కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ (Volkswagen Polo Legend Edition) విడుదల : ధర, ఫీచర్లు

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen Polo), దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ "పోలో" (Polo) లో కంపెనీ ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఫోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ (Volkswagen Polo Legend Edition) పేరుతో కంపెనీ ఈ కొత్త వేరియంట్ ను ప్రవేశపెట్టింది. స్టాండర్డ్ పోలో కారుతో పోల్చుకుంటే, ఈ లెజెండ్ ఎడిషన్ పోలో కారులో కంపెనీ కొన్ని అదనపు మార్పులు చేర్పులు చేసింది. మార్కెట్లో దీని ధర రూ.10.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ (Volkswagen Polo Legend Edition) విడుదల : ధర, ఫీచర్లు

ఫోక్స్‌వ్యాగన్ పోలో భారత మార్కెట్లోకి ప్రవేశించి దాదాపు 12 సంవత్సరాలు పూర్తయింది. అయితే, కంపెనీ ఇప్పుడు ఈ మోడల్ ను భారత మార్కెట్ నుండి తొలగించాలని చూస్తోంది. త్వరోలనే ఈ మోడల్ భారత మార్కెట్లో నిలిపివేయబడుతోంది, అయితే కంపెనీ ఈ కారును నిలిపివేయడానికి ముందే, పోలో యొక్క లెజెండ్ ఎడిషన్‌ ను విడుదల చేసింది. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ Polo GT TSI వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. పోలో లెజెండ్ ఎడిషన్ పరిమిత యూనిట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ (Volkswagen Polo Legend Edition) విడుదల : ధర, ఫీచర్లు

పోలో లెజెండ్ వేరియంట్ లో చేసిన మార్పుల విషయానికి వస్తే, కంపెనీ ఈ కారుపై లెజెండ్ బ్యాడ్జ్ ను దాని ఫెండర్ మరియు బూట్ పై జోడించింది. ఇది ఆకర్షణీయమైన సైడ్ బాడీ గ్రాఫిక్స్, బ్లాక్ ట్రంక్ గార్నిష్, బ్లాక్ రూఫ్ ఫాయిల్‌తో మరింత స్పోర్టీ లుక్‌ ని కలిగి ఉంటుంది. ఈ చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా, ఇందులో యాంత్రికంగా కానీ లేదా ఫీచర్ల పరంగా కానీ ఎలాంటి మార్పులు చేయలేదు. సింపుల్ గా చెప్పాలంటే, స్పెషల్ బ్యాడ్జ్ లు మరియు బాడీ గ్రాఫిక్స్ మినహా ఇది చూడటానికి స్టాండర్డ్ పోలో మాదిరిగానే ఉంటుంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ (Volkswagen Polo Legend Edition) విడుదల : ధర, ఫీచర్లు

భారత మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ పోలో రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 1.0 లీటర్, త్రీ సిలిండర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 76 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ ఎంట్రీ-లెవల్ ట్రెండ్‌లైన్ మరియు కంఫర్ట్‌లైన్ ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇకపోతే, రెండవది 1.0 లీటర్, 3 సిలిండర్ టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 110 బిహెచ్‌పి శక్తిని విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో లభిస్తుంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ (Volkswagen Polo Legend Edition) విడుదల : ధర, ఫీచర్లు

ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ లో కంపెనీ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ పోలో 5 వేర్వేరు రంగులలో అందుబాటులో ఉంది. అవి - ఫ్లాష్ రెడ్, సన్‌సెట్ రెడ్, క్యాండీ వైట్, కార్బన్ స్టీల్. ఈ లిమిటెడ్ ఎడిషన్ పోలో లెజెండ్ ఎడిషన్ కారులో Polo GT TSI వేరియంట్‌లో లభించే అన్ని ఫీచర్లు లభిస్తాయి.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ (Volkswagen Polo Legend Edition) విడుదల : ధర, ఫీచర్లు

ఫోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ ఇంజన్ ఆప్షన్ విషయానికి వస్తే, ఇది కేవలం 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది మరియు ఇందులోని TSI సాంకేతికత మరియు మైలేజ్‌ల మధ్య మంచి సమతుల్యతను సాధిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ లెజెండ్ ఎడిషన్ దేశవ్యాప్తంగా ఉన్న 151 డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ (Volkswagen Polo Legend Edition) విడుదల : ధర, ఫీచర్లు

ఫోక్స్‌వ్యాగన్ పోలో డిస్‌కంటిన్యూ కానుందా..?

