హోండా సిబి350 ఆర్ఎస్ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభం

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త సిబి350 ఆర్ఎస్ కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్ డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైక్‌కి పోటీగా జపనీస్ బ్రాండ్ ప్రవేశపెట్టిన ఈ హోండా సిబి350 ఆర్ఎస్ గతేడాది చివర్లో భారత మార్కెట్లో విడుదలైంది.

హోండా సిబి350 ఆర్ఎస్ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభం

మార్కెట్లో ఈ కొత్త హోండా సిబి350 ఆర్ఎస్ ప్రారంభ ధర రూ.1,96,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది రెండు వేరియంట్లలో సింగిల్ టోన్ మరియు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. రెట్రో మోడ్రన్ డిజైన్‌తో అటు క్లాసిక్ లుక్‌ని ఇటు లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లను కలిగి ఉండేలా ఈ హోండా సిబి350 ఆర్ఎస్ మోటార్‌సైకిల్‌ను తయారు చేశారు.

హోండా సిబి350 ఆర్ఎస్ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభం

హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ఈ కొత్త సిబి350 ఆర్ఎస్ మోటార్‌సైకిల్‌ను విక్రయిస్తున్నారు. ఈ డీలర్‌షిప్ కేంద్రాలలో హోండా తమ హై-ఎండ్ ప్రీమియం బైక్‌లను విక్రయిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఐదు హోండా బిగ్‌వింగ్ షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్‌లో నాలుగు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఒకటి ఉన్నాయి.

MOST READ:బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా బుక్ చేయండి

హోండా సిబి350 ఆర్ఎస్ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభం

ఈ బైక్ పట్ల ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కానీ లేదా నేరుగా డీలర్‌షిప్ కేంద్రానికి విచ్చేసి కానీ బుక్ చేసుకోవచ్చు. కొత్త హోండా సిబి350 ఆర్ఎస్ మోటార్‌సైకిల్ మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది. విశిష్టమైన డిజైన్, క్లాసిక్ లుక్, లేటెస్ట్ ఫీచర్స్ మరియు ప్రీమియం ఫీల్‌తో రూపుదిద్దుకున్న ఈ బైక్ ఖచ్చితంగా చూపరుల దృష్టిని ఆకట్టుకుంటుంది.

హోండా సిబి350 ఆర్ఎస్ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభం

ఇందులోని గుండ్రటి ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ మరియు దాని చుట్టూ విశిష్టమైన రింగ్ డిజైన్, ఎల్‌ఇడి బ్లింకర్స్, సన్నటి ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్, బ్లాక్ స్మోక్ ఫ్రంట్ అండ్ రియర్ ఫెండర్స్ వంటి డిజైన్ ఫీచర్లతో ఇది స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంటుంది. రైడర్ సీట్ క్రింది భాగంలో బాడీ ప్యానెల్‌పై క్రోమ్ సిబి350 ఆర్ఎస్ బ్యాడ్జ్ ఉంటుంది. ఇందులో ఆర్ఎస్ అంటే 'రోడ్ సెయిల్' అని అర్థం.

MOST READ:మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

హోండా సిబి350 ఆర్ఎస్ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభం

ఈ బైక్‌లో ఆఫర్ చేస్తున్న లేటెస్ట్ టెక్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో సెగ్మెంట్ ఫస్ట్ అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్‌ను అందిస్తున్నారు. ఇంకా ఇందులో అడ్వాన్స్డ్ డిజిటల్ అనలాగ్ మీటర్ కూడా ఉంటుంది. ఇది రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, టార్క్ కంట్రోల్, ఏబిఎస్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ మరియు బ్యాటరీ వోల్టేజ్ వంటి పలు రకాల సమాచారాన్ని అందిస్తుంది.

హోండా సిబి350 ఆర్ఎస్ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభం

ఇంజన్ విషయానికి వస్తే, హోండా సిబి350 ఆర్ఎస్ మోటార్‌సైకిల్‌లో 350సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 20.78 బిహెచ్‌పి పవర్ మరియు 3000 ఆర్‌పిఎమ్ వద్ద 30 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.

MOST READ:తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

హోండా సిబి350 ఆర్ఎస్ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభం

మెకానికల్ ఫీచర్లను గమనిస్తే, హోండా సిబి350 ఆర్‌ఎస్ మోటార్‌సైకిల్‌లో ముందు వైపు 310 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇంకా ఇందులో ఇంజన్ స్టార్ట్ / స్టాప్ స్విచ్, హాజర్డ్ స్విచ్ ఫీచర్లు కూడా లభిస్తాయి.

హోండా సిబి350 ఆర్ఎస్ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభం

హోండా సిబి350 ఆర్‌ఎస్ డెలివరీలను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యత్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. "సిబి 350 ఆర్ఎస్ బైక్ కోసం యువత నుండి మంచి స్పందన లభించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. రోడ్ సెయిల్ (ఆర్‌ఎస్) అనే కాన్సెప్ట్‌లో రూపొందించిన ఈ బైక్ చలన సమయంలో చాలా సున్నితమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. పవర్‌ఫుల్ ఇంజన్ మరియు అప్‌గ్రేడెడ్ అర్బన్ స్టైల్‌తో మీరు మీ స్టైల్‌లో జీవించడానికి సిబి350 ఆర్ఎస్ బైక్ ఖచ్చితంగా సరిపోతుంద"ని అన్నారు.

MOST READ:కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

Most Read Articles

English summary
Honda Motorcycle Starts New CB350RS Deliveries, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X