2022 లో ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ బ్రాండ్స్ - వివరాలు

2022 లో వాహన తయారీ సంస్థలు మంచి అమ్మకాలను చేపట్టాయి. గత సంవత్సరం కార్ బ్రాండ్స్ ఏకంగా 3,781,675 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే గత సంవత్సరం ఉత్తమ అమ్మకాలు చేప్పట్టిన టాప్ 10 కంపెనీలు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

2022 లో ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ బ్రాండ్స్ - వివరాలు

మారుతి సుజుకి:

భారతదేశపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా కీర్తి గడించిన మారుతి సుజుకి 2022 లో 1,576,025 యూనిట్లను మార్కెట్లో విక్రయించింది. 2021 లో కంపెనీ మార్కెట్లో 1,364,787 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ 2022 లో 2021 కంటే 2,11,238 యూనిట్ల వాహనాలను ఎక్కువ విక్రయించి 15.48 శాతం వృద్ధిని నమోచు చేసింది.

Rank Sales CY 2022 CY 2021 Growth (%) YoY
1 Maruti 15,76,025 13,64,787 15.48
2 Hyundai 5,52,511 5,05,033 9.40
3 Tata 5,26,798 3,31,181 59.07
4 Mahindra 3,35,088 2,01,693 66.14
5 Kia 2,54,556 1,81,583 40.19
6 Toyota 1,60,357 1,30,748 22.65
7 Honda 95,022 89,133 6.61
8 Renault 81,042 95,878 -15.47
9 Skoda 53,721 23,858 125.17
10 MG 48,063 40,273 19.34
2022 లో ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ బ్రాండ్స్ - వివరాలు

హ్యుందాయ్:

దేశీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా బ్రాండ్ హ్యుందాయ్ గత సంవత్సరం 5,52,511 యూనిట్ల వాహనాలను విక్రయించి టాప్ 10 లో రెండవ స్థానంలో నిలిచింది. ఈ అమ్మకాలు 2021 కంటే కూడా 9.40 శాతం లేదా 47,478 యూనిట్లు ఎక్కువ. అంటే కంపెనీ 2021 లో మొత్తం 5,05,033 యూనిట్లను విక్రయించింది.

2022 లో ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ బ్రాండ్స్ - వివరాలు

టాటా మోటార్స్:

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ గత సంవత్సరం అమ్మకాల్లో మూడవ స్థానంలో నిలిచింది. కంపెనీ 2022 వ సంవత్సరంలో మొత్తం 5,26,798 యూనిట్లను మార్కెట్లో విక్రయించగలిగింది. అయితే కంపెనీ 2021 లో 3,31,181 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే టాటా మోటార్స్ యొక్క అమ్మకాలు 2021 కంటే 2022 లో 59.07 శాతం లేదా 1,95,617 యూనిట్లు ఎక్కువని తెలుస్తోంది.

2022 లో ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ బ్రాండ్స్ - వివరాలు

మహీంద్రా:

భారతీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా 2022 లో మొత్తం 3,35,088 యూనిట్లను విక్రయించి టాప్ 10 జాబితాలో నాల్గవ స్తానం పొందింది. ఈ అమ్మకాలు 2021 కంటే కూడా 1,33,395 యూనిట్లు పెరిగాయి, దీని ప్రకారం అమ్మకాల పరంగా కంపెనీ గత ఏడాది 66.14 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే 2021 లో కంపెనీ 2,01,693 యూనిట్లను విక్రయించింది.

2022 లో ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ బ్రాండ్స్ - వివరాలు

కియా మోటార్స్:

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ఉంది. ఇందులో భాగంగానే 2022 లో కూడా ఉత్తమ అమ్మకాలు సాధించగలిగింది. కంపెనీ గత సంవత్సరం మార్కెట్లో 2,54,556 యూనిట్లను విక్రయించింది. అదే 2021 లో కంపెనీ 1,81,583 యూనిట్లను విక్రయించింది. అంటే 2021 కంటే 2022 లో కంపెనీ అమ్మకాలు 40.19 శాతం వృద్ధి చెందాయి.

