హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

ప్రస్తుతం, భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలదే రాజ్యం. ఈ విభాగంలో పెరిగిన కార్ మోడళ్లతో వాటి మధ్య పోటీ కూడా విపరీతంగా పెరిగింది. కాబట్టి, ఈ విభాగంలో ఏ కార్ బ్రాండ్ అయినా ఎక్కువ కాలం నిలబడాలంటే, కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించడం ఎంతో అవసరం. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కస్టమర్లు సదరు బ్రాండ్‌కి శాశ్వతంగా వీడ్కోలు చెప్పేస్తారు.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఇందుకు చక్కటి ఉదాహరణ, ప్రారంభంలో కస్టమర్లు ఈ అమెరికన్ బ్రాండ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎగబడి మరీ కొన్నారు. అయితే, ఆ తర్వాతి కాలంలో కంపెనీ ఇందులో కస్టమర్లకు కొత్తదనాన్ని అందించడంలో విఫలమైంది. దాని బోరింగ్ డిజైన్ మరియు పాత కాలపు ఫీచర్లతో చిర్రెత్తిన కస్టమర్లకు ఆ ఎస్‌యూవీని కొనడం మానేశారు. దీంతో చేసేది లేక ఈ కంపెనీ భారతదేశంలో తట్టాబుట్టా సర్దేసి, తమ దేశానికి తిరిగి వెళ్లిపోయింది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

అయితే, హ్యుందాయ్ భారత మార్కెట్లో ఈ పరిస్థితులను బాగా అధ్యయనం చేసింది. కార్ల విషయంలో కస్టమర్ల పల్స్‌ను క్యాచ్ చేయడంలో ఈ కొరియన్ కార్ బ్రాండ్ సక్సెస్ అయింది. మారుతున్న కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా మరియు ఆటోమొబైల్ రంగంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని కస్టమర్లకు పరిచయం చేయడంలో హ్యుందాయ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. అందుకే, హ్యుందాయ్ అందించే కార్లు ఇతర బ్రాండ్ల మాదిరి చవకగా కాకుండా ప్రీమియంగా ఉంటాయి.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

హ్యుందాయ్ ప్రస్తుతం కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో వెన్యూ (Hyundai Venue) అనే కారును విక్రయిస్తోంది. అందరూ దీనిని మినీ-క్రెటాగా పిలుస్తుంటారు. హ్యుందాయ్ లైనప్‌లో వెన్యూ వచ్చి చేరిన తర్వాత కంపెనీ అమ్మకాలు భారీగా పెరిగాయి. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్మడవుతున్న టాప్ 10 కార్ల జాబితాలో హ్యుందాయ్ వెన్యూ క్రమంగా తన స్థానాన్ని నిలుపుకుంటూ వస్తోంది. హ్యుందాయ్ వెన్యూ తొలిసారిగా 2019లో భారత మార్కెట్లో విడుదలైంది. ప్రస్తుతం, భారత రోడ్లపై 2.50 లక్షలకు పైగా వెన్యూ కార్లు తిరుగుతున్నాయంటే, ఈ కారు ఎంతగా కస్టమర్లను ఆకర్షిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

హ్యుందాయ్ వెన్యూలో కొత్తదనం కోరుకునే కస్టమర్ల కోసం కంపెనీ గడచిన జూన్‌ నెలలో తమ సరికొత్త 2022 మోడల్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వెన్యూని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ అప్‌డేటెడ్ మోడల్ రిఫ్రెష్డ్ డిజైన్ మరియు కొత్త ఫీచర్లతో వచ్చింది. ఈ కొత్తదనానికి కొనసాగింపుగా హ్యుందాయ్ ఇప్పుడు తమ వెన్యూలో ఎన్-లైన్ (Hyundai Venue N-Line) అనే స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే వెన్యూ ఎన్-లైన్ నిజంగానే స్పెషల్‌గా ఉంటుందా? ఈ కారులోని స్పెషల్ ఫీచర్లు ఏంటి? ఇంజన్ పనితీరు కూడా స్పెషల్‌గా ఉంటుందా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను వెతికేందుకు మేము ఈ స్పెషల్ వెన్యూ ఎన్-లైన్ కారుని బెంగుళూరు రోడ్లపై స్పెషల్‌గా టెస్ట్ డ్రైవ్ చేశాము. మరి ఈ కారు స్పెషాలిటీని మీరు కూడా ఈ డీటేల్డ్ స్పెషల్ రివ్యూలో తెలుసుకుందురు రండి.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ : ఎక్స్టీరియర్స్

