మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

ప్రస్తుతం కార్లలో కనెక్టింగ్ టెక్నాలజీ అనేది చాలా సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ఒకప్పుడు హై-ఎండ్ లగ్జరీ కార్లకు మాత్రమే పరిమితమైన ఈ తరహా కార్ కనెక్టింగ్ టెక్నాలజీ ఇప్పుడు ఎంట్రీ లెవల్ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. కొన్ని రకాలలో కార్లలో ఇప్పుడు బిల్ట్-ఇన్ ఇంటర్నెట్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. యూజర్ స్మార్ట్‌ఫోన్ తో సంబంధం లేకుండా కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లోనే బిల్ట్ ఇన్ సిమ్ కార్డ్ మరియు 4జి/5జి ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నారు.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

అయితే, మితిమీరిన టెక్నాలజీతో ఎంత ఉపయోగం ఉందో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది. నిత్యం కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో భవిష్యత్తులో కార్లు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆటోమొబైల్ పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న కార్ కనెక్టింగ్ టెక్నాలజీతో ఇప్పుడు వాహనాలు శాటిలైట్‌తో అనుసంధానించబడి ఉంటున్నాయి మరియు అత్యవసర పరిస్థితుల్లో వాటివకే స్వంతంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

కార్లలో ఉండే ఎమర్జెన్సీ కాంటాక్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు అవి ఆటోమేటిక్ గా కారు యొక్క యజమానికి సంబంధించిన ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లతో పాటుగా ప్రభుత్వ అత్యవసర విభాగాలకు కూడా సందేశాలను పంపిస్తాయి. అలాగే, కారును ఎవరైనా దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు, సదరు ఆటోమేటిక్ గా గుర్తించి వాహన యజమానికి సెల్ ఫోన్ కి అలెర్ట్స్ కూడా పంపిస్తుంది. ఇదంతా టెక్నాలజీకి ఓవైపు మాత్రమే, ఇందులో మనం చూడని మరో కోణం కూడా ఉంది.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ను చూస్తుంటే, భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు మరియు పూర్తిగా అధునాతన మరియు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వంటి టెక్నాలజీలతో నడిచే వాహనాలు అందుబాటులోకి రానున్నాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి, ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో డ్రైవర్ అవసరం లేని ఆటోమేటిక్ కార్లు కూడా ఉపయోగించబడుతున్నాయి. ఇవన్నీ రాడార్, శాటిలైట్, లైవ్ మ్యాప్స్, 360 కెమెరాలు మరియు హై-సెన్సిటివిటీ సెన్సార్స్ వంటి వాటితో పాటుగా ఇంటర్నెట్ సాయంతో పనిచేస్తున్నాయి.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

అంతరించిపోతున్న శిలాజ ఇంధనాల నేపథ్యంలో, రాబోయే సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అనివార్యంగా మారబోతోంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను హై-టెక్ మెషీన్లుగా చెప్పుకోవచ్చు మరియు ఇవి వాటి పెట్రోల్/డీజిల్-ఆధారిత వాహనాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కనెక్టింగ్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. భారతదేశంలో కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ కనిపిస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ కార్లు మరియు టూవీలర్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొన్ని రకాల ఎలక్ట్రిక్ టూవీలర్లలో కూడా ఈ కనెక్టింగ్ టెక్నాలజీ కనిపిస్తుంది.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

భవిష్యత్తు కోసం కార్ల తయారీదారులు తమ కార్లు ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి, ట్రాఫిక్ కి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ పొందటానికి మరియు ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని ప్రసారం చేయడానికి అనుమతించే సాంకేతికతపై పని చేస్తున్నాయి. వీటితో పాటు అటానమస్ వాహనాలు (ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్స్) పై కూడా కంపెనీలు పనిచేస్తున్నాయి. స్వయంప్రతిపత్త సాంకేతికతపై (సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ)పై పనిచేస్తున్న అంతర్జాతీయ బ్రాండ్‌ల సంఖ్యను లెక్కించడం ఇప్పుడు కష్టమైన విషయమే. అంటే, ఎంత మంది ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తుంటే, భవిష్యత్తులో ఆటోమొబైల్ పరిశ్రమను కనెక్టింగ్ టెక్నాలజీ ఎంతా శాసించబోతోందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఈ మార్పుకు మద్దతు ఇవ్వడానికి అవసరమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్ చాలా అవసరం. వాస్తవానికి, వాహనం చలనంలో లేనప్పుడు మరియు చలనంలో ఉన్నప్పుడు ఇంటర్నెట్ సేవల పనితీరు ఒక్కోలా ఉంటుంది. మరి భవిష్యత్తులో ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు మేము DE-CIX ఇండియా డైరెక్టర్ సుధీర్ కుందర్‌తో మాట్లాడాము.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

