మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

ప్రముఖ ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని 2020 లో హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. కానీ అప్పుడు భారత మార్కెట్లో విడుదల చేయలేదు. అయితే కంపెనీ ఇప్పుడు హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

ఈ సందర్భంగా ముంబైలోని లంబోర్ఘిని డీలర్‌షిప్‌ నుంచి మాకు ఆహ్వానం లభించింది. లబోర్గిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌ను ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం రూ. 3.54 కోట్లకు దేశీయ మార్కెట్లో విడుదల చేశారు. ఈ సూపర్ కార్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

డిజైన్ అండ్ స్టైల్:

లంబోర్ఘిని యొక్క హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ హురాకాన్ ప్రస్తుతమున్న లైఫ్ స్టైల్ కి తగిన విధంగా రూపొందించబడింది. ఈ కారు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది ముందు వైపు నుంచి ఆర్డబ్ల్యుడి కూపే మాదిరిగానే కనిపిస్తుంది. అంతే కాకుండా ఇది దాని సిగ్నేచర్ డిఆర్ఎల్ లతో లేజర్ ఎల్ఇడి హెడ్‌లైట్‌లను పొందుతుంది.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

ఈ కొత్త సూపర్ కార్ పెద్ద ఫ్రేమ్డ్ ఫ్రంట్ ఎయిర్ డ్యామ్‌లలో కొత్త ఫ్రంట్ స్ప్లిటర్ మరియు వర్టికల్ ఫిన్స్ పొందుతుంది. ఇది మరింత ఎయిర్ ఫ్లో మరియు మంచి ఏరోడైనమిక్ ని అనుమతిస్తుంది. ఇక్కడ చూస్తున్న కారు కస్టమర్‌కు చెందినది. దీనిని కొనుగోలు చేసిన కస్టమర్ బెస్పోక్ బ్లూ సైడెరిస్ పెయింట్ షేడ్ ఎంచుకున్నాడు.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌కు ఫైవ్ స్పోక్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అమర్చారు. బ్రేక్ కాలిపర్స్ రెడ్ షేడ్స్ లో పూర్తయ్యాయి. అంతే కాకూండా ఇది లార్జ్ పెటల్ డిస్కులను కలిగి ఉంటుంది. ఈ సూపర్ కార్ యొక్క డోర్స్ వెనుక ఇరువైపులా పెద్ద ఎయిర్ డక్ట్స్ కలిగి ఉంటుంది. ఈ కారులోని భారీ వి10 ఇంజిన్‌ చల్లగా ఉంచడానికి ఈ ఎయిర్ డక్ట్ సహాయపడుతుంది. ఈ ఎయిర్ డక్ట్స్ మీద ‘హురాకాన్ ఈవో ఆర్‌డబ్ల్యుడి' లోగోను కూడా ఉంది.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌ యొక్క రియర్ బంపర్ ఇప్పుడు ప్రత్యేకమైన కొత్త డిఫ్యూజర్‌ను కలిగి ఉంది. కొత్త సూపర్‌స్పోర్ట్ ఎగ్జాస్ట్ అద్భుతంగా కనిపించడమే కాకుండా చాలా మెరుగ్గా కూడా ఉంది. ఈ కారును అక్రపోవిక్ డెవలప్డ్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో అమర్చారు. ఇది చాలా తేలికైనదిగా ఉన్నప్పటికీ మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

హురాకాన్ స్పైడర్ యొక్క సాఫ్ట్-టాప్ రూప్ కేవలం 17 సెకన్ల లోపు ఓపెన్ చేయవచ్చు. దీనిని గంటకు 50 కిమీ వేగంతో డ్రైవింగ్ చేసేటప్పుడు ఆపరేట్ చేయవచ్చు. సాఫ్ట్-టాప్ ఓపెన్ చేసుకోవచ్చు లేకుంటే కిందