దేశంలో Innova Hycross పేరును రిజిస్టర్ చేసిన టొయోటా.. ఇన్నోవాలో హైబ్రిడ్ వేరియంట్ రానుందా..?

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా (Toyota) భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం ఎమ్‌పివి ఇన్నోవా (Innova) లో ఓ కొత్త హైబ్రిడ్ వేరియంట్‌ను పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా, టొయోటా భారతదేశంలో "ఇన్నోవా హైక్రాస్" (INNOVA HYCROSS) అనే పేరును కూడా ట్రేడ్‌మార్క్ కోసం రిజిస్టర్ చేసింది. బెంగుళూరులోని టొయోటా కార్ ఫ్యాక్టరీ సమీపంలో ఇన్నోవా హైబ్రిడ్ వేరియంట్‌‌ను కంపెనీ పరీక్షిస్తుండగా పలు సందర్భాల్లో కెమెరాకు కూడా చిక్కింది.

దేశంలో Innova Hycross పేరును రిజిస్టర్ చేసిన టొయోటా.. ఇన్నోవాలో హైబ్రిడ్ వేరియంట్ రానుందా..?

భారతదేశంలో ఇన్నోవా హైక్రాస్ పేరును రిజిస్టర్ చేయడాన్ని చూస్తుంటే, టొయోటా తమ ఇన్నోవా ఎమ్‌పివి యొక్క రాబోయే హైబ్రిడ్ వెర్షన్ కోసం ఈ నేమ్‌ప్లేట్ ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. టొయోటా ఇటీవలే తమ హైబ్రిడ్ కార్ల కోసం టీజర్ వీడియోని కూడా విడుదల చేసిన సంగతి తెలిసినదే. హమ్ హై హైబ్రిడ్ అనే క్యాప్షన్‌తో కంపెనీ ఓ టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ టొయోటా నుండి రాబోయే హైబ్రిడ్ కార్ల సిరీస్ ను సూచిస్తుంది. ఈ సిరీస్ లో టొయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ వేరియంట్ కూడా ఒకటి కావచ్చు.

దేశంలో Innova Hycross పేరును రిజిస్టర్ చేసిన టొయోటా.. ఇన్నోవాలో హైబ్రిడ్ వేరియంట్ రానుందా..?

టొయోటా ఇన్నోవా విషయానికి వస్తే, గతంలో టొయోటా నుండి ఈ విభాగంలో సేవలందించిన పాపులర్ ఎమ్‌పివి టొయోటా క్వాలిస్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు 2004 ఇన్నోవా ఎమ్‌పివిని కంపెనీ మొదటిసారిగా భారత మార్కెట్ కు పరిచయం చేసింది. ఇది డిజైన్ పరంగా టొయోటా క్వాలిస్ ఎమ్‌పివికి పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ, టొయోటా ఇన్నోవా అతి తక్కువ సమయంలోనే గణనీయమైన మార్కెట్ వాటాను పొందింది. భారతదేశంలో టొయోటా ఇన్నోవా విజయానికి ప్రధాన కారణం దాని రైడ్ క్వాలిటీ మరియు ఈ జపనీస్ బ్రాండ్ యొక్క విశ్వసనీయత.

దేశంలో Innova Hycross పేరును రిజిస్టర్ చేసిన టొయోటా.. ఇన్నోవాలో హైబ్రిడ్ వేరియంట్ రానుందా..?

టొయోటా ఇన్నోవాను భారత మార్కెట్లో విడుదల చేసి దాదాపు దశాబ్ధం గడచిన తర్వాత కంపెనీ ఇందులో

2015 సంవత్సరంలో, రెండవ తరం టొయోటా ఇన్నోవా ను 'ఇన్నోవా క్రిస్టా' పేరుతో విడుదల చేసింది. గత మోడళ్లతో పోల్చుకుంటే, ఈ మోడల్ మరింత శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉండటమే కాకుండా, డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. మరింత ప్రీమియం లుక్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్‌తో ఇది కస్టమర్ల మదిని దోచుకుంది.

దేశంలో Innova Hycross పేరును రిజిస్టర్ చేసిన టొయోటా.. ఇన్నోవాలో హైబ్రిడ్ వేరియంట్ రానుందా..?

