కొత్త 2022 మోడల్ రెనో కైగర్ రివ్యూ (MY22 Renault Kiger).. ఇందులో కొత్తగా ఏం చేశారంటే..?

నిజానికి భారతీయ మార్కెట్లో ఎస్‌యువిల కంటే కూడా హ్యాచ్‌బ్యాక్‌లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. అంటే ఎస్‌యువిలకు డిమాండ్ తక్కువగా ఉందని మాత్రం కాదు. ఎందుకంటే SUV లు కూడా మార్కెట్లో మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇందులో ఫుల్-సైజ్ ఎస్‌యువిలు, మిడ్-సైజ్ ఎస్‌యువిలు, కాంపాక్ట్ ఎస్‌యువిలు, సబ్-కాంపాక్ట్ ఎస్‌యువిలు మరియు మైక్రో-ఎస్‌యువిలు ఉన్నాయి.

2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

హ్యాచ్‌బ్యాక్‌ విభాగంలో తిరుగులేని అమ్మకాలు పొందుతున్న 'రెనాల్ట్ కైగర్' ఆధునిక ఫీచర్స్ తో అందుబాటులో ఉన్న కంపెనీ యొక్క పాపులర్ బ్రాండ్. అయితే కంపెనీ ఇప్పుడు ఈ హ్యాచ్‌బ్యాక్‌ను మరి కొన్ని అప్‌డేట్స్ తో కొత్త 2022 మోడల్ ప్రారంభించింది. ఈ కొత్త మోడల్ ఇప్పుడు చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంది.

ఇటీవల మేము ఈ 2022 రెనాల్ట్ కైగర్ డ్రైవ్ చేసాము. ఈ హ్యాచ్‌బ్యాక్‌ యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్ వంటి ఇతర వివరాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.. రండి.

2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

2022 రెనాల్ట్ కైగర్ డిజైన్ మరియు స్టైల్:

2022 రెనాల్ట్ కైగర్ ఇప్పుడు స్టీల్త్ బ్లాక్ అనే కొత్త కలర్ లో చూడచక్కగా.. చూడగానే ఆకర్షించే విధంగా ఉంది. అయితే ఇది దాని 2021 మోడల్ లోని అదే ఫ్రంట్ ఫాసియాతో వస్తుంది. ఇందులో స్పిల్ట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ ఉంది. ఎల్ఈడీ డిఆర్ఎల్, అదే విధంగా ముందు భాగంలో ఒక పెద్ద రెనాల్ట్ లోగో ఉంది. బంపర్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, దాని దిగువన కొత్త స్కిడ్ ప్లేట్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కైగర్ యొక్క డిజైన్ ను మరింత పెంచుతాయి.

2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ సి ఆకారంలో ఉండే ఎల్ఈడీ టెయిల్ లాంప్ మరియు మధ్యలో బ్రాండ్ లోగో చూడవచ్చు.

2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

2022 రెనాల్ట్ కైగర్ కాక్‌పిట్ అండ్ ఇంటీరియర్:

2022 రెనాల్ట్ కైగర్ సాధారణంగా చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. కావున ఎక్స్టీరియర్ కూడా అదే విధంగా ముందుకు సాగుతుంది. ఇందులోని చంకీ డోర్ హ్యాండిల్స్‌ ఉపయోగించే డోర్ ఓపెన్ చేయగానే మీకు అద్భుతమైన క్యాబిన్ స్వాగతం పలుకుతుంది.

2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

ఇందులో త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ అందుబాటులో ఉంటుంది. ఈ స్టీరింగ్ వీల్ లో కుడివైపున ఆడియో కంట్రోల్స్ మరియు ఎడమవైపున క్రూయిజ్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్ వెనుక డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది వాహనం గురించి కావాల్సిన సమాచారం డ్రైవర్ కి అందిస్తుంది. మధ్యలో 7 ఇంచెస్ టిఎఫ్టి స్క్రీన్ ఉంటుంది. ఇందులో ఎడమవైపున టెంపరేచర్ గేజ్ మరియు కుడివైపున ఫ్యూయెల్ గేజ్ వంటివి ఉన్నాయి.

2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

డాష్‌బోర్డ్‌ సెంటర్ స్టేజ్ లో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. దీనికింది భాగంలో ఏసీ వెంట్స్ లభిస్తాయి, దాని కింద ఎయిర్ కండిషనింగ్ కోసం కంట్రోల్స్ ఉన్నాయి. ఇందులో టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్ మరియు ఏసీ మోడ్‌ అడ్జస్ట్ చేయడానికి డయల్స్ ఉన్నాయి.

2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

ఏసీ కంట్రోల్స్ కింద స్టార్ట్ మరియు స్టాప్ బటన్ మరియు USB ఫోర్ట్ లభిస్తాయి. అంతే కాకుండా ఇందులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్‌ కూడా పొందుతారు. అయితే వైర్‌లెస్ ఛార్జర్ కోసం పవర్ ఆన్/ఆఫ్ బటన్ కూడా ఇందులో ఉంటుంది. కావున ఎక్కువ ఛార్జింగ్ అవసరం లేదు అనుకున్నప్పుడు, ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇందులోని ఒక ప్రత్యేకమైన ఫీచర్ అని చెప్పవచ్చు.

ఇందులోని సీట్లు మరియు స్టీరింగ్ వీల్ కి చుట్టబడిన లెదర్ మీద రెడ్ స్టిచ్చింగ్ చూడవచ్చు. మొత్తం మీద ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.

