Just In
- 1 hr ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 4 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 5 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 6 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- News
Covid: భారత్‌కు మరో దెబ్బ -విమాన సర్వీసులపై యూఏఈ నిషేధం -భారతీయు ప్రయాణికులపైనా ఆంక్షలు
- Sports
RCB vs RR: శాంసన్ ఆటను ఎక్కువగా ఆస్వాదిస్తా.. అతడి షాట్లను బాగా ఇష్టపడతా: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Finance
భారీ నష్టాల నుండి లాభాల్లోకి మార్కెట్, సెన్సెక్స్ 375 పాయింట్లు జంప్
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'మేడ్ ఇన్ ఇండియా' జీప్ వ్రాంగ్లర్ విడుదల: ధర అర కోటి పైమాటే!
అమెరికన్ ఐకానిక్ కార్ బ్రాండ్ జీప్, భారత మార్కెట్లో స్థానికంగా అసెంబుల్ చేసిన తమ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'వ్రాంగ్లర్'ను విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ మేడ్ ఇన్ ఇండియా జీప్ వ్రాంగ్లర్ ధర రూ.53.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

నేటి (మార్చి 17, 2021వ తేదీ) నుండి దేశవ్యాప్తంగా ఈ కొత్త జీప్ వ్రాంగ్లర్ అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ కోసం బుకింగ్స్ మరియు డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. కొత్త 2021 జీప్ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ మరియు రూబికాన్ అనే రెండు వెర్షన్లలో లభ్యం కానుంది వాటి ధరలు ఇలా ఉన్నాయి:
జీప్ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ : రూ.53.90 లక్షలు
జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ : రూ.57.90 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

జీప్ ఇప్పటి వరకూ ఈ మోడల్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారత్‌కు దిగుమతి చేసుకునేది. కాగా, ఇప్పుడు ఈ కారును విడిభాగాల రూపంలో దిగుమతి చేసుకొని, స్థానికంగా భారతదేశంలోనే అసెంబుల్ చేస్తోంది.
MOST READ:ఈ జట్కా బండ్లకు గుర్రాలు అక్కర్లేదు; వీటిపై సామాన్యులు కూడా సెలబ్రిటీల్లా తిరగొచ్చు!

స్థానిక అసెంబ్లీ కారణంగా, సిబియూ మోడల్‌తో పోల్చుకుంటే ఈ కొత్త జీప్ వ్రాంగ్లర్ ధరలు సుమారు రూ.10-12 లక్షల వరకూ తగ్గాయి. మహారాష్ట్రలోని రంజన్‌గావ్‌లో ఉన్న జీప్ ఇండియా ప్లాంట్‌లో ఈ ఎస్‌యూవీని అసెంబుల్ చేస్తున్నారు. గడచిన ఫిబ్రవరి నెలలో ఈ మోడల్ ఉత్పత్తి ప్రారంభమైంది.

కొత్త 2021 జీప్ వ్రాంగ్లర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 26 జీప్ డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ఈ మోడల్ అందుబాటులో ఉంటుంది. జీప్ ఇండియా స్థానిక్ కార్యకాలాపాలం కోసం 250 మిలియన్ డాలర్ల పెట్టుబడి వెచ్చించిన కారణంగా, వ్రాంగ్లర్ స్థానిక అసెంబ్లీ సాధ్యమైంది.
MOST READ:ఏప్రిల్ 7 న భారత మార్కెట్లో విడుదల కానున్న 'సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్' ; పూర్తి వివరాలు

జీప్ వ్రాంగ్లర్ బ్రాండ్ యొక్క 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కంపెనీ ఇందులో ఓ 'లాంచ్ ఎడిషన్' కూడా విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉంటుంది. పాత వ్రాంగ్లర్ మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్ ధర రూ.10.04 లక్షలు తగ్గింది. ఇదివరకు జీప్ వ్రాంగ్లర్ ప్రారంభ ధర రూ.63.94 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉండేది.

కొత్త జీప్ వ్రాంగ్లర్‌లోని ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, సిగ్నేచర్ సెవన్ స్లాట్ గ్రిల్, డ్రాప్ డౌన్ విండ్‌షీల్డ్, తొలగించగల డోర్లు మరియు రూఫ్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది ఫైవ్-డోర్ వెర్షన్ జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీ. దీని ఐకానికి డిజైన్ మరియు ఫీచర్లు ఇంటర్నేషనల్ వెర్షన్ మాదిరిగానే ఉంటాయి.
MOST READ:కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

ఇక ఇంటీరియ ఫీచర్లను గమనిస్తే, ఇందులో అప్‌డేట్ చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్ సిస్టమ్, స్టీరియో సిస్టమ్, ఉతికి లేక కడిగి శుభ్రం చేయదగిన ఇంటీరియర్ అప్‌హోలెస్ట్రీ మొదలైనవి ఉన్నాయి. వ్రాంగ్లర్ ఎస్‌యూవీ అద్భుతమైన ఆఫ్-రోడ్ సామర్ధ్యాలకు ప్రసిద్ది చెందినది. ఇది అధిక గ్రౌండ్ క్లియరెన్స్ (217 మిమీ) మరియు వాటర్ వేడింగ్ (760 మిమీ) సామర్ధ్యాలను కలిగి ఉంటుంది.

ఈ ఎస్‌యూవీలో శక్తివంతమైన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 268 బిహెచ్‌పి పవర్‌ను 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఇంజన్ ద్వారా విడుదలయ్యే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది.
MOST READ:సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌పై ట్రాఫిక్ పోలీస్ [వీడియో]

జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీ కోసం కంపెనీ 120 యాక్ససరీలను అందిస్తోంది. అంతేకాకుండా ఎక్స్‌ప్లోరర్ ప్యాక్, నైట్ అల్ట్రా విజన్ ప్యాక్, స్పోర్ట్స్ ప్యాక్, ఎసెన్షియల్ ప్యాక్ వంటి నాలుగు విభిన్న యాక్ససరీ ప్యాకేజ్‌లను కూడా అందిస్తోంది. జీప్ వ్రాంగ్లర్‌పై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల (ఏది ముందు ముగిస్తే అది) వారంటీని కూడా ఆఫర్ చేస్తోంది.