ఇవి తెలుసుకోకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయకండి.. తప్పకుండా తెలుసుకోవలసిన అంశాలు

ఆధునిక కాలంలో పెట్రోల్ మరియు డీజిలు వాహనాలకంటే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగటానికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే వినియోగదారులు తప్పకుండా కొన్ని అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఎలక్ట్రిక్ వెహికల్ కొనటానికి ముందుకు వినియోగదారుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలను గురించి మనం ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇవి తెలుసుకోకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయకండి

డ్రైవింగ్ రేంజ్ (పరిధి):

నిజానికి పెట్రోల్ మరియు డీజిల్ కార్లను కొనే ఎక్కవ మంది వినియోగదారులు కూడా తప్పకుండా మైలేజ్ గురించి ఆలోచించి కొనుగోలు చేస్తూ ఉంటారనే అందరికి తెలిసిన విషయమే. ఇది ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా వర్తిస్తుంది. కావున ఎక్కువ రేంజ్ (పరిధి) అందించే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుదారులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

ఇవి తెలుసుకోకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయకండి

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఒక ఛార్జ్ కి 100 కిమీ నుంచి 200 కిమీ రేంజ్ అందించే వాహనాలున్నాయి, అలాగే ఒక ఛార్జ్ తో 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే వాహనాలు ఉన్నాయి. ఇది కూడా కొనుగోలు చేయదగిన బడ్జెట్ మీద ఆధారపడి ఉంటాయి. కావున ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకువారు తప్పకుండా రేంజ్ తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇవి తెలుసుకోకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయకండి

నిర్వహణ ఖర్చు:

సాధారణ పెట్రోల్ మరియు డీజిల్ కార్లకంటే ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. అయితే ఈ నిర్వహణ ఖర్చు ఎంత ఉంటుంది అనేది కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశం. ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ IC ఇంజిన్ వాహనాల కంటే తక్కువ. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాల చర్యలో చాలా తక్కువ మెకానికల్ పార్ట్స్ ఉంటాయి. ఇది నిర్వహణ ఖర్చుని తగ్గిస్తుంది.

ఇవి తెలుసుకోకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయకండి

బ్యాటరీ వారంటీ:

ఎలక్ట్రిక్ వాహనాలలో కంపెనీలు చాలా వరకు శక్తివంతమైన బ్యాటరీలను నిక్షిప్తం చేసి ఉంటాయి. అయినప్పటికీ వాతావరణ పరిస్థితుల కారణంగా ఏదైనా లోపం వచ్చే అవకాశం ఉంటుంది. కావున కంపెనీలు బ్యాటరీ వారంటీని అందిస్తాయి. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇవి తెలుసుకోకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయకండి

దేశీయ మార్కెట్లో ఉన్న చాలా బ్రాండ్‌లు తమ EV యొక్క బ్యాటరీపై ఎనిమిది సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిమీల వారంటీని అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇంకా ఎక్కువ వారంటీ కూడా అందించే అవకాశం ఉంటుంది. కావున వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఈ వారంటీ మరియు ఇతరత్రా వివరాలను గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇవి తెలుసుకోకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయకండి

కొనుగోలు చేసిన తరువాత సర్వీస్:

ఏ వాహనానికైనా తప్పని సరిగా సర్వీస్ అనేది చాలా అవసరం. కావున కొనుగోలు చేసిన తరువాత వాహనాలకు కావాల్సిన సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అయితే ప్రస్తుతం ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాల్లో సర్వీస్ సెంటర్‌ల లొకేషన్ మరియు మీరు వీటిని యాక్సెస్ చేసే సౌలభ్యాన్ని అందించడం జరిగింది. కావున కొనుగోలుదారులు ఈ సర్వీస్ సెంటర్లను గురించి కూడా తెలుసుకోవచ్చు.

ఇవి తెలుసుకోకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయకండి

ఛార్జింగ్ సౌలభ్యం:

భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటలులో లేదు. ఇది అమ్మకాల మీద కొంత ప్రభావం చూపుతుంది. అయితే ప్రస్తుతం దేశంలో అక్కడక్కడా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా రానున్న రోజుల్లో ఇలాంటి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ సదుపాయాలు మరిన్ని అందుబాటులోకి వస్తాయి.

ఇవి తెలుసుకోకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయకండి

బ్రాండ్:

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎన్నోన్నో కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నప్పటికీ టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే టాటా ఎలక్ట్రిక్ వాహనాలకంటే కూడా ఎక్కువ రేంజ్ అందించే కియా ఈవి6 వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. కావున ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే కొనుగోలుదారుడు తానూ ఎంచుకునే బ్రాండ్ గురించి కూడా ఆరా తీయాలి మరియు తెలుసుకోవాలి.

ఇవి తెలుసుకోకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయకండి

లగ్జరీ ఫీచర్లు:

నేడు చాలా కంపెనీలు తమ వాహనాల్లో ఆధునిక లగ్జరీ ఫీచర్స్ అందిస్తున్నాయి. అయితే ఈ లగ్జరీ ఫీచర్స్ అనేవి తప్పకుండా ధర మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ధర కలిగిన వాహనాల్లో కొన్ని ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, కొంత తక్కువ ధర వద్ద కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ కార్లలో కొన్ని తక్కువ ఫీచస్సార్ ఉంటాయి. కావున కొనుగోలుదారుడు తనకు ఎక్కువ లగ్జరీ ఫీచర్స్ కావాలనుకున్నప్పుడు కొంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది.

ఇవి తెలుసుకోకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయకండి

ధర:

మార్కెట్లో ప్రస్తుతం రూ. 8.49 లక్షల (టాటా టియాగో ఈవీ ప్రారంభ ధర) నుంచి రూ. 64.95 లక్షలు (కియా ఈవి6 జిటి లైన్ ఎడబ్ల్యుడి) అంతకంటే ఎక్కువ ధర వద్ద కూడా అందుబాటులో ఉన్నాయి. కావున కొనుగోలుదారుడు తమకు నచ్చిన ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉన్న ధర వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మీద సబ్సిడీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుని కొనుగోలు చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Before buying an electric car definitely know these important things
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X