మీకు సాధారణ వెన్యూ కారుని చూసి బోర్ కొట్టినట్లయితే, ఈ స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ ఖచ్చితంగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. స్పోర్టీనెస్ కోరుకునే యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని హ్యుందాయ్ ఈ ప్రత్యేకమైన ఎన్-లైన్ వెన్యూ కారు ఎక్స్టీరియర్లను స్పోరీ రెడ్ ఎలిమెంట్స్‌తో గార్నిష్ చేసింది. ప్రస్తుతం, హ్యుందాయ్ మార్కెట్లో విక్రయిస్తున్న ఐ20 ఎన్-లైన్ మాదిరిగానే వెన్యూ ఎన్-లైన్ కూడా ప్రత్యేకమైన మోటార్‌స్పోర్ట్-ప్రేరేపిత డిజైన్‌తో కారు అంతటా స్పోర్టీ రైడ్ హైలైట్స్‌తో డిజైన్ చేయబడి ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

హ్యుందాయ్ వెన్యూ దాని మిడ్-లైఫ్ రిఫ్రెష్‌మెంట్‌లో భాగంగా కొత్త 'పారామెట్రిక్ జ్యువెల్' గ్రిల్, రివైజ్డ్ బంపర్‌లు, కొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ మరియు కనెక్ట్ చేయబడినట్లుగా ఉండే టెయిల్‌లైట్‌ల సెట్‌ని పొందింది. హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ లో స్పోర్టి డిజైన్‌ కోసం కంపెనీ డార్క్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, స్పోర్టీ టెయిల్‌గేట్ స్పాయిలర్, ఫ్రంట్ గ్రిల్‌పై ఎన్-లైన్ బ్యాడ్జ్, సైడ్ ఫెండర్లు మరియు టెయిల్‌గేట్ పై ఎన్ బ్రాండింగ్, కొత్త ఎన్-బ్రాండెడ్ 16 ఇంచ్ అల్లాయ్‌ వీల్స్ మొదలైన వాటిని ఉపయోగించింది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

స్టాండర్డ్ వెన్యూతో పోలిస్తే వెన్యూ ఎన్-లైన్‌ను బయటి నుండి ప్రత్యేకంగా కనిపించేలా చేసేందుకు కంపెనీ ఇందులోని వీల్స్, బంపర్స్, ఫెండర్‌లు, సైడ్ సిల్స్ మరియు రూఫ్ రైల్స్ పై అథ్లెటిక్ రెడ్ హైలైట్‌లు జోడించింది. కలర్ ఆప్షన్‌ల విషయానికి వస్తే, ఇది పోలార్ వైట్ మరియు షాడో గ్రే అనే రెండు మోనో టోన్‌లలో అలాగే, పోలార్ వైట్‌ విత్ ప్లాటినియం బ్లాక్ రూఫ్, పోలార్ వైట్ విత్ ఫాంటమ్ బ్లాక్ రూఫ్ మరియు థండర్ బ్లూ విత్ షాడో బ్లాక్ రూఫ్ అనే మూడు టూటోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ - ఇంటీరియర్స్

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ దాని ఎక్స్టీరియర్ మాదిరిగానే ఇంటీరియర్‌లో స్పోర్టీ థీమ్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు లోపలి భాగాలలో కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉన్నాయి. పూర్తి బ్లాక్ కలర్‌లో డిజైన్ చేయబడిన క్యాబిన్ లోపల కూడా అక్కడక్కడా రెడ్ హైలైట్స్ కనిపిస్తాయి. సీట్లు, స్టీరింగ్ వీల్, గేర్ నాబ్, ఏసి కంట్రోల్ డయల్స్ మరియు ఎయిర్ వెంట్లపై ఎరుపు రంగు హైలైట్‌లు ఉంటాయి. ఇందులోని స్టీరింగ్ వీల్ ఎన్-బ్రాండెడ్ లోగోను కలిగి ఉండి, దానిపై రెడ్ హైలైట్‌లు కాంట్రాస్ట్ స్టిచింగ్ రూపంలో ఉంటాయి.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

