ఫోక్స్‌వ్యాగన్ మినీ వ్యాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్.. మరి లాంచ్ ఎప్పుడు..?

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) గతంలో విక్రయించిన ఐకానిక్ మినీ వ్యాన్ 'కోంబి' (Kombi) ని ఇప్పుడు అధునాతన రూపంలో మన ముందుకు తీసుకురాబోతోంది. 1990 కాలంలో పెద్ద ఫ్యామిలీ కారుగా బాగా ప్రాచుర్యం పొందిన ఈ కారును కంపెనీ 'ఫోక్స్‌వ్యాగన్ ఐడి.బజ్' (Volkswagen ID.Buzz) పేరుతో ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ గా విడుదల చేయనుంది. జర్మన్ కంపెనీ ఇప్పుడు ఈ మైక్రోబస్ లేదా కోంబి యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ (ఐడి.బజ్) ను ఈ సంవత్సరం మార్చి 9న ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది.

ఫోక్స్‌వ్యాగన్ మినీ వ్యాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్.. మరి లాంచ్ ఎప్పుడు..?

ఫోక్స్‌వ్యాగన్ తమ ఐడి బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుంది. ఇప్పుడు బ్రాండ్ చరిత్రలో మిగిలిపోయిన ఐకానిక్ కోంబి మినీ వ్యాన్ కు ఆధునిక రూపాన్ని అందించనుంది. ఈ ఆల్-ఎలక్ట్రిక్ మినీ వ్యాన్ ఓ చక్కటి ఫ్యామిలీ కార్ గా, బిజినెస్ వెహికల్ గా మరియు టాక్సీ వాహనంగా వివిధ అవసరాల కోసం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం, అభివృద్ధి దశలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వాహనం, ఉత్పత్తి దశకు చేరుకునేందుకు మరో ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ మినీ వ్యాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్.. మరి లాంచ్ ఎప్పుడు..?

ఫోక్స్‌వ్యాగన్ ఐడి.బజ్ ఎలక్ట్రిక్ వెహికల్ 2023 లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ మినీ వ్యాన్ ఆవిష్కరణ తేదీని ధృవీకరిస్తూ ఫోక్స్‌వ్యాగన్ సీఈఓ హెర్బర్ట్ డైస్ ట్వీట్ ప్రకారం.. "ది లెజెండ్ 03/09/22న తిరిగి వస్తుంది!" అని పేర్కొన్నారు. హెర్బర్ట్ డైస్ ఈ ట్వీట్‌ తో పాటుగా ID.Buzz మినీ వ్యాన్ ప్రొఫైల్ యొక్క స్కెచ్‌ ను కూడా పోస్ట్ చేశారు. ఈ ఫోక్స్‌వ్యాగన్ మినీ వ్యాన్ లేదా మైక్రోబస్ కంపెనీ ఆవిష్కరించబోయే ID.Buzz EV కాన్సెప్ట్‌ కు చాలా దగ్గరగా ఉంటుందని సమాచారం.

ఫోక్స్‌వ్యాగన్ మినీ వ్యాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్.. మరి లాంచ్ ఎప్పుడు..?

ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ కోసం కంపెనీ గతంలో కొన్ని పేర్లను కూడా ప్రతిపాదించింది. అయితే, వాటిని ఇప్పటి వరకూ ఉపయోగించలేదు. తాజాగా, ఇప్పుడు ఈ మూడు వరుసల మినీ వ్యాన్ కోసం ID.Buzz అనే పేరు తెరపైకి వచ్చింది. ఫోక్స్‌వ్యాగన్ ఐడి.బజ్ అనేది 1990 కాలం నాటి కోంబి మినీ వ్యాన్ యొక్క పునర్జన్మను గుర్తుకుతెస్తుంది. ఇది గతంలో కంపెనీ తిరిగి తీసుకువచ్చిన ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ పునర్జన్మతో సమానంగా చెప్పుకోవచ్చు. కాకపోతే, పాత వాటి కన్నా ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్ గా ఉంటాయి.

ఫోక్స్‌వ్యాగన్ మినీ వ్యాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్.. మరి లాంచ్ ఎప్పుడు..?

ప్రస్తుతానికి ఫోక్స్‌వ్యాగన్ ఐడి.బజ్ మినీ వ్యాన్ కి సంబంధించి వివరాలు వివరాలు పరిమితంగా ఉన్నాయి. అయితే, ఇందులో స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ మరియు లెవల్ 4 సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో పాటు కోర్ ఐకానిక్ డిజైన్‌తో మిళితమయ్యే ఇతర ఆధునిక అంశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ ఈ కారులో మూడు విభిన్న వేరియంట్‌లను తయారు చేయనున్నట్లు సమాచారం. వీటిలో ఒకటి వ్యక్తిగత కొనుగోలుదారుల కోసం, మరొకటి రైడ్-హెయిలింగ్ కోసం మరియు మూడవది కార్గో వేరియంట్‌గా కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ మినీ వ్యాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్.. మరి లాంచ్ ఎప్పుడు..?

ఫోక్స్‌వ్యాగన్ ఈ మినీ వ్యాన్ లో 3 వరుసల వెర్షన్‌తో పాటు, 2 వరుసల వెర్షన్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆంగ్ల గాయకుడు మరియు పాటల రచయిత ఎడ్ షీరన్ తన యూరోపియన్ సంగీత పర్యటన కోసం వోక్స్‌వ్యాగన్ క్యాంపర్‌వాన్‌లో వెళ్లడానికి ఇష్టపడతానని చెప్పిన కొద్ది రోజులకే ఈ సమాచారం వచ్చింది. ఈ ప్రముఖ గాయకుడితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతానని ఫోక్స్‌వ్యాగన్ గతంలో ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే, మార్చ్ నెల వరకూ ఆగాల్సిందే.

ఫోక్స్‌వ్యాగన్ మినీ వ్యాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్.. మరి లాంచ్ ఎప్పుడు..?

ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే.. ఈ కంపెనీ గత ఏడాది చివర్లో తమ అప్‌గ్రేడెడ్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ (New Volkswagen Tiguan) ప్రీమియం ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో కంపెనీ ఈ కొత్త కారును రూ. 31.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరతో విక్రయిస్తోంది. కొత్త 2022 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీ కేవలం ఒకే ఒక వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. కాకపోతే, ఈ ఒక్క వేరియంట్లోనే కంపెనీ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ మినీ వ్యాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్.. మరి లాంచ్ ఎప్పుడు..?

గత నెలలో బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ ఈ జనవరి నెల నుండి డెలివరీలను అందించనుంది. గతంలో 7-సీటర్ వేరియంట్ గా లభించిన టిగువాన్ ఇప్పుడు కేవలం 5-సీటర్ మోడల్‌గా మాత్రమే అందుబాటులో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గతంలో విక్రయించిన టిగువాన్ మోడల్ విదేశాలలో తయారు చేసేవారు. కాగా, ఈ కొత్త మోడల్ ను కంపెనీ ఇప్పుడు విడిభాగాలుగా ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడే స్థానికంగా అసెంబుల్ చేస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ మినీ వ్యాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్.. మరి లాంచ్ ఎప్పుడు..?

కొత్త 2022 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ కారులోని 2.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 187 బిహెచ్‌పి పవర్ ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది మరియు ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ యొక్క సిగ్నేచర్ ఆల్-వీల్ డ్రైవ్ (4MOTION) టెక్నాలజీతో లభిస్తుంది. ఈ కారు లీటరుకు 12.65 కి.మీ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Volkswagen to unveile kombi id buzz minivan electric vehicle on 9th march details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X