2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

ప్రాక్టికాలిటీ, కంఫర్ట్ మరియు బూట్ స్పేస్:

2022 రెనాల్ట్ కైగర్ లోని సీట్లు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్. ముందు సీట్లు చాలా కంఫర్ట్ గా ఉన్నాయి.

ఇక వెనుక సీట్ల విషయానికి వస్తే, ఇందులో లెగ్‌రూమ్, క్నీ రూమ్, హెడ్‌రూమ్ మరియు అండర్-తై సఫోర్ట్ అన్ని ప్రయాణికులకు అనుకూలంగా ఉన్నాయి. కావున లాంగ్ డ్రైవ్ లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, రియర్ ఏసీ వెంట్‌లు మరియు కప్‌హోల్డర్‌లతో కూడిన ఫోల్డ్-డౌన్ ఆర్మ్‌రెస్ట్ వంటివి లభిస్తాయి.

2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

2022 రెనాల్ట్ కైగర్ లో ఎక్కువ క్యూబీహోల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముందు భాగంలో రెండు గ్లోవ్‌బాక్స్‌లు, సెంటర్ కన్సోల్‌లో కప్‌హోల్డర్‌లు, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ ఉన్నాయి. ఇందులో 405 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. నిజానికి కైగర్ సెగ్మెంట్ లో ఇదే అత్యధిక బూట్ స్పేస్.

2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

ఇదివరకే చెప్పుకున్నట్లుగా ఈ కొత్త కైగర్ యొక్క ఇంజిన్ లో ఎటువంటి మార్పు లేదు. కావున ఇందులో 999 సిసి 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 71 బిహెచ్‌పి పవర్ మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

అయితే అదే ఇంజన్ ఇప్పుడు మరింత శక్తివంతమైన ట్యూన్‌లో అందుబాటులో ఉంటుంది. కావున 999 సిసి పెట్రోల్ ఇంజన్ టర్బోచార్జ్ చేయబడింది. ఇది 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 98.6 బిహెచ్‌పి పవర్ మరియు 2,200 - 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 152 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజన్‌ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా సివిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

మేము డ్రైవ్ చేసిన కారు టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు సివిటి గేర్‌బాక్స్ తో ఉంది. ఇంజిన్ అద్భుతమైన పనితీరుని అందించింది. కానీ ఇందులోని సివిటి గేర్‌బాక్స్‌కి బదులు మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఉంటె బాగుండేదని ఆశిస్తున్నాము. కానీ సివిటి గేర్‌బాక్స్‌ కూడా అనుకూంగానే ఉంది. మొత్తం మీద 2022 రెనాల్ట్ కైగర్ తప్పకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

2022 రెనాల్ట్ కైగర్ స్ప్రుంగ్ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది కావున ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లు మీద కొంచెం వేగం తగ్గేలా చేస్తుంది. బ్రేకులు కూడా చాలా షార్ప్ గా పనిచేస్తాయి.

2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

2022 రెనాల్ట్ కైగర్ సేఫ్టీ ఫీచర్స్:

2022 రెనాల్ట్ కైగర్ వాహన వినియోగదారులకు మంచి భద్రను అందించడానికి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కావున ఇందులో ఈ కింది సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

  • 4 ఎయిర్‌బ్యాగ్‌లు
  • ఏబీఎస్ విత్ ఈబిడి
  • వరియర్ వ్యూ కెమెరా
  • ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్
  • 2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

    రెనాల్ట్ కిగర్ కీ ఫీచర్స్:

    • 29-లీటర్ల క్యాబిన్ స్టోరేజ్ స్పేస్
    • కూల్డ్ లోయర్ గ్లోవ్‌బాక్స్
    • 8-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
    • ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే
    • వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్
    • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
    • క్రూయిజ్ కంట్రోల్
    • డ్రైవ్ మోడ్‌లు
    • కీలెస్ ఎంట్రీ/గో
    • 2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

      కలర్ ఆప్సన్స్:

      2022 రెనాల్ట్ కైగర్ 5 సింగిల్ టోన్ కలర్స్ మరియు 4 డ్యూయెల్ టన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి.

      సింగిల్-టోన్ కలర్స్:

      కాస్పియన్ బ్లూ

      మూన్ లైట్ సిల్వర్

      ఐస్ కూల్ వైట్

      మహోగని బ్రౌన్

      స్టెల్త్ బ్లాక్

      2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

      డ్యూయెల్ టోన్ కలర్స్:

      • రేడియంట్ రెడ్
      • మెటల్ మస్టర్డ్
      • కాస్పియన్ బ్లూ
      • మూన్ లైట్ సిల్వర్
      • 2022 రెనాల్ట్ కైగర్ రివ్యూ.. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి?

        డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

        భారతీయ మార్కెట్లో ఎక్కువమంది ఇష్టపడే కార్లలో రెనాల్ట్ కంపెనీ యొక్క కైగర్ ఒకటి. ఇప్పుడు 2022 కైగర్ ఆధునిక డిజైన్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ తో మాత్రమే కాకుండా మంచి కలర్ ఆప్సన్స్ లో కూడా అందుబాటులో ఉంది. కావున ఇప్పుడు ఈ కొత్త కైగర్ వాహన వినియోగదారులకు తప్పకుండా మంచి ఎంపిక అవుతుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
2022 model year renault kiger launched price specs and features
Story first published: Wednesday, July 27, 2022, 13:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X