కారు లోపల సీట్లపై రెడ్ కలర్ పైపింగ్ మరియు రెడ్ కలర్ గీతతో పాటు నలుపు రంగులో N లోగో ఉంటుంది. వెన్యూ ఎన్-లైన్ లోపలి భాగంలో స్పోర్టీ థీమ్‌ను మరింత పెంచడానికి వీలుగా ఇందులో అల్యూమినియం పెడల్స్ మరియు రెడ్ కల్ర యాంబియెంట్ లైటింగ్ లను ఉపయోగించారు. హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ లోని 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటుగా హ్యుందాయ్ యొక్క బ్లూలింక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూలోని ఇతర ఫీచర్లలో డిజిటల్ డ్రైవర్స్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది మరియు కలర్ ఛేంజింగ్ డ్రైవింగ్ మోడ్ థీమ్‌లను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ మరియు ఎలక్ట్రికల్‌గా పనిచేసే సన్‌రూఫ్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి. కొత్తదనం కోరుకునే కస్టమర్లకు ఈ ఎస్‌యూవీలో తమ ప్రతి ప్రయాణాన్ని రికార్డ్ చేయాలనుకునే వారి కోసం కంపెనీ ఇందులో డ్యుయల్ కెమెరాలతో కూడిన డాష్‌క్యామ్ కూడా అందిస్తోంది. ఇందులో ఒక కెమెరా ఎదురుగా వెళ్తున్న మరియు వస్తున్న వాహనాల కదలికలను రికార్డ్ చేస్తుంది. మరొక కెమెరా క్యాబిన్ లోపల మీరు చేసే హడావిడిని కూడా రికార్డ్ చేస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ యొక్క సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేకులు, ఈబిడితో కూడిన ఏబిఎస్‌, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు మొదలైనవి ఉన్నాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే, హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ రెండు వేరియంట్లలో మాత్రమే విడుదలైంది. వీటిలో వెన్యూ ఎన్-లైన్ ఎన్6 మరియు ఎన్8 వేరియంట్లు ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ - స్పెసిఫికేషన్లు

స్టాండర్డ్ మోడల్ వెన్యూ మూడు ఇంజన్లు మరియు ఐదు గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. అయితే, హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ మాత్రం కేవలం 1.0-లీటర్ టర్బో జిడిఐ పెట్రోల్ ఇంజన్‌ మరియు 7-స్పీడ్ డిసిటి (డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో వేరే ఆప్షన్లు కావాలనుకుంటే, స్టాండర్డ్ మోడళ్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పి శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

వెన్యూ ఎన్-లైన్ కొలతలు స్టాండర్డ్ వెన్యూ మాదిరిగానే ఒకేలా ఉంటాయి. హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ మొత్తం పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,770 మిమీ మరియు ఎత్తు 1,617 మిమీ. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కేవలం 2,500 మిమీ వీల్‌బేస్‌ను మాత్రమే కలిగి ఉండి ఇరుకైన రోడ్లలో సైతం సులువుగా నడపడానికి వీలుగా ఉంటుంది. ఈ కారులో పెద్ద 45 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది. వెన్యూ క్యాబిన్ లోపల చిన్న వస్తువుల కోసం పుష్కలమైన స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. ఈ చిన్న కారులో 350 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంటుంది మరియు అవసరమైతే, అదనపు బూట్ స్పేస్ కోసం వెనుక సీట్లను మడచుకునే సౌలభ్యం కూడా ఉంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ - డ్రైవింగ్ ఇంప్రెషన్‌లు

గమనించాల్సిన విషయం ఏంటంటే, స్టాండర్డ్ హ్యుందాయ్ వెన్యూ టర్బో వేరియంట్ మరియు ఈ ప్రత్యేకమైన హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ రెండూ కూడా ఒకే రకమైన ఇంజన్‌ను కలిగి ఉన్నాయి మరియు ఆ ఇంజన్ పనితీరు గణాంకాలలో కూడా ఎలాంటి మార్పులు లేవు. కాబట్టి, ఈ రెండింటిలో దేనిని నడిపినప్పటికీ దాని పనితీరు మాత్రం ఒకేలా అనిపిస్తుంది. ఈ రెండు మోడళ్లలో ప్రధానమైన మార్పులు కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ రూపంలో మాత్రమే కనిపిస్తాయి. మిగతావన్నీ సేమ్ టూ సేమ్.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

ఇది 1.0 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అయినప్పటికీ దాని టర్బోటార్జర్ ఫీచర్ కారణంగా ఇది సిటీ రోడ్లపై చాలా చురుకుగా పరుగులు తీస్తుంది. ఇక హైవేపై దీని పనితీరుగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. వేగంగా ప్రతస్పందించే ఇంజన్ మరియు డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ కలయికతో వచ్చిన హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ నడపడానికి సరదాగా అనిపించే అద్భుతమైన స్పోర్టీ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ స్పెషల్ వేరియంట్లలో స్పెషల్‌గా ఏర్పాటు చేసిన ట్విన్ ఎగ్జాస్ట్ (రెండు సైలెన్సర్ల) కారణంగా ఇంజన్ పనితీరు స్వల్పంగా మెరుగుపడిందని చెప్పవచ్చు.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

వెన్యూ ఎన్-లైన్ మూడు విభిన్నమైన డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. వీటిలో ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి. డ్రైవర్ ఎంచుకునే ప్రతి మోడ్‌లో ఇంజన్ పనితీరు ఒక్కోలా ఉంటుంది. ఎకో మోడ్‌లో, గేర్‌బాక్స్ ముందుగానే మారుతుంది మరియు తక్కువ వేగంతో కూడా ఎక్కువ గేర్‌లో ఉండటానికి ఇష్టపడుతుంది. అయితే, ఈ మోడ్‌లో థ్రోటల్ రెస్పాన్స్ చాలా నెమ్మదిగా ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