ఫోక్స్‌వ్యాగన్ పోలో భారత మార్కెట్లోకి ప్రవేశించి 12 సంవత్సరాలు పూర్తయింది. కంపెనీ దీని ఉత్పత్తి 2009లో ప్రారంభించింది. పూణేలోని చాకన్ ప్లాంట్‌లో ఫోక్స్‌వ్యాగన్ ఈ కారును ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంట్ లో ఉత్పత్తి చేయబడిన మొదటి మోడల్ కూడా ఇదే. ఫోక్స్‌వ్యాగన్ పోలో అద్భుతమైన యూరోపియన్ డిజైన్ ను కలిగి ఉండి, మంచి పెర్ఫామెన్స్ కలిగిన ఇంజన్లతో ఓ ఫన్ టూ డ్రైవ్ కారుగా ఉండేది. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి స్విఫ్ట్ కి గట్టి పోటీ అందించింది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ (Volkswagen Polo Legend Edition) విడుదల : ధర, ఫీచర్లు

అద్భుతమైన సేఫ్టీ మరియు మంచి పనితీరుకు ప్రసిద్ధి చెందిన ఫోక్స్‌వ్యాగన్ పోలో భారతీయ కస్టమర్లలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే, తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఇప్పుడు ఈ పోలో కారును భారత మార్కెట్ నుండి తొలగించాలని చూస్తోంది. పోలో మార్కెట్ నుండి వెళ్లిపోతే, దాని స్థానంలో మరొక కొత్త మోడల్‌ను తీసుకువస్తారా లేదా అనే సమాచారాన్ని కంపెనీ ఇవ్వలేదు. ఫోక్స్‌వ్యాగన్ రాబోయే నెలల్లో అనేక మోడళ్లను జోడించడంతో పాటు తన భారతీయ లైనప్‌లో అనేక మార్పులు కూడా చేయనుంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ (Volkswagen Polo Legend Edition) విడుదల : ధర, ఫీచర్లు

ఫోక్స్‌వ్యాగన్ పోలో ఇప్పటికీ భారతీయ కస్టమర్లలో ప్రసిద్ధి చెందిన మోడల్ గా ఉంది మరియు దానికంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఈ నేపథ్యంలో, పోలో జనాదరణను ఉపయోగించుకోవడానికి, కంపెనీ దానిని MQB A0IN ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారు చేయబోయే ఒక మోడల్‌తో భర్తీ చేయవచ్చని తెలుస్తోంది. మూలాల ప్రకారం, కంపెనీ ఓ సరికొత్త ఏడవ తరం పోలోను భారత మార్కెట్‌కు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, మనదేశంలో సబ్ 4-మీటర్ కార్లపై ఉన్న పన్ను నిబంధనలను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ దానిలో అనేక మార్పులు చేసే అవకాశం ఉంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ (Volkswagen Polo Legend Edition) విడుదల : ధర, ఫీచర్లు

భారత మార్కెట్లో ఇప్పటివరకు 3 లక్షల యూనిట్లకు పైగా పోలో కార్లు విక్రయించబడ్డాయి మరియు ఇది ఈ జర్మన్ కార్ బ్రాండ్ నుండి అత్యంత సరసమైన మోడల్‌లలో ఒకటిగా నిలిచింది. భారతదేశంలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌ లను స్టాండర్డ్‌ పీచర్ గా అందించిన అతికొద్ది మోడళ్లలో ఫోక్స్‌వ్యాగన్ పోలో కూడా ఒకటి. ఈ కారు కోసం 2014 లో నిర్వహించిన గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఇది 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ‌ను కూడా దక్కించుకుంది మరియు ఇప్పటికీ దేశంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది.

Most Read Articles

English summary
Volkswagen india launches new polo legend edition price features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X