వాహనాలలో కనెక్ట్ చేయబడిన సాంకేతికతకు అవసరమైన బ్యాక్-ఎండ్ ఇంటర్నెట్ మద్దతు గురించి మరియు ఇంటర్నెట్ ప్రొవైడర్లు దీన్ని ఎలా నిర్వహిస్తారు అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, మేము DE-CIX ఇండియా డైరెక్టర్ సుధీర్ కుందర్‌తో చర్చించాము. DE-CIX అనేది ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్ ఎక్స్ఛేంజీలలో ఒకటి. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉన్న దాని ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ పాయింట్ (IXP) ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ ఎక్స్ఛేంజ్ పాయింట్.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

ఇంటర్నెట్ కనెక్టివిటీ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, కమ్యూనికేషన్‌ వ్యవస్థను సులభతరం చేయడానికి భౌతిక మరియు డిజిటల్ బహుళ ఎంటిటీలను లింక్ చేసే వ్యవస్థనే ఇంటర్నెట్ అంటారు. వాహనం నుండి వాహనానికి, వాహనం నుండి క్లౌడ్‌కు లేదా అంతర్గతంగా కనెక్ట్ అయ్యే వాహన వ్యవస్థలకు సజావుగా కమ్యూనికేట్ చేయడానికి కనెక్ట్ చేయబడిన కార్లకు కూడా ఇది వర్తిస్తుంది.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

అంతేకాకుండా, ఇది ప్రమాదాలను నివారించడానికి, లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం, వినియోగదారు గమ్యస్థానానికి ETA (ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్)ని లెక్కించడానికి, మీరు ఇంటికి చేరుకోవడానికి 5 నిమిషాల ముందు మీ కారులో ఎయిర్ కండిషనింగ్ లేదా హీటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించేలా చేయడానికి లేదా అన్‌లాక్ చేయబడిన తలుపు గురించి మీకు తెలియజేయడాని ఇలా అనేక సౌకర్యాల కోసం ఈ సాంకేతిక ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ అనేది ఇప్పుడు మనుషులను యంత్రాలను కలిపే ఓ ప్రధానమైన సాధనంగా మారిపోయింది.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

భారతదేశంపై ఇంటర్నెట్ కనెక్టడ్ కార్లు ఎలాంటి ప్రభావాన్ని తీసుకురానున్నాయి?

మనదేశంలో కనెక్ట్ చేయబడిన కార్లు ఇప్పటికే చాలా వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయి మరియు రాబోయే సంవత్సరాలలో వీటికి డిమాండ్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలోని కార్ కంపెనీలు తమ వాహనాలలో ఇంటర్నెట్ ఆధారిత కనెక్టింగ్ టెక్నాలజీని అందించేందుకు ఇప్పడికే Google యొక్క Android Auto లేదా Apple యొక్క CarPlay కనెక్టింగ్ టెక్నాలజీలపై ఆధారపడి ఉన్నాయి. మరికొన్ని సంస్థలు అయితే, తామే స్వయంగా కనెక్టింగ్ టెక్నాలజీని కూడా తయారు చేస్తున్నాయి.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

ఈ విషయంలో థర్డ్ పార్టీ సేవలపై ఆధారపడటం అనేది అనిశ్చితిని మరియు అంతిమ వినియోగదారుకు తరచుగా జాప్యం మరియు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కారు దొంగతనాలను అరికట్టేందుకు ఇప్పుడు వాహనాలలో జియో ఫెన్సింగ్, లైవ్ లొకేషన్ వంటి జిపిఎస్ ఆధారిత సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇలాంటివి ఆప్షనల్‌గా మాత్రమే లభిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సేవలు ప్రతి కారులో స్టాండర్డ్ ఫీచర్‌గా లభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఫీచర్ వలన కారు దొంగిలించబడినప్పుడు దాని స్థానాన్ని తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

DE-CIX అనేది ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్, మరి ఇది కనెక్ట్ చేయబడిన కారుకి ఎలా సహాయపడుతుంది?

ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం కారులోని డేటా ఫ్లోను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో దాదాపు 70 శాతం డేటా అసలైనది కాదు, అంటే దీని అర్థం ఏమిటంటే, ఈ డేటా వినియోగదారు అనుభవంపై గణనీయమైన ప్రభావాన్ని చూపదు. ఇందులో ఎక్కువ భాగం కారులోకి ప్రవహించే డేటా. ఇక మిగిలిన 30 శాతం డేటాను మూడు కీలకమైన విభాగాలుగా వర్గీకరించవచ్చు. ఇందులో 20 శాతం కార్ టు క్లౌడ్ కమ్యూనికేషన్, 5 శాతం కార్ టు కార్ కమ్యూనికేషన్ మరియు మిగిలిన 5 శాతం కార్ టు ఎన్విరాన్‌మెంట్ కమ్యూనికేషన్.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

కార్-టు-ఎన్విరాన్‌మెంట్ కమ్యూనికేషన్ అనేది వీధులు, క్రాస్‌రోడ్‌లు లేదా సిగ్నల్‌లలోని ఇతర సెన్సార్‌లు చుట్టుపక్కల ఉన్న ఎంటిటీలతో కమ్యూనికేట్ చేసే కారు సెన్సార్‌లు లేదా మరొక వాహనం సురక్షితమైన దూరానికి మించి చాలా దగ్గరగా ఉన్నట్లు గుర్తించడం. కాబట్టి, ఈ 30 సాతం డేటా రియల్ టైమ్ మరియు అవసరమైన కార్యాచరణలకు చాలా కీలకమైనది. మరి ఈ డేటాను పొందాలంటే, అప్లికేషన్ యొక్క మూలం మరియు కారు మధ్య అత్యుత్తమ కనెక్టివిటీ ఎంతో అవసరం.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

ఇక్కడే ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ అనేది కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే, అవుట్‌బౌండ్ నెట్‌వర్క్ మధ్య ప్రత్యక్ష కనెక్షన్‌ను అందించడం ద్వారా ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ సాధ్యమైనంత తక్కువ జాప్యాన్ని సులభతరం చేస్తుంది, అంటే నెట్‌వర్క్ వినియోగదారుకు ట్రాఫిక్‌ను పంపిణీ చేస్తుంది, ఈ సందర్భంలో ఇతర సంస్థలపై ఆధారపడటాన్ని తొలగిస్తుంది. DE-CIX వంటి ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ కంపెనీలు మాత్రమే ఇలాంటి ఆకస్మిక పరిస్థితులను తగ్గించగలవు.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

భారతదేశంలోని అన్ని కార్లను కనెక్ట్ చేయబడిన వాహనాలుగా మార్చడం సాధ్యమేనా? అవును అయితే, సవాళ్లు ఏమిటి?

మనదేశంలో ఆఫ్టర్ కార్ మార్కెట్‌లో ఇప్పటికే అనేక రకాల తాత్కాలిక అనుకూలీకరణలు (టెంపరరీ కస్టమైజేషన్స్) అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, ఏదైనా కారును కావలసిన ఫీచర్‌తో లోడ్ చేయవచ్చు మరియు దానిని కనెక్టెడ్ కారుగా మార్చవచ్చు. అయితే, ధర మరియు పనితీరు వంటి అంశాల పరంగా, కనెక్ట్ చేయబడిన కార్లు లేదా ఇంటర్నెట్ కార్లను వెతకడం అనేది తయారీదారులు మరియు వినియోగదారుల యొక్క ఉత్తమ ఆసక్తిని బట్టి ఉంటుంది. ఇది మెరుగైన నాణ్యతకు హామీ ఇవ్వడమే కాకుండా, అనుకూలత మరియు సాంకేతిక మద్దతు సమస్యలను తొలగించడంలో దీర్ఘకాలంలో తక్కువ ఖర్చు అవుతుంది.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

