కేవలం రూ.6 లక్షలకే మీ మారుతి బ్రెజ్జా కారును రేంజ్ రోవర్ ఎవోక్ కారులా మార్చుకోండి!!

రేంజ్ రోవర్ ఎవోక్ (Range Rover Evoque), ఈ చిన్న ఎస్‌యూవీకి ఓ పెద్ద స్టోరీనే ఉంది. అదేంటంటే, దాదాపు దివాళతీసే స్థితిలో ఉన్న బ్రిటీష్ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ను మన దేశీయ ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్ కొనుగోలు చేసిన తర్వాత ప్రవేశపెట్టబడిన మొదటి ఎస్‌యూవీనే రేంజ్ రోవర్ ఎవోక్. టాటా మరియు జేఎల్ఆర్ సంస్థలు స్వదేశీ మరియు విదేశీ టెక్నాలజీ సాయంతో డిజైన్ చేసి, రూపొందించిన సరసమైన మరియు కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ ఇది. ఈ మోడల్ లాంచ్ తర్వాత టాటా మరియు జేఎల్ఆర్ కంపెనీల జాతకమే మారిపోయింది.

కేవలం రూ.6 లక్షలకే మీ మారుతి బ్రెజ్జా కారును రేంజ్ రోవర్ ఎవోక్ కారులా మార్చుకోండి!!

సరే.. ఆ విషయం అటుంచి, అసలు విషయానికి వస్తే.. దాదాపు రూ.60 లక్షలకు పైగా ఖరీదు చేసే ఈ లగ్జరీ కారును కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, కేవలం రూ.6 లక్షలకే మీ కారును రేంజ్ రోవర్ ఎవోక్ మాదిరిగా మార్చుకుంటే ఎలా ఉంటుంది? అద్దిరిపోతుంది కదూ..! మరి అదెలానో తెలుసుకుందాం రండి.

భారతదేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki) అందిస్తున్న విటారా బ్రెజ్జా (Vitara Brezza) కాంపాక్ట్ ఎస్‌యూవీ, మోడిఫికేషన్ చక్కగా సూట్ అయ్యే మోడల్. ఓ కార్ ఔత్సాహికుడు రూ.6 లక్షలు వెచ్చించి, తన విటారా బ్రెజ్జా ఎస్‌యూవీని రేంజ్ రోవర్ ఎవోక్ మాదిరిగా కస్టమైజ్ చేయించుకున్నాడు. కంపెనీ గతంలో విక్రయించిన విటారా బ్రెజ్జా డీజిల్ మోడల్ యొక్క మిడ్-స్పెక్ వేరియంట్‌ను ఈ కస్టమైజేషన్ కోసం ఉపయోగించారు. ఈ కస్టమైజేషన్ లో కేవలం కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు మాత్రమే ఉన్నాయి, మెకానికల్ గా ఎలాంటి మార్పులు చేయలేదు.

కేవలం రూ.6 లక్షలకే మీ మారుతి బ్రెజ్జా కారును రేంజ్ రోవర్ ఎవోక్ కారులా మార్చుకోండి!!

రేంజ్ రోవర్ ఎవోక్ మాదిరిగా కనిపించే ఈ మోడిఫైడ్ విటారా బ్రెజ్జా ముందు భాగంలో, స్టాండర్డ్ వెర్టికల్ స్లాట్ గ్రిల్ స్థానంలో ల్యాండ్ రోవర్ యొక్క సిగ్నేచర్ హనీకోంబ్ గ్రిల్ ను జోడించారు. ఈ గ్రిల్ ను చూడగానే ఇది ఎవోక్ ఫ్రంట్ డిజైన్ గుర్తుకు తెస్తుంది. అంతేకాకుండా, దాని ఫ్రంట్ బంపర్ మరియు ఫాగ్ ల్యాంప్ యూనిట్ లో కూడా మార్పులు చేశారు. ఈ మార్పులతో ఇది తక్షణమే గుర్తించదగిన రేంజ్ రోవర్ ఎవోక్ ఫ్రంట్ ఫాసియాను అందిస్తుంది.

అయితే, సాధారణంగా రేంజ్ రోవర్ బ్రాండ్ కార్లలో ఫ్రంట్ గ్రిల్ పై కనిపించే గ్రీన్ కలర్ ల్యాండ్ రోవర్ బ్యాడ్జ్ ఇక్కడ బ్లాక్‌అవుట్ చేయబడి కనిపిస్తుంది. బహుశా డిజైన్ కాపీరైట్ సమస్యల వలన ఇలా చేసి ఉండొచ్చేమో. ఇక హెడ్‌ల్యాంప్ డిజైన్‌ ను గమనిస్తే, ఒరిజినల్ రేంజ్ రోవర్ ఎవోక్ కారులో కనిపించే స్వెప్ట్-బ్యాక్ డిజైన్‌తో కూడిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ను ఈ మోడిఫైడ్ ఎస్‌యూవీలో కూడా చూడొచ్చు. ఈ కొత్త హెడ్‌ల్యాంప్‌లు ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్‌లను కూడా కలిగి ఉంటాయి. ఇందులో ఫ్రంటర్ బంపర్ మరియు బానెట్ కూడా మోడిఫై చేయబడింది.

