YouTube

కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలకుంటున్నారా.. అయితే త్వరలో విడుదల కానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు: ఇవే

భారతదేశంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన శకం ప్రారంభమైపోయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశీయ మార్కెట్లో అనేక ఎలక్ట్రిక్ కార్లు మరియి బైకులు విడుదలయ్యాయి, విడుదలవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఎలక్ట్రిక్ కార్లు ఏవి, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

Recommended Video

Tata Avinya EV Concept Unveiled | Details In Telugu

దేశీయ మార్కెట్లో రానున్న రోజుల్లో విడుదల కానున్న ఎలక్ట్రిక్ కార్లలో టాటా మోటార్స్ యొక్క 'టియాగో EV', బివైడి యొక్క 'అట్టో3' (BYD Atto3), టాటా ఆల్ట్రోజ్ EV, హ్యుందాయ్ ఐయోనిక్ 5 మరియు హ్యుందాయ్ కోనా ఫేస్‌లిఫ్ట్ వంటివి ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

టాటా టియాగో ఈవి (Tata Tiago EV):

దేశీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి అమ్మకాలు పొందుతూ.. ముందంజలో ఉన్న టాటా మోటార్స్ ఇప్పుడు భారతీయ మార్కెట్లో 'టాటా టియాగో ఈవి'ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు గురించి ఎక్కవ సమాచారం ప్రస్తుతానికి అందించలేదు, కానీ ఇందులో 26 kWh బ్యాటరీ ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాం. అదే సమయంలో ఇది కేవలం 8.5 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుందని, ఛార్జ్ చేసుసుకోవడానికి ఫాస్ట్ ఛార్జర్‌ కూడా సఫోర్ట్ చేస్తుంది. కావున ఈ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం ఒక గంటలోపు 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

భారతీయ మార్కెట్లో ఇప్పటికే ప్రారంభమైన పండుగ సీజన్లో ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుని కంపెనీ పరిచయం చేసే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. ఇప్పటికే టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలను 50,000 కంటే ఎక్కవమంది కస్టమర్ల వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో కంపెనీ మరో కొత్త ఎలక్ట్రిక్ కారుని విడుదల చేస్తే మరింత ఎక్కవమంది టాటా ఎలక్ట్రిక్ కార్లను వినియోగిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

బివైడి అట్టో3 (BYD Atto3):

ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి పొందిన 'బివైడి' (BYD) కంపెనీ దేశీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సిఇదమవుతోంది. ఇందులో భాగంగానే త్వరలోనే 'అట్టో3' ఎలక్ట్రిక్ అనే కొత్త లేటెస్ట్ కారుని విడుదల చేయనుంది. ఇప్పటికే కంపెనీ న్యూ ఢిల్లీ మరియు ముంబై వంటి నగరాల్లో కొత్త డీలర్‌షిప్‌లను కూడా ప్రారంభించింది. కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుని భారతదేశంలో పండగ సీజన్ లో పరిచయం చేసే అవకాశం అంటుందని ఆశిస్తాన్నాము.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

భారాతీయ మార్కెట్లో BYD కంపెనీ వచ్చే రెండు సంవత్సరాల్లో 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ యొక్క వాహనాలు శ్రీపెరంబుదూర్ సదుపాయంలో అసెంబుల్ చేయబడతాయి. BYD కంపెనీ యొక్క కొత్త ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 400 కిమీ నుంచి 500 కిమీ పరిధిని అందించడానికి అనుకూలమైన బ్యాటరీ ప్యాక్ కూడా పొందనుంది. ఇది మార్కెట్లో 'హ్యుందాయ్ కోనా' ఎలక్ట్రిక్ కారుకి ప్రత్యర్థిగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

టాటా ఆల్ట్రోజ్ ఈవి (Tata Altroz ​​EV):

ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికి వరకు ముందు వరుసలో ఉన్న టాటా మోటార్స్ 'ఆల్ట్రోజ్ ఈవి' ని కూడా ఈ విభాగంలో చేర్చడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కంపెనీ రానున్న రోజుల్లో 10 ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేయడానికి తగిన ప్రణాలికలను కూడా సిద్ధం చేసుకుంటోంది.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న Tata Altroz ​​EV ఇప్పటికే అందుబాటులో ఉన్న Nexon EV ప్రైమ్ మాదిరిగానే అదే కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. కావున ఇది 30.2 kW బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 127.2 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో ఇది ఒక ఫుల్ ఛార్జ్ 312 కిమీ పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 9.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ కారు ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 60 నిముషాల్లో 0 నుంచి 100 శాతం చార్జ్ అవుతుంది. ఇది సుమారు రూ. 15 లక్షల ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5):

ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai) భారతీయ మార్కెట్ కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' (Hyundai Ioniq 5) విడుదల చేయనున్న సంగతి ఇప్పటికే అందరికి తెలిసిన విషయమే. ఈ ఎలక్ట్రిక్ కారుని కంపెనీ ఈ సంవత్సరం చివరి నాటికి దేశీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. భారతీయ మార్కెట్లో విడుదలకానున్న ఈ కొత్త 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' 'ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్' ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

'హ్యుందాయ్ ఐయోనిక్ 5' ఎలక్ట్రిక్ SUV ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకానికి ఉంది, అయితే దేశీయ మారేట్లో ఇది స్టాండర్డ్ మరియు లాంగ్ రేంజ్ మోడళ్లలో అందుబాటులో ఉండనుంది. ఇవి రెండు ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందనున్నాయి.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

హ్యుందాయ్ ఐయోనిక్ 5 యొక్క స్టాండర్డ్ మోడల్ 358 కి.మీల పరిధిని అందిస్తుంది, అయితే లాంగ్ రేంజ్ మోడల్ 488 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. స్టాండర్డ్ మోడల్ లో 58 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో లాంగ్ రేంజ్ మోడల్‌లో 72.6 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. కావున ఈ రెండు మోడల్స్ యొక్క పవర్ మరియు టార్క్ అవుట్‌పుట్‌లు కూడా భిన్నంగా ఉంటాయి.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

హ్యుందాయ్ కోనా EV ఫేస్‌లిఫ్ట్ (Hyundai Kona EV Facelift):

భారతీయ మార్కెట్లో ఎంజి మోటార్స్ యొక్క ZS EVతో పాటు హ్యుందాయ్ కంపెనీ తన 'కోన' ఎలక్ట్రిక్ కారుని పరిచయం చేసింది. అయితే ఎంజి మోటార్ మాత్రమే ఇప్పటికే తన ZS EV ని అప్డేట్ చేసింది, కానీ హ్యుందాయ్ కంపెనీ మాత్రం తన 'కోన' ఎలక్ట్రిక్ కారులో ఎలాంటి అప్డేట్స్ తీసుకురాలేదు. కావున కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి కోన ఎలక్ట్రిక్ కారులో EV ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

హ్యుందాయ్ కోనా EV ఫేస్‌లిఫ్ట్ ఆధునిక డిజైన్ మరియు ఫీచర్స్ తో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కావున ఇందులో షార్ప్ హెడ్‌ల్యాంప్‌లు మరియు కొత్త ఫ్రంట్ గ్రిల్‌తో కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్ డిజైన్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. ఇంటీరియర్‌లో కూడా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పొందే అవకాశం ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

హ్యుందాయ్ కోనా EV ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత కాన్ఫిగరేషన్‌లో ఉన్న అదే 39.2 kW బ్యాటరీ-ప్యాక్‌తో అందించబడే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇదే కాన్ఫిగరేషన్‌లోవ్ వస్తుందా లేదా అనేది త్వరలో తెలుస్తుంది, అయితే ఇది వేరే ట్యూనింగ్‌తో పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో కూడా పరిచయం చేయవచ్చు. అయితే ఇది ఒక ఛార్జ్ తో 500 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందించే అవకాశం ఉంటుందని ఊహిస్తున్నారు. కావున ఈ కొత్త హ్యుందాయ్ కోనా ఫేస్‌లిఫ్ట్ ధర సుమారు రూ. 50 లక్షలు ఉండవచ్చు.

Most Read Articles

English summary
Upcoming electric cars in india tata tiago ev byd atto3 tata altroz ev hyundai and more details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X