ఆటో ఎక్స్‌పో 2023: Fronx ఎస్‌యువి ఆవిష్కరించిన మారుతి సుజుకి.. బుకింగ్స్ కూడా మొదలయ్యాయ్

మారుతి సుజుకి 2023 ఆటో ఎక్స్‌పోలో 'మారుతి ఫ్రాంక్స్' (Maruti Fronx) అనే కొత్త SUV ఆవిష్కరించింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ కొత్త SUV ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి బాలెనొ ఆధారంగా రూపోంచించినట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త 'మారుతి ఫ్రాంక్స్' (Maruti Fronx) కోసం కంపెనీ ఈ రోజు నుంచే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ SUV ఈ సంవత్సరం మార్చి నాటికి దేశీయ మార్కెట్లో మారుతి నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది. ఇది దేశీయ మార్కెట్లో సిట్రోయెన్ సి3, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కిగర్ వంటి కాంపాక్ట్ SUV లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Fronx ఎస్‌యువి ఆవిష్కరించిన మారుతి సుజుకి

మారుతి ఫ్రాంక్స్ SUV అనేది కంపెనీ యొక్క మొట్టమొదటి కాంపాక్ట్ SUV కూపే అవుతుంది. ఇది చూడటానికి గ్రాండ్ విటారా మాదిరిగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే గ్రాండ్ విటారా మాదిరిగానే ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ చూడవచ్చు. ముందు మరియు వెనుక బంప్‌లు కూడా కొత్తవి మరియు రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌లు మరియు క్రోమ్ వంటివి ఉన్నాయి. వెనుక వైపు వెడల్పు అంతటా విస్తరించి ఉండే లైట్ బార్ కూడా ఉంటుంది.

సైడ్ ప్రొఫైల్ లో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ లేటెస్ట్ SUV పొడవు 3995 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తమ్ మీద ఈ SUV చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి ఉంటుంది. కావున 'మారుతి ఫ్రాంక్స్' (Maruti Fronx) SUV తప్పకుండా దేశీయ మార్కెట్లో వాహన ప్రియులను ఆకర్శించడంలో విజయం పొందుతుందని ఆశిస్తున్నాము.

Fronx ఎస్‌యువి ఆవిష్కరించిన మారుతి సుజుకి

మారుతి ఫ్రాంక్స్ SUV ప్రీమియం డ్యూయల్-టోన్ ఇంటీరియర్ పొందుతుంది. ఇందులో 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు కంపెనీ యొక్క ఇన్-బిల్ట్ సుజుకి కనెక్ట్ సూట్ ద్వారా 40+ కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్‌లు ఇందులో లభిస్తాయి. అంతే కాకుండా AC వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి.

మారుతి ఫ్రాంక్స్ SUV లో బిఎస్6 ఉద్గార నిబంధనల అమలు కారణంగా నిలిపివేయబడిన టర్బోచార్జ్డ్ 1.0 లీటర్ బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 2017 లో బాలెనోలో ఉండేది. అయితే ఆ తరువాత బిఎస్6 ఉద్గార ప్రమాణాల కారణంగా నిలిపివేయబడింది. అయితే ఈ ఇంజిన్ 98.6 bhp పవర్ మరియు 147.6 Nm టార్క్‌ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడుతుంది.

Fronx ఎస్‌యువి ఆవిష్కరించిన మారుతి సుజుకి

మారుతి ఫ్రాంక్స్ SUV లో టర్బోచార్జ్డ్ 1.0 లీటర్ బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజిన్ కాకుండా, మారుతి 1.2-లీటర్ K-సిరీస్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ కూడా పొందుతుంది. ఇది 90 hp పవర్ మరియు 130 Nm టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ రెండు ఇంజిన్లు మంచి పనితీరుని అందించే విధంగా రూపొందించబడి ఉంటాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ మొత్తం ఐదు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అవి గ్రాండియర్ గ్రే, ఆర్కిటిక్ వైట్, ఎర్టెన్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్ మరియు స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్. మారుతి సుజుకి విడుదల చేయనున్న కొత్త ఫ్రాంక్స్ SUV ధరలు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు, కంపెనీ ఈ ధరను త్వరలోనే వెల్లడించనుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Auto expo 2023 maruti suzuki fronx suv revealed design features and details
Story first published: Thursday, January 12, 2023, 11:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X