రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త సిట్రోయెన్ eC3 కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇప్పటికేయీ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు గురించి దాదాపు మొత్తం సమాచారం అందించింది. అయితే ఈ బుకింగ్స్ కి సంబంధించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

సిట్రోయెన్ కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, eC3 ఎలక్ట్రిక్ కోసం రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కావున ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. భారతదేశంలో డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. ఇది మార్కెట్లోకి లైవ్ మరియు ఫీల్ అనే రెండు వేరియంట్‌లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి

సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. అంతే కాకుండా బ్యాటరీ ప్యాక్ 56.2 బిహెచ్‌పి పవర్ మరియు 143 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసి ఫ్రంట్ యాక్సిల్‌కు అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది.ఇ ది కేవలం 6.8 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 107 కిమీ వరకు ఉంటుంది.

eC3 ఎలక్ట్రిక్ కారులో ఎకో, స్టాండర్డ్ మోడ్స్ తో పాటు రీజెనరేటివ్ బ్రేకింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ మీద ఏకంగా 320 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. అయితే ఇది వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితులలో రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇది తప్పకుండా మంచి రేంజ్ ఇస్తుందని ఆశించవచ్చు.

సిట్రోయెన్ eC3 ఛార్జింగ్ ఆప్సన్స్ విషయానికి వస్తే, ఇది 15A ప్లగ్ పాయింట్‌లో ప్లగ్ చేయబడిన ఆన్‌బోర్డ్ 3.3kW AC సెటప్‌ని ఉపయోగించి బ్యాటరీ ప్యాక్‌ను 10 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 10.5 గంటలు పడుతుంది. ఇది 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 57 నిముషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. కావున ఛార్జింగ్ సమయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

సిట్రోయెన్ యొక్క eC3 ఎలక్ట్రిక్ డిజైన్ పరంగా చూడ ముచ్చటగా ఉంది. దీని ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ ఉంటుంది, దానికి కొంచెం పైన డే టైమ్ రన్నింగ్ లైట్స్ చూడవచ్చు. హెడ్‌ల్యాంప్ సెటప్‌ కింది భాగంలో బ్లాక్ ప్లాస్టిక్-క్లాడ్ సెక్షన్‌లో ఫ్రంట్ బంపర్‌పై ఫాగ్ ల్యాంప్‌ చూడవచ్చు. ఫాగ్ ల్యాంప్‌ చుట్టూ పోలార్ వైట్ కలర్ గమనించవచ్చు. నిజానికి పోలార్ వైట్ అనేది ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క డ్యూయెల్ టోన్ థీమ్‌ కోసం ఎంపిక చేసిన కలర్.

రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి

సిట్రోయెన్ eC3 యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, దీని డాష్ బోర్డు మధ్యలో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది. ఇది వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఈ డిస్‌ప్లే 35 కి పైగా ఫీచర్స్ కనెక్ట్ చేయడానికి MyCitroen Connect యాప్‌ కూడా ఉంటుంది. దీని ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్, ఛార్జింగ్ స్టేషన్స్ వంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడంలో సహాయపడతాయి.

కంపెనీ ఈ కొత్త Citroen eC3 యొక్క బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ 7 సంవత్సరాలు లేదా 1,40,000 కిలోమీటర్ల వారంటీని అందించనుంది. అయితే ఎలక్ట్రిక్ మోటారు మీద కంపెనీ 5 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది. అదే సమయంలో eC3 ఎలక్ట్రిక్ మీద 3 సంవత్సరాలు లేదా 1,25,000 కిమీ వారంటీ లభిస్తుంది. వారంటీ పరంగా కూడా ఈ ఆప్సన్స్ ఉత్తమమైనవనే చెప్పాలి.

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇది వాహన వినియోగదారులకు మంచి సేఫ్టీ కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధరలను కంపెనీ వెల్లడించనప్పటికీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ మేము ఇటీవల డ్రైవ్ చేసాము, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
New citroen ec3 electric bookings open details in telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X