2022 లో అత్యధికంగా అమ్ముడైన SUV లు, ఇవే - వివరాలు

2022 అనేక ఒడిదుడుకులతో ముగిసిపోయింది. అయితే 2022 భారతీయ ఆటో మొబైల్ మార్కెట్ మాత్రం కొంత అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో గత సంవత్సరం (2022) మంచి అమ్మకాలు పొందిన టాప్ 5 ఎస్‌యువిలను గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

టాటా నెక్సాన్ (Tata Nexon):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ మన జాబితాలో ఎక్కువ అమ్మకాలు పొందిన SUV. ఇది గత సంవత్సరం పొందిన అమ్మకాలలో అగ్రస్థానం పొందింది. అమ్మకాలలో అత్యంత ప్రజాదరణ పొందటానికి ప్రధాన కారణం ఇది పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్ లో అందుబాటులో ఉండటమే అని తెలుస్తుంది. కంపెనీ ఈ టాటా నెక్సాన్ SUV ని రానున్న రోజుల్లో CNG వేరియంట్ లో అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా చేస్తోంది.

2022 లో అత్యధికంగా అమ్ముడైన SUV లు, ఇవే

టాటా మోటార్స్ గత సంవత్సరం నవంబర్ నెల వరకు ఏకంగా 1.56 లక్షల యూనిట్లకు పైగా నెక్సాన్ కార్లను విక్రయించింది. కంపెనీ ప్రతి ఎలా 14,000 కంటే ఎక్కువ యూనిట్లను విజయవంతంగా విక్రయించగలిగింది. టాటా నెక్సాన్ కార్లు ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందటమే కాకుండా.. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. ఇవన్నీ కూడా నెక్సాన్ యొక్క అమ్మకాలను పెంచడంలో సహాయపడ్డాయి.

హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta):

అత్యంత ప్రజాదరణ పొందిన SUV లలో ఒకటి 'హ్యుందాయ్' కంపెనీ యొక్క 'క్రెటా'. దేశీయ మార్కెట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మరియు మారుతి గ్రాండ్ విటారా వంటి వాటికి ప్రత్యర్థిగా నిలబడి కూడా మంచి అమ్మకాలు పొందటంలో విజయం పొందింది. కంపెనీ గత ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 1,30,690 యూనిట్ల క్రెటా SUV ను విక్రయించింది. అంటే దీన్ని బట్టి కంపెనీ ప్రతి నెల 12,000 యూనిట్లను విక్రయించినట్లు తెలుస్తోంది.

2022 లో అత్యధికంగా అమ్ముడైన SUV లు, ఇవే

టాటా పంచ్ (Tata Punch):

టాటా మోటార్స్ యొక్క మైక్రో SUV గత సంవత్సరం మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలు పొందుతోంది. 2021 చివరిలో దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటికి 2022 లో జనవరి నుంచి నవంబర్ వరకు ఇది 1.19 లక్షల అమ్మకాలను పొందింది. టాటా పంచ్ గత నెలలో (నవంబర్) 12,131 యూనిట్లను విక్రయించగలిగింది. కంపెనీ యొక్క ఈ మైక్రో SUV మంచి అమ్మకాలు పొందటానికి ప్రధాన కారణం ఇది సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందటం కూడా.

మారుతి బ్రెజ్జా (Maruti Brezza):

మారుతి సుజకి కార్లకు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మారుతి సుజుకి దేశీయ విఫణిలో గత సంవత్సరం 1.19 లక్షల యూనిట్లను విక్రయించగలిగింది. గత నెలలో కంపెనీ 11,324 యూనిట్లను విక్రయించింది. ఇది దేశీయ మార్కెట్లో తన ప్రత్యర్థిగా హ్యుందాయ్ క్రేటకు గట్టి పోటీని అందిస్తూ ఈ అమ్మకాలను పొందింది. మారుతి బ్రెజ్జా ఈ సంవత్సరం కూడా తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది.

2022 లో అత్యధికంగా అమ్ముడైన SUV లు, ఇవే

హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue):

హ్యుందాయ్ కంపెనీ యొక్క 'వెన్యూ' సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో కస్టమర్లకు చాలా ఇష్టమైన కారు. ఇది మంచి డిజైఆం కలిగి అదునైక ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల అద్భుతమైన అమ్మకాలు పొందగలిగి 2022 లో అత్యధిక అమ్మకాలు పొందిన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. హ్యుందాయ్ వెన్యూ గత సంవత్సరం 1.12 లక్షల SUV లను విక్రయించగలిగింది. అంటే కంపెనీ ప్రతి నెల కనీసం 10,000 యూనిట్లను విక్రయించగలిగింది.

కంపెనీ 2022 చివరలో కూడా అనేక ఆధునిక మోడల్స్ విడుదల చేసింది. ఇవన్నీ కూడా ప్రస్తుతం కాలంలో వినియోగించదగిన ADAS వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉన్నాయి. ఈ ఫీచర్స్ కలిగి ఉన్న కారణంగా ఈ కొత్త సంవత్సరం మరియు రానున్న సంక్రాంతి పండుగల సందర్భంగా మంచి అమ్మకాలు పొందుతాయి. అంతే కాకుండా మరో కొన్ని రోజుల్లో జరుగనున్న 2023 ఆటో ఎక్స్‌పోలో కూడా అనేక కొత్త వాహనాలు అరంగేట్రం చేయనున్నాయి.

Most Read Articles

English summary
Best selling suv in india in 2022 nexon venue and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X