పూర్తి ప్యాకేజీతో 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్: ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్

Written By:

ఇండియన్ మార్కెట్లోకి ఆడి 2008 లో తమ మొదటి ఏ4 సెడాన్ కారును విడుదల చేసింది. ఏ విధమైన తడబాటు లేకుండా మంచి ఫలితాలను సాధిస్తూ వచ్చింది. తరువాత కొద్ది కాలానికే ఆడి వారి గరిష్ట అమ్మకాలు సాధిస్తున్న లగ్జరీ సెడాన్‌గా మొదటి స్థానంలో నిలిచింది. అయితే అనతి కాలంలోనే దీని అమ్మకాల వేగానికి బ్రేకులు వేస్తూ బిఎమ్‌డబ్ల్యూ నుండి 3-సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ నుండి సి-క్లాస్ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి.

ఈ రెండు ఉత్పత్తుల పోటీని ఎదుర్కొనేందుకు ఏ4 ఎప్పటికప్పుడు లో కొత్త మార్పులు చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తన పోటీ దారుల మీద పూర్తి స్థాయిలో పై చేయి సాధించేందుకు సిద్దమైంది సరికొత్త 2017 ఆడి ఏ4 .

బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ లను వెనక్కి నెట్టే సరికొత్త 2017 ఆడి ఏ4 కారు టెస్ట్ డ్రైవ్‌కు సంభందించిన వివరాలు నేటి మన కారు రివ్యూ కథనంలో...

 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

మొదటి సారిగా అందుబాటులోకి వచ్చిన ఆడి ఏ4 కు ఇప్పటి ఏ4 (2008-2016)కు డిజైన్ పరంగా చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. బాగా మార్పును సంతరించుకున్న వాటిలో ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, సమాంతర గీతల వంటి ఆకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ వంటివి ముఖ్యంగా గమనించవచ్చు.

 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

సరికొత్త 2017 ఆడి ఏ4 ఇండియన రోడ్లకు అనుగుణంగా కొలతల పరంగా కొన్ని మార్పులకు గురయ్యింది. అందులో 0.5 అంగుళాల వీల్ బేస్, 0.6 అంగుళాలు మరియు మొత్తం మీద 1.0-అంగుళాలు పెరిగిన పొడవులు ఇందులో గమనించవచ్చు. మునుపటి ఏ4 తో పోల్చుకుంటే సుమారుగా 120 కిలోల తక్కువ బరువుతో వచ్చింది.

 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

ఇంటీరియర్ పరంగా ఏ4 లోని మొత్తం ఇంటీరియర్‌లోని ముందు వైపు సగం చూడటానికి విమానంలోని కాక్‌పిట్‌(పైలట్ క్యాబిన్)ను తలపిస్తుంది. డ్యాష్ బోర్డు మీదుగా కొత్త ఎయిర్ వెంట్‌లను అందించారు. సౌకర్యవంతమైన సీట్లలో సరికొత్త వెంటిలేషన్ సిస్టమ్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

డ్రైవర్‌కు ఎంతో ముఖ్యమైన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. సెంటర్ కన్సోల్, మూడు స్పోక్స్ గల విభిన్న కంట్రోల్స్‌ను కలిగి ఉన్న ప్లాట్ స్టీరింగ్ వీల్, పెడల్ షిఫ్టర్స్ వంటిలి కలవు.

 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

8.3-అంగుళాల ఎమ్ఎమ్ఐ డ్యాష్ టాప్ స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ టచ్ ప్యాడ్ ఎమ్ఎమ్ఐ కంట్రోలర్, వైర్ లెస్ ఛార్జింగ్ క్యూఐ ఫోన్ బాక్స్‌లతో పాటు ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటిని వియోగించుకునే సౌలభ్యాన్ని ఇందులో అందించారు.

 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

సరికొత్త 2017 ఆడి ఏ4 లో చోటు చేసుకున్న మార్పుల్లో సాంకేతిక మార్పులు. ఇందులో ఆధునిక తరానికి చెందిన 1.4-లీటర్ సామర్థ్యం గల టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు.

 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

ఈ 2017 ఆడి ఏ4 ను డ్రైవ్ చేస్తున్నపుడు యాక్సిలరేషన్ పనితీరు అద్భుతం అని చెప్పాలి. ప్రారంభం నుండి మధ్య స్థాయికి వచ్చే వరకు ఉత్తమ పవర్‌ను ఉత్పత్తి చేయును. గరిష్ట వేగాన్ని అందుకునే వరకు ఎక్కడా నిరాశపరిచే పనితీరును కనబరచదు.

 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 150బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

2017 ఆడి ఏ4 కేవలం 8.5 సెకండ్ల కాలవ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లుగా ఉంది.

 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ మైలేజ్ పరంగా ఇది లీటర్‌కు 17 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

ఆడి సంస్థ ఈ సరికొత్త 2017 ఏ4 సెడాన్‌లో తప్పించిన అతి ముఖ్యమైన అంశం ఆడి ఆల్ వీల్ డ్రైవ్ క్వాట్రో టెక్నాలజీ. 2017 ఆడి ఏ4 కేవలం ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ని మాత్రమే కలిగి ఉంది.

 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

రివర్ వీల్ డ్రైవ్ ఇందులో లేనప్పటికీ ఇది మంచి డ్రైవ్ అనుభూతిని కలిగిస్తుంది. సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన డ్రైవ్ అనుభవాన్ని పొందవచ్చు.

 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

భద్రతకు సంభందించి మంచి ప్యాకేజినే కలిగి ఉంది. ఇందులో ఎనిమిది ఎయిర్ బ్యాగులు, ప్రి కొల్లిషన్ బ్రేకింగ్ (ప్రమాదాన్ని పసిగట్టి బ్రేకులు వేసే సాంకేతికత), లేన్ కీపింగ్ అసిస్ట్, రివయర్ క్రాస్ ట్రాఫిక్ అసిస్ట్ ద్వారా బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, మందమతి డ్రైవర్లను అలర్ట్ చేయడం వంటి భద్రత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

2017 ఆడి ఏ4 ధరలు

2017 ఆడి ఏ4 ధరలు

  • ఆడి ఏ4 ప్లస్ ధర రూ. 38,10,000 లు
  • ఆడి ఏ4 టెక్నాలజీ ధర రూ. 41,20,000 లు
రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
తీర్పు

తీర్పు

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ వంటి ఉత్పత్తులతో పోల్చుకుంటే ఈ 2017 ఆడి ఏ4 ఆమోద్యయొగ్యమైన ఉత్పత్తి.

ఆడి నినాదం

ఆడి నినాదం

ఆడి సంస్థ యొక్క వ్యాపార నినాదం "Vorsprung durch Technik," అంటే ఆధునిక సాంకేతికతో పురోగతిని సాధించడం అని అర్థం. తొమ్మిదవ తరానికి చెందిన ఈ ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ నిజంగానే ఆధునిక సాంకేతికతతో పురోగతిని సాధించిందని చెప్పవచ్చు.

 
English summary
Read In Telugu: First Drive: The 2017 Audi A4 Back In Form — The Best A4 — After 9 Generations
Please Wait while comments are loading...

Latest Photos