కేవలం రూ.6 లక్షలకే మీ మారుతి బ్రెజ్జా కారును రేంజ్ రోవర్ ఎవోక్ కారులా మార్చుకోండి!!

రేంజ్ రోవర్ ఎవోక్ మోడల్ నుండి స్పూర్తి పొందిన సిల్వర్ ఫినిష్డ్ స్కిడ్ ప్లేట్‌ మోడిఫికేషన్ లో కూడా డిజైనర్లు తమ ప్రతిభను చూపించారు. ఓవరాల్ గా ఈ కారును ముందు వైపు నుంచి చూస్తే, మొదటి చూపులో ఇది ఖచ్చితంగా రేంజ్ రేవర్ ఎవోక్ కారును ప్రతిభింభించేలా చేస్తుంది. స్టాండర్డ్ విటారా బ్రెజ్జాలో కనిపించే ఫెండర్లను కూడా ఫ్లేర్డ్‌గా ఉండేలా మోడిఫై చేశారు. ఇవి కూడా ఎవోక్ మాదిరిగానే కనిపిస్తాయి. అయితే, వెనుక వైపు రూఫ్ లైన్ ను మార్చడం చాలా శ్రమతో కూడుకున్న పని కాబట్టి, దానిని మాత్రం బ్రెజ్జా మాదిరిగానే వదిలేశారు.

ఇంకా ఇందులో డ్యుయల్-టోన్ ఫినిషింగ్‌తో కూడిన కొత్త అల్లాయ్ వీల్స్, ముందు భాగంలో రెడ్-బ్రేక్ కాలిపర్‌లు, బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడిన రూఫ్ మరియు పిల్లర్స్, వెనుక భాగంలో రీడిజైన్ చేసిన కొత్త టెయిల్‌ల్యాంప్స్, బూట్ లిడ్ పొడవునా కనిపించే పియానో ​​బ్లాక్ బార్, పియానో ​​బ్లాక్ ఫినిషింగ్‌లో ఉండే రూఫ్-స్పాయిలర్, సిల్వర్-ఫినిష్డ్ స్కిడ్ ప్లేట్ మరియు ఫాక్స్ డ్యూయల్-ఎగ్జాస్ట్ టిప్స్‌ వంటి మార్పులతో ఇది వెనుక వైపు నుండి కూడా రేంజ్ రోవర్ ఎవోక్ రూపాన్ని కలిగి ఉంటుంది.

కేవలం రూ.6 లక్షలకే మీ మారుతి బ్రెజ్జా కారును రేంజ్ రోవర్ ఎవోక్ కారులా మార్చుకోండి!!

ఈ కార్ ను మోడిఫై చేసిన వారు కేవలం ఎక్స్టీరియర్లను మాత్రమే కాకుండా ఇంటీరియర్లను కూడా మోడిఫై చేశారు. ఈ మోడిఫైడ్ విటారా బ్రెజ్జాలో రేంజ్ రోవర్ ఎవోక్ ఇంటీరియర్ థీమ్ ను తలపించే డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్ మర్యు అప్‌హోలెస్ట్రీ, బ్రిక్-రెడ్ కలర్ ఉండే డ్యూయెల్ టోన్ స్టీరింగ్ వీల్, సిల్వర్ యాక్సెంట్స్ తో కూడిన ఏసి వెంట్స్ మరియు డోర్ హ్యాండిల్స్ వంటి పలు మార్పులు ఇందులో చేయబడ్డాయి. ఎక్స్టీరియర్ తో పోల్చుకుంటే, ఇంటీరియర్ లో చేసిన మార్పులు చాలా పరిమితమనే చెప్పాలి.

కేవలం రూ.6 లక్షలకే మీ మారుతి బ్రెజ్జా కారును రేంజ్ రోవర్ ఎవోక్ కారులా మార్చుకోండి!!

ఇక చివరగా, ఇంజన్ మరియు గేర్‌బాక్స్ విషయానికి వస్తే, డిజైనర్లు ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో కంపెనీ విక్రయించిన డీజిల్ వెర్షన్ విటారా బ్రెజ్జాలో ఉపయోగించిన అదే 1.3-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌నే ఈ మోడిఫైడ్ కారులో కూడా కొనసాగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Turn your maruti vitara brezza into range rover evoque just for rs 6 lakh details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X