అలాంటి పాపులర్ ఇప్పుడు సరికొత్త హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ తో మార్కెట్లోకి రాబోతోంది. టొయోటా ఇన్నోవా ఎమ్‌పివి యొక్క హైబ్రిడ్ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఈ కొత్త ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌కు అనుగుణంగా ఒక సరికొత్త ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉండవచ్చని సమాచారం. ఇందులో పెద్ద బ్యాటరీ ప్యాక్ మరియు శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారు ఉంటుందని అంచనా. గతంలో విడుదలైన స్పై చిత్రాలను బట్టి చూస్తే, రాబోయే టొయోటా ఇన్నోవా హైక్రాస్ ప్రస్తుత ఇన్నోవా క్రిస్టాకు చాలా భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

దేశంలో Innova Hycross పేరును రిజిస్టర్ చేసిన టొయోటా.. ఇన్నోవాలో హైబ్రిడ్ వేరియంట్ రానుందా..?

అంతేకాకుండా, ప్రస్తుత ఇన్నోవా క్రిస్టాతో పోల్చితే రాబోయే ఇన్నోవా హైక్రాస్ ఇంటీరియర్ డిజైన్ మరియు లేఅవుట్‌లో కూడా పెద్ద మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం, టొయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిలో డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయు. ఇందులో మొదటిది ఎంపిక 2.4-లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ మరియు రెండవది 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ రెండు ఇంజన్లు కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తున్నాయి.

దేశంలో Innova Hycross పేరును రిజిస్టర్ చేసిన టొయోటా.. ఇన్నోవాలో హైబ్రిడ్ వేరియంట్ రానుందా..?

కాగా, రాబోయే 2023 టొయోటా ఇన్నోవా హైక్రాస్ 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ యొక్క మరింత శక్తివంతమైన వెర్షన్‌తో అందించబడుతుందని భావిస్తున్నారు. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, నిస్సాన్ కిక్స్, స్కోడా కుషాక్ మరియు వోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి వాటికి పోటీగా ఉండే టొయోటా యొక్క భవిష్యత్ మిడ్-సైజ్ ఎస్‌యూవీకి కూడా శక్తినిస్తుందని సమాచారం.

దేశంలో Innova Hycross పేరును రిజిస్టర్ చేసిన టొయోటా.. ఇన్నోవాలో హైబ్రిడ్ వేరియంట్ రానుందా..?

ఈ కొత్త ఇంజన్ విషయానికి వస్తే, ఇది గ్లోబల్ మార్కెట్లలో టొయోటా విక్రయిస్తున్న యారిస్ హ్యాచ్‌బ్యాక్ మరియు యారిస్ క్రాస్‌లలో ఉపయోగించబడే ఇంజన్. యారిస్ ట్విన్స్‌లో ఉపయోగించబడుతున్న ఈ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కలిసి గరిష్టంగా 113.5 బిహెచ్‌పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కేవలం పెట్రోల్ ఇంజన్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే, ఇది 120 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఎలక్ట్రిక్ మోటార్ తో కలిపి అయితే 141 ఎన్ఎమ్ ల కంటే కొంచెం ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

దేశంలో Innova Hycross పేరును రిజిస్టర్ చేసిన టొయోటా.. ఇన్నోవాలో హైబ్రిడ్ వేరియంట్ రానుందా..?

అయితే, ఇన్నోవా క్యారెక్టర్‌కు ఈ పవర్‌ట్రైన్ అందించే అవుట్‌పుట్ సరిపోకవచ్చు. కాబట్టి, రాబోయే ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివిలో టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ కారులో ఉపయోగిస్తున్న 2.5-లీటర్ అట్కిన్సన్ సైకిల్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కంపెనీ ఎంచుకునే అవకాశం కూడా ఉంది. కొత్త 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ సెడాన్‌లోని ఈ 2.5-లీటర్ ఇంజన్ గరిష్టంగా 175.5 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో ఇది 160 కిలోవాట్ అదనపు శక్తిని అందిస్తుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 215 బిహెచ్‌పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

Most Read Articles

English summary
Toyota innova to get hybrid powertrain innova hycross name registered in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X