భారతీయ మార్కెట్లో ఈ నెలలో విడుదలయ్యే ఆధునిక కార్లు - వివరాలు

2022 లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత అనేక కొత్త కార్లు దేశీయ మార్కెట్లో విడుదలయ్యాయి. అయితే 2023 ఆటో మొబైల్ రంగానికి చాలా ముఖ్యమైన సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ నెలలో ఆటో ఎక్స్‌పో కూడా జరగనుంది.

ఈ సంవత్సరం భారతీయ మార్కెట్లో విడుదలకావడానికి అనేక కొత్త కార్లు మరియు అప్డేటెడ్ మోడల్స్ వేచి ఉన్నాయి. ఇందులో చాలా మోడల్స్ ఈ నెలలో జరగనున్న ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2023 లో అడుగుపెట్టనున్నాయి. ఈ నెలలో భారతీయ మార్కెట్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న కార్లలో సిట్రోయెన్ సి3 ఎలక్ట్రిక్, MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్, మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్, మహీంద్రా థార్ 2WD మరియు BMW X1 ఉన్నాయి. వీటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో ఈ నెలలో విడుదలయ్యే ఆధునిక కార్లు

సిట్రోయెన్ eC3:

సిట్రోయెన్ కంపెనీ దేశీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతోంది. అయితే కంపెనీ ఈ సంవత్సరం ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ తన సి3 మోడల్ ని ఎలక్ట్రిక్ మోడల్ గా తీసుకురావడానికి సన్నాహాలు కూడా సిద్ధం చేస్తోంది. ఈ కొత్త సిట్రోయెన్ eC3 చూడటానికి దాని స్టాండర్డ్ పెట్రోల్ మాదిరిగా ఉంటుందని, అయితే ఇందులో ఛార్జింగ్ పోర్ట్‌ వంటివి ఉంటాయని తెలుస్తోంది.

ఎంజి హెక్టర్:

భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న ఎంజి హెక్టర్ ఈ నెలలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంజి హెక్టర్ మంచి అమ్మకాలు పొందుతూ కంపెనీకి ఆశించిన వృద్ధిని తీసుకువస్తోంది. అయితే ఈ నెలలో ఇందులో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ రానుంది. ఇది కూడా తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. ఈ SUV కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్:

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ ఈ నెలలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఈ SUV త్వరలో జరగనున్న 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించనుంది. ఈ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక సమాచారం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ SUV దేశీయ విఫణిలో విడుదలైతే తప్పకుండా ఆశించిన స్థాయికంటే కూడా ఎక్కువ అమ్మకాలు పొందుతాయని భావిస్తున్నాము.

మహీంద్రా థార్ 2WD:

దేశీయ మార్కెట్లో మహీంద్రా థార్ SUV కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ SUV దేశీయ విఫణిలో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన అమ్మకాలను పొందుతోంది. కాగా కంపెనీ ఇప్పుడు ఈ SUV లో 2WD వెర్షన్ ను తీసుకురానుంది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా సరసమైనదిగా ఉంటుంది. అంతే కాకూండా ఇది 1.5-లీటర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ పొందనుంది.

బిఎండబ్ల్యు ఎక్స్1:

భారతీయ మార్కెట్లో అత్యంత విజయవంతమైన జర్మన్ బ్రాండ్ BMW దేశీయ మార్కెట్లో తన లేటెస్ట్ ఎక్స్1 విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కంపెనీ ఈ SUV ని ఈ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ లేటెస్ట్ ఎక్స్1 మోడల్ మునుపటి మోడల్ కంటే కూడా ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందనుంది. ఇది డీజిల్ మరియు రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో మొత్తం నాలుగు ఇంజన్ ఆప్షన్‌లతో 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ పొందనుంది.

Most Read Articles

English summary
Upcoming cars in 2023 january details in telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X