నార్మల్ మోడ్ విషయానికి వస్తే, ఇందులో గేర్‌బాక్స్ గేర్‌లను కొంచెం ఎక్కువసేపు ఉంచుతుంది మరియు థ్రోటల్ పెడల్‌ను నొక్కినప్పుడు దాని రెస్పాన్స్ మరింత గుర్తించదగినదిగా ఉంటుంది కాబట్టి ఈ మోడ్ కొంచెం సున్నితంగా అనిపిస్తుంది. ఇక స్పోర్ట్ మోడ్ విషయానికి, వెన్యూ ఎన్-లైన్ యొక్క గేర్‌బాక్స్ ఇందులోని ఇంజన్ యొక్క పూర్తి పవర్‌ను గ్రహించడానికి ప్రయత్నిస్తుంది మరియు ఇందులో థ్రోటల్ రెస్పాన్స్ చాలా వేగంగా అనిపిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ యొక్క డ్రైవింగ్‌ అనుభూతిని మరింత సరదాగా మార్చడం కోసం ఇందులో ప్యాడిల్ షిఫ్టర్‌లు కూడా ఉంటాయి. వీటి సాయంతో గేర్‌లను మాన్యువల్‌గా మార్చడం ద్వారా వినోదభరితమైన డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు. డ్రైవింగ్ మోడ్‌లకు మారినప్పుడు స్టీరింగ్ వీల్‌ పనితీరు కూడా మారుతుంది. ఎకో మోడ్‌లో, స్టీరింగ్ వీల్ చాలా తేలికగా అనిపిస్తుంది, ఇది ట్రాఫిక్‌లో ప్రయాణించేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

అలాగే, స్పోర్ట్ మోడ్ స్టీరింగ్ కాస్తంత భారంగా అనిపిస్తుంది మరియు ఇది స్టార్ట్ / స్టాప్ ట్రాఫిక్‌కు అంత మంచిది కాకపోయినప్పటికీ, అధిక వేగంతో హైవే ప్రయాణిస్తున్న వారికి కాన్ఫిడెన్స్‌ను పెంచడంలో సహకరిస్తుంది. ఇక దీని సస్పెన్షన్ పనితీరు విషయానికి వస్తే, ఇది కాస్తంత గట్టిగా అనిపించినప్పటికీ, క్యాబిన్‌లో కుదుపులను తగ్గించడంలో హ్యుందాయ్ బాగానే కష్టపడిందని చెప్పాలి. అంతేకాకుండా, ఈ దృఢమైన సస్పెన్షన్ సెటప్ బాడీ రోల్ కనిష్టంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

బ్రేకింగ్ పనితీరు కూడా చాలా మెరుగ్గా ఉంది. మీరు వెన్యూ ఎన్-లైన్‌ను క్విక్ స్టాప్‌కి తీసుకువచ్చినప్పుడు మీరు ఇబ్బందుల్లో పడకుండా చూసుకోవడానికి, హ్యుందాయ్ ఈ ఎస్‌యూవీలోని అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను అమర్చింది. క్యాబిన్ లోపల బ్రేక్ పెడల్ తక్కువ ట్రావెల్‌ను కలిగి ఉండి, ఆపరేట్ చేయడానికి సులభంగా ఉంటాయి. ఓవరాల్‌గా ఈ స్పెషల్ ఎస్‌యూవీ తన స్పెషల్ డ్రైవింగ్ వైఖరితో కస్టమర్లను ఖచ్చితంగా ఆకట్టుకోగలదు.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్‌యూవీ నిజంగానే చాలా స్పెషల్..!

చివరిగా ఏం చెబుతారు..?

హ్యుందాయ్ వెన్యూలో కొత్తదనాన్ని కోరుకునే వారి కొత్త వెన్యూ ఎన్-లైన్ తప్పకుండా సంతృప్తి పరస్తుందని చెప్పవచ్చు. ప్రత్యేకించి, ఈ ధర వద్ద ఓ మంచి ఫన్ టూ డ్రైవ్ స్పోర్టీ ఎస్‌యూవీని కోరుకునే వారికి కొత్త వెన్యూ ఎన్-లైన్ ఖచ్చితంగా ఓ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవ్చచు. హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ N6 మరియు N8 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో, ఈ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ.12.16 లక్షలు మరియు రూ.13.15 లక్షలుగా ఉన్నాయి. ఆసక్తిగల కష్టమర్లు హ్యుందాయ్ డీలర్‌షిప్స్ లేదా వెబ్‌సైట్‌ను సందర్శించి రూ. 21,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించడం ద్వారా ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Hyundai venue n line test drive review design features specs and driving impressions
Story first published: Monday, September 19, 2022, 8:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X