోట హైరైడర్ ధరలు తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

కంపెనీ ప్రస్తుతానికి మొదటి నాలుగు వేరియంట్‌ల ధరలను మాత్రమే విడుదల చేసింది. వాటి ధరలు ఈ కింది పట్టికలో చూడవచ్చు. అయితే మిగిలిన వేరియంట్ల ధరలు కూడా దశల వారిగా త్వరలోనే ప్రకటించనున్నట్లు కూడా కంపెనీ తెలిపింది.

Grade Name Price
V eDrive 2WD HYBRID ₹18,99,000
G eDrive 2WD HYBRID ₹17,49,000
S eDrive 2WD HYBRID ₹15,11,000
V AT 2WD NEO DRIVE ₹17,09,000
టొయోట హైరైడర్ ధరలు తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

కొత్త టొయోట హైరైడర్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారభించింది. కావున ఈ SUV కొనాలనుకునే కస్టమర్లు రూ. 25,000 చెల్లింది టయోటా డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు.

టొయోట హైరైడర్ ధరలు తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టొయోట హైరైడర్ అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇందులో సన్నని డబుల్-లేయర్ డేటైమ్ రన్నింగ్ లైట్లు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇవి 'క్రిస్టల్ యాక్రిలిక్' గ్రిల్‌లో చక్కగా కలిసిపోతాయి. డోర్స్ మీద హైబ్రిడ్ బ్యాడ్జ్‌ వంటి వాటిని చూడవచ్చు. వెనుక వైపు సి-ఆకారంలో ఉండే టెయిల్ లైట్స్ ఉన్నాయి.

టొయోట హైరైడర్ ధరలు తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో టొయోట హైరైడర్ మొత్తం 11 కలర్ ఆప్సన్స్ లో విడుదలైంది. ఇందులో 7 మోనోటోన్ కలర్స్ కాగా, మిగిలిన నాలుగు డ్యూయెల్ టోన్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కంపెనీ ఇప్పుడు ఏకంగా 11 కలర్ ఆప్సన్స్ లో తీసుకురావడం వల్ల కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ ఆప్సన్స్ ఎంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

టొయోట హైరైడర్ ధరలు తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఇప్పుడు పరిమాణం పరంగా కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కావున దీని పొడవు 4365 మిమీ, వెడల్పు 1795 మిమీ, ఎత్తు 1645 మిమీ కాగా, వీల్ బేస్ 2600 మిమీ వరకు ఉంటుంది.

టొయోట హైరైడర్ ధరలు తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. డ్యాష్‌బోర్డ్‌లో 7-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంది. అంతే కాకుండా ఇందులో హెడ్-అప్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, రిమోట్ ఇగ్నిషన్ ఆన్/ఆఫ్, రిమోట్ ఏసీ కంట్రోల్, డోర్ లాక్/అన్‌లాక్, స్టోలెన్ వెహికల్ ట్రాకర్ మరియు ఇమ్మొబిలైజర్ వంటి అనేక ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

టొయోట హైరైడర్ ధరలు తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని పొందిన మొదటి మిడ్-సైజ్ SUV. ఇది టొయోటా యొక్క 1.5-లీటర్ TNGA అట్కిన్సన్ సైకిల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 92 హెచ్‌పి పవర్ మరియు 122 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇందులో 79 హెచ్‌పి పవర్ మరియు 141 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడి ఉంటుంది.

టొయోట హైరైడర్ ధరలు తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

హైరైడర్ మారుతి సుజుకి నుండి మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను కూడా పొందుతుంది. కావున ఇందులో 1.5-లీటర్ K15C ఇంజిన్‌ కూడా ఉంటుంది. ఇది 103 హెచ్‌పి పవర్ మరియు 137 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

టొయోట హైరైడర్ ధరలు తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

ఇక చివరగా హైరైడర్ SUV లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, వెనుక ప్రయాణీకుల కోసం 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

టొయోట హైరైడర్ ధరలు తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

టొయోట హైరైడర్ ని కంపెనీ దేశీయ మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి చాలామంది ఎప్పుడెప్పుడు ధరలు వెల్లడవుతాయా.. అని వేచి చూసారు. అయితే ఇప్పుడు నాలుగు వేరియంట్ల ధరలు వెల్లడయ్యాయి. ఇక మిగిలిన వేరియంట్ల ధరలు కూడా త్వరలోనే వెల్లడవుతాయి. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త మిడ్-సైజ్ SUV మార్కెట్లో తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే వెల్లడవవుతుంది.

Most Read Articles

English summary
Toyota hyryder launched in india price features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X