రూ. 5.69 లక్షలకే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్.. బుకింగ్స్ కూడా మొదలైపోయాయ్

దేశీయ విఫణిలో హ్యుందాయ్ కంపెనీ కొత్త 'గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్' విడుదల చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధరలు రూ. 5.69 లక్షలు. కంపెనీ ఈ హ్యాచ్‌బ్యాక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ కోసం రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ మొత్తం నాలుగు ట్రిమ్స్ లో లభిస్తుంది. అవి ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్ మరియు ఆస్టా. ఇవన్నీ కూడా పోలార్ వైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, టీల్ బ్లూ మరియు ఫైరీ రెడ్ కలర్ ఆప్షన్‌లతో పాటు కొత్త స్పార్క్ గ్రీన్ అనే కలర్ ఆప్సన్ లో లభిస్తాయి.

రూ. 5.69 లక్షలకే గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్

కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు కొత్త బంపర్ కలిగి బ్లాక్ గ్రిల్‌ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ట్రై యారో షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్ మరియు సైడ్ ఇన్‌టేక్‌ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ కలిగి వెనుక వైపు లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడిన కొత్త LED టెయిల్ లైట్స్ చూడవచ్చు.

ఇంటీరియర్ విషయానికి వస్తే, కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క క్యాబిన్ లేఅవుట్ దాదాపు మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ, సీట్లు కొత్త గ్రే అపోల్స్ట్రే కలిగి ఉండటమే కాకుండా, రివైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఫుట్‌వెల్ లైటింగ్ వంటివి ఉన్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేసే 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది.

రూ. 5.69 లక్షలకే గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్

అంతే కాకుండా ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్‌, రియర్ ఏసీ వెంట్స్ వంటివి కూడా స్టాండర్డ్ గా లభిస్తాయి. అయితే టాప్ స్పెక్ వేరియంట్స్ లో టైప్ సి USB పోర్ట్‌లు, క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి కొత్త ఫీచర్‌లను కూడా పొందుతాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కొత్త ఫేస్‌లిఫ్టెడ్ గ్రాండ్ ఐ10 నియోస్ డిజైన్ మరియు ఫీచర్స్ కొంత మార్పుకు లోనైనప్పటికీ యాంత్రికంగా ఎటువంటి మార్పులు జరగలేదు. కావున ఇందులో అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ 83 హెచ్‌పి పవర్ మరియు 113.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులోని CNG వెర్షన్ 69 హెచ్‌పి మరియు 95.2 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.

రూ. 5.69 లక్షలకే గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్

గ్రాండ్ ఐ10 నియోస్ CNG వెర్షన్ కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక లీటరుకు 20.7 కిమీ మైలేజ్ అందించగా, ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తో జాతఃచేయబడిన వేరియంట్ లీటరుకు 20.1 కిమీ మైలేజ్ అందిస్తుంది. అయితే CNG వెర్షన్ మాత్రం ఒక కేజీ CNG తో ఏకంగా 27.3 కిమీ మైలేజ్ అందిస్తుంది.

ఇక చివరగా ఫేస్‌లిఫ్టెడ్ గ్రాండ్ i10 నియోస్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో నాలుగు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి వంటి వాటిని స్టాండర్డ్ గా పొందుతుంది. అయితే టాప్ స్పెక్ వెర్షన్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఐసోఫిక్స్ ఎంకరేజ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

Most Read Articles

English summary
2023 hyundai grand i10 nios launched price features details in telugu
Story first published: Friday, January 20, 2023, 13:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X