మరో లగ్జరీ కార్ విడుదల చేసిన BMW.. ధర రూ. 1.22 కోట్లు

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ఈ ఏడాది ప్రారంభం నుంచి భారతదేశంలో విరివిగా తమ బ్రాండ్ కార్లను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు దేశీయ మార్కెట్లో మరో లేటెస్ట్ మోడల్ విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

BMW కంపెనీ ఈ రోజు దేశీయ విఫన్ విడుదల చేసిన కారు ఫేస్‌లిఫ్టెడ్ X7. ఇది రెండు వేరియంట్స్ లో పెట్రోల్ (xDrive40i) మరియు డీజిల్ (xDrive40d) మోడల్స్ లో లభిస్తుంది. వీటి ధరలు రూ. 1.22 కోట్లు (xDrive40i పెట్రోల్) మరియు రూ. 1.25 కోట్లు (xDrive40d డీజిల్). కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది, కావున ఈ రోజు నుండి BMW డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మార్చి 2023 నుండి ప్రారంభమవుతాయి.

మరో లగ్జరీ కార్ విడుదల చేసిన BMW

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త మోడల్ స్థానికంగా ఉన్న చెన్నై ప్లాంట్ లో ఉత్పత్తి చేయబడతాయి. ఇవి రెండూ కూడా మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతాయి. ఈ ఫేస్‌లిఫ్టెడ్ X7 ఇప్పుడు స్ప్లిట్ LED హెడ్‌లైట్ సెటప్, పెద్ద కిడ్నీ గ్రిల్, బోనెట్ లైన్ దగ్గర LED DRLలు, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లపై సిల్వర్ ట్రిమ్, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు LED టెయిల్ లైట్స్ వంటి వాటిని పొందుతుంది.

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు లేటెస్ట్ iDrive 8 సాఫ్ట్‌వేర్‌ కలిగిన 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా స్లిమ్ ఎయిర్ వెంట్స్ మరియు కొత్త సెలెక్టర్ లివర్‌తో రీవర్క్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, యాంబియంట్ లైట్ బార్, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు అప్‌డేటెడ్ ADAS టెక్నాలజీ వంటివి ఉన్నాయి.

మరో లగ్జరీ కార్ విడుదల చేసిన BMW

కొత్త BMW X7 ఫేస్‌లిఫ్ట్ యొక్క xDrive40i మరియు xDrive40d రెండూ కూడా వరుసగా 3.0 లీటర్, ఇన్‌లైన్ సిక్స్ సిలిండర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లను పొందుతాయి. పెట్రోల్ ఇంజిన్ 381 hp పవర్ మరియు 520 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తం మీద పెట్రోల్ ఇంజిన్ ఉత్తమమైన పనితీరుని అందిస్తుంది.

ఇక మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కలిగిన ఫేస్‌లిఫ్టెడ్ X7 xDrive40d లోని డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 340 hp పవర్ మరియు 700 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా 75 hp పవర్ మరియు 80 Nm టార్క్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది.

మరో లగ్జరీ కార్ విడుదల చేసిన BMW

BMW X7 ఫేస్‌లిఫ్ట్ యొక్క రెండు ఇంజిన్లు 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి జత చేయబడి ఉంటాయి. ఇందులో కంఫర్ట్, ఎఫిషియెంట్, స్పోర్ట్స్ మరియు స్పోర్ట్ ప్లస్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అదే సమయంలో అటెన్టివ్‌నెస్ అసిస్టెంట్, పార్కింగ్ అసిస్టెంట్ ప్రొఫెషనల్ విత్ సరౌండ్ వ్యూ కెమెరా, డ్రైవ్ రికార్డర్, స్మార్ట్‌ఫోన్ ద్వారా రిమోట్ పార్కింగ్ మరియు రివర్సింగ్ అసిస్టెంట్ వంటి ఫీచర్స్ కూడా పొందవచ్చు.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త BMW X7 ఫేస్‌లిఫ్ట్ తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లేటెస్ట్ కారు మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ GLS, ఆడిక్యూ 7, వోల్వో ఎక్స్‌సి90 మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఇప్పుడు ఈ కారు కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది, కావున మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని కథనాల కోసం 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Bmw x7 facelift launched in india price features and details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X