అంతేకాకుండా, కస్టమర్‌లకు అన్ని రకాల సేవలను ఒకే గొడుగు క్రింద అందించడంలో కూడా కార్ల తయారీదారులు ఆసక్తిగా ఉన్నారు. ఉదాహరణకు, మెర్సిడెస్-బెంజ్ తమ కార్లలో "హలో సిరి" అని వినడానికి బదులుగా "హలో మెర్సిడెస్" అని వినాలని అనుకుంటన్నట్లు Mercedes-Benz CEO చెప్పారు. కనెక్ట్ చేయబడిన కారు యొక్క ఇంటిగ్రేషన్‌ను కలిగి ఉండటం వారికి ఎంత ముఖ్యమో ఇది సూచిస్తుంది.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

కనెక్ట్ చేయబడిన కార్లలో ప్రైవసీ మరియు సేఫ్టీ ఉంటుందా? లేకపోతే ఎలా?

ప్రస్తుతం, ఈ రెండు పదాలు కార్ల తయారీ కంపెనీలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. నిజానికి ఇది చాలా పెద్ద సమస్య మరియు ఇది ఒకటి కంటే ఎక్కువ రూపాలను కూడా కలిగి ఉంటుంది. వీటిలో డ్రైవర్ గుర్తింపు (డ్రైవర్ ఐడెంటిటీ) దొంగిలించబడటం, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లతో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం వంటి విషయాలు ఆందోళన కలిగిస్తాయి. కార్లను హ్యాక్ చేయటం, తద్వారా ఆటోమేటిక్ గా వాటిని మరియు వాటిలోని కొన్ని రకాల ఫీచర్లను కంట్రోల్ చేయటం లేదా కస్టమర్ డేటాను దొంగిలించడం వంటి ప్రమాదాలు కూడా లేకపోలేదు.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

అయితే, ఇక్కడ లైవ్ కనెక్షన్ యొక్క ప్రయోజనాలతో, DE-CIX-వంటి ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ సంస్థలు ఇప్పటికే అవాంఛిత మార్గాల్లోకి డేటా ప్రయాణించే (డేటా బ్రీచ్) ప్రమాదాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నాయి. నోడ్ ల సంఖ్యను తగ్గించడం ద్వారా ఈ డేటాతో అవాంఛిత ఎంటిటీలు వచ్చే అవకాశాలను తాము ఇప్పటికే తగ్గించామని, అంతేకాకుండా, మరింత సురక్షితమైన విశ్వసనీయ సంస్థల కోసం మాత్రమే క్లోజ్డ్ నెట్‌వర్క్‌లను సృష్టించే అవకాశాన్ని అందిస్తున్నామని DE-CIX తెలిపింది.

మితిమీరిన టెక్నాలజీ వలన కార్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందా..?

కనెక్టింగ్ కార్లు సర్వసాధారణంగా మారడం మీరు ఎంత ఎలా చూస్తారు?

కనెక్టిగ్ టెక్నాలజీతో కూడిన కార్లు ఇప్పటికే సాధారణంగా మారాయి మరియు అవి కాలక్రమేణా మరింత ఆసక్తికరంగా ఉండబోతాయనేది వాస్తవం. తయారీదారులు కనెక్ట్ చేయబడిన కార్లు మరియు దానికి సంబంధించిన అన్ని సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు. అదే సమయంలో, కనెక్ట్ చేయబడిన వాహనాల పెరుగుదలకు మద్దతు ఇవ్వడానికి ఇంటర్నెట్ వేగం మరియు దానికి అవసరమైన కనెక్టివిటీ కూడా ముందుకు సాగాలి. దీనిని ముందుకు తీసుకువెళ్లడానికి ఇది వరకు చెప్పినట్లుగా ఇంటర్నెట్ ఎక్స్ఛేంజీలు ప్రధాన మార్గంగా ఉంటాయి.

Most Read Articles

English summary
What is the future of connected cars in india face to face interview with de cix india director
Story first published: Saturday, January 29, 2022, 12:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X