ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెలివిజన్ కమర్షియల్ చూశారా..? ఇందులో జిటి వెర్షన్ కూడా రాబోతోందా..?

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) ఇటీవలే భారత మార్కెట్లో ఆవిష్కరించిన తమ సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ వర్త్యుస్ (Virtus) కోసం ఓ కొత్త టెలివిజన్ కమర్షియల్ (TVC)ని విడుదల చేసింది. ఈ వీడియోలో ఫోక్స్‌వ్యాగన్ రెడ్ కలర్‌లో ఉన్న టాప్-ఎండ్ జిటి వేరియంట్‌ను చూపించింది. ఈ జిటి మోడల్ ముందు మరియు వెనుక వైపున ప్రత్యేకమైన GT బ్యాడ్జ్‌ను కలిగి ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటి వరకూ భారత మార్కెట్లో విక్రయించిన వెంటో సెడాన్ స్థాన్ని ఈ కొత్త వర్త్యుస్ భర్తీ చేయనుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెలివిజన్ కమర్షియల్ చూశారా..? ఇందులో జిటి వెర్షన్ కూడా రాబోతోందా..?

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీని తయారు చేసిన అదే MQB-A0 IN ప్లాట్‌ఫారమ్‌ పైనే ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్‌ను కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి, ఇది పరిమాణంలో పాత వెంటో సెడాన్ కంటే పెద్దదిగా ఉంటుంది. స్కోడా స్లావియా సెడాన్ కూడా ఇదే ప్లాట్‌ఫారమ్‌పై తయారైంది. ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్ స్టాండర్డ్ మరియు జిటి మోడళ్లలో లభ్యం కానుంది. జిటి మోడళ్లు డిజైన్ పరంగా స్టాండర్డ్ మోడళ్ల కన్నా స్పోర్టీగా ఉంటాయి. ఈ టివిసిని చూసినట్లయితే, ఇందులోని జిటి వేరియంట్ డాష్‌బోర్డ్‌లో స్పోర్టీ రెడ్ స్ట్రైప్స్‌‌ను కలిగి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెలివిజన్ కమర్షియల్ చూశారా..? ఇందులో జిటి వెర్షన్ కూడా రాబోతోందా..?

వర్త్యుస్ సెడాన్ తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు ఫోక్స్‌వ్యాగన్ తమ గ్రూప్‌లోని స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కుషాక్ వంటి ఇతర కార్లలో అందించిన ఫీచర్లను మరియు పరికరాలను ఈ కొత్త సెడాన్‌లోనూ ఉపయోగించనుంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ వైపర్‌లు, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్‌లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు ఆటో వైపర్స్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెలివిజన్ కమర్షియల్ చూశారా..? ఇందులో జిటి వెర్షన్ కూడా రాబోతోందా..?

సేఫ్టీ విషయానికి వస్తే, కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్, మల్టీ-కొలిషన్ బ్రేక్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఏబిఎస్ విత్ ఈబిడి, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన వాటితో పాటుగా మరికొన్ని అధునాతన సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెలివిజన్ కమర్షియల్ చూశారా..? ఇందులో జిటి వెర్షన్ కూడా రాబోతోందా..?

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ మొత్తం 6 కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. దీని డిజైన్‌ను గమనిస్తే, ముందు భాగంలో డ్యూయల్-స్లాట్ గ్రిల్‌తో , ఎల్ఈడి డిఆర్ఎల్ లతో కూడిన రెండు ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు, పెద్ద ఎయిర్ డ్యామ్, సైడ్ ప్రొఫైల్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు షార్క్ ఫిన్ యాంటెన్నా, క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన డోర్ హ్యాండిల్స్, బ్లాక్ సైడ్ మిర్రర్స్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్‌తో ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది 2,651 మిమీ పొడవైన వీల్‌బేస్‌తో 521 లీటర్ల పెద్ద బూట్ స్పేస్‌‌ను కలిగి ఉంటుంది.

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇది 1.0 లీటర్ మరియు 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యం కానుంది. ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 113 బిహెచ్‌పి శక్తిని మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇకపోతే, ఇందులోని రెండవ ఇంజన్ ఆప్షన్ అయిన 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెలివిజన్ కమర్షియల్ చూశారా..? ఇందులో జిటి వెర్షన్ కూడా రాబోతోందా..?

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్ ఉత్పత్తిలో కంపెనీ 95 శాతం స్థానికీకరణను పాటించనుంది. ఫలితంగా, వర్త్యుస్ సెడాన్ ధర కూడా అగ్రెసివ్ గా ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ ఈ కారును రెండు ట్రిమ్‌లలో వివిధ వేరియంట్లలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇందులో డైనమిక్ లైన్ మరియు జిటి లైన్ అనే ట్రిమ్స్ ఉంటాయని సమాచారం. ప్రస్తుతం, మార్కెట్లో స్కోడా స్లావియా ధరలు రూ. 10.69 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. దీన్నిబట్టి చూస్తే, స్లావియా ధర కన్నా వర్త్యుస్ ధర మరి కొన్ని వేల రూపాయాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Volkswagen virtus tvc out showcases gt variant details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X