మొదలైన 'టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300' డెలివరీలు, ఫస్ట్ డెలివరీ ఎక్కడంటే?

ఇటీవల 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన టయోటా యొక్క కొత్త ల్యాండ్ క్రూయిజర్ 300 డెలివరీలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఈ SUV యొక్క మొదటి డెలివరీ మహారాష్ట్రలోని ఒక కస్టమర్‌కు డెలివరీ చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టయోటా యొక్క ల్యాండ్ క్రూయిజర్ 300 డెలివరీకి సంబంధించిన ఫోటోలు కొల్హాపూర్‌కు చెందిన ప్రతీక్ జాదవ్ ద్వారా బయటపడ్డాయి. ఈ SUV ధరలు దేశీయ మార్కెట్లో ఏకంగా రూ. 2.17 కోట్లు (ఎక్స్-షోరూమ్), కాగా ఈ SUV కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున డెలివరీలు ఇప్పుడు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ SUV 2021 లో గ్లోబెల్ మార్కెట్లో అరంగేట్రం చేయబడింది.

మొదలైన టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 డెలివరీలు

భారతదేశంలో కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ మొత్తం ఐదు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి వైట్ పెర్ల్, సూపర్ వైట్, డార్క్ రెడ్ మైకా మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్ మరియు డార్క్ బ్లూ మైకా కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఇప్పుడు డెలివరీ చేయబడిన ల్యాండ్ క్రూయిజర్ వైట్ పెర్ల్ కలర్ లో ఉంది. చాలా మంది వాహన ప్రియులు ఎక్కువగా వైట్ కలర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 భారతదేశంలో కేవలం ఒక పవర్‌ట్రెయిన్ ఎంపికతో అందుబాటులో ఉంటుంది. కావున ఇందులో 3.3-లీటర్, టర్బోచార్జ్డ్, V6 డీజిల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 309 పిఎస్ పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ప్రామాణికంగా 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్లలో, టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 SUV మరింత శక్తివంతమైన 3.5-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V6 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 415 పిఎస్ పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి6 పెట్రోల్ ఇంజన్ కూడా కొన్ని ప్రాంతాలలో ఆఫర్‌లో ఉంది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్, 14-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు మరియు సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కావున ఈ ల్యాండ్ క్రూయిజర్‌ 300 తప్పకుండా వినియోగదారులను ఆకర్షిస్తుంది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 SUV సమాంతరంగా కనిపించే స్లాట్‌లతో కూడిన పెద్ద గ్రిల్, దానికి ఇరువైపులా సొగసైన LED హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫాగ్ ల్యాంప్‌ ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ భారీగా కనిపించడమే కాకుండా ఫ్లెర్డ్ వీల్ ఆర్చ్‌లతో ఉంటుంది. వెనుక వైపున LED టెయిల్‌లైట్‌లతో నిటారుగా ఉండే టెయిల్‌గేట్‌ చూడవచ్చు. ఇవన్నీ కూడా ఈ SUV ని మరింత అద్భుతంగా కనిపించేలా చేస్తాయి.

ల్యాండ్ క్రూయిజర్ మంచి డిజైన్ కలిగి ఉండటం వల్ల వినియోగదారులను ఒక్క చూపుతోనే ఆకర్షిస్తుంది. ఇందులో లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ SUV లో ADAS టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది, కావున అడాప్టివ్ వేరియబుల్ సస్పెన్షన్, ఫోర్-జోన్ టెంపరేచర్ కంట్రోల్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, 3D మల్టీ-టెర్రైన్ మానిటర్ మరియు 10 ఎయిర్‌బ్యాగ్‌లు వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota new land cruiser 300 delivered to first indian customer
Story first published: Saturday, January 21, 2023, 11:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X