2022 లో ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ బ్రాండ్స్ - వివరాలు

టయోటా:

భారతీయ మార్కెట్లో టయోటా కంపెనీ యొక్క వాహనాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. కావున భారతీయ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు పొందుతోంది. కంపెనీ గత సంవత్సరం మార్కెట్లో 1,60,357 యూనిట్లను విక్రయించింది. అమ్మకాల పరంగా టయోటా టాప్ 10 లో ఆరవ స్థానంలో ఉంది. 2021 లో కంపెనీ మార్కెట్లో 1,30,748 యూనిట్లను విక్రయించింది. అమ్మకాల పరంగా గత ఏడాది (2022) అంతకు ముందు (2021) కంటే 22.65 శాతం వృద్ధిని పొందింది. అంటే 2021 కంటే 2022 లో టయోటా అమ్మకాలు 29,609 యూనిట్లు ఎక్కువ.

2022 లో ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ బ్రాండ్స్ - వివరాలు

హోండా:

జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా 2022 లో 95,022 యూనిట్లను విక్రయించి 2021 కంటే 6.61 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021 లో కంపెనీ 89,133 యూనిట్లను మాత్రమే విక్రయించింది. సంఖ్య పరంగా 2022 లో 2021 కంటే 5,889 యూనిట్లు ఎక్కువ.

2022 లో ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ బ్రాండ్స్ - వివరాలు

రెనాల్ట్:

ఇక ఫ్రెంచ్ కార్ మేకర్ రెనాల్ట్ కూడా గత సంవత్సరం అమ్మకాల పరంగా ఆశించిన వృద్ధిని సాధించలేకపోయింది. గత సంవత్సరం కంపెనీ 81,042 యూనిట్లను విక్రయించింది. అదే 2021 లో రెనాల్ట్ కంటే 95,878 యూనిట్లను విక్రయించింది. అంటే 2022 కంటే 2021 లో కంపెనీ అమ్మకాలు 15.47 శాతం ఎక్కువ. అంటే 2022 లో అమ్మకాలు 15.47 శాతం లేదా 14,836 యూనిట్లు తక్కువ.

2022 లో ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ బ్రాండ్స్ - వివరాలు

స్కోడా:

చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ స్కోడా 2022 లో 53,721 యూనిట్లను విక్రయించి గణనీయమైన పురోగతిని నమోదు చేసింది. 2021 కంటే 2022 లో స్కోడా అమ్మకాలు ఏకంగా 125.17 శాతం ఎక్కువ. 2021 లో కంపెనీ మార్కెట్లో 23,858 యూనిట్లను విక్రయించింది. అంటే 2022 లో అమ్మకాలు 2021 కంటే 29,863 యూనిట్లు ఎక్కువ. గత సంవత్సరం కంపెనీ కొత్త ఉత్పత్తులను విడుదల చేయడం వల్ల ఈ అమ్మకాలు భారీగా పెరిగాయి.

2022 లో ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ బ్రాండ్స్ - వివరాలు

ఎంజి మోటార్:

చైనా బ్రాండ్ అయిన ఎంజి మోటార్ కంపెనీ కూడా భారతీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. కంపెనీ 2022 లో 48,063 యూనిట్లను విక్రయించి టాప్ 10 జాబితాలో ఒకటిగా నిలిచింది. కంపెనీ అమ్మకాలు 2021 కంటే కూడా 19.34 శాతం లేదా 40,273 యూనిట్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

2022 లో ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ బ్రాండ్స్ - వివరాలు

2021 లో దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేసింది, అయితే ఈ మహమ్మారి ఉదృతం 2022 లో కొంత తగ్గింది. ఈ సందర్భంగా చాలా కంపెనీలు మార్కెట్లో ఆధునిక కార్లను విడుదల చేశాయి. కావున అమ్మకాలు 2021 కంటే కూడా 2022 లో మెరుగ్గా ఉన్నట్లు నివేదికల తెలిపాయి. అయితే 2023 లో ఇంతకంటే మంచి పురోగతి ఉంటుందా.. లేదా అనేది వచ్చే ఏడాదికి తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని కథనాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Top ten best selling car brands in india 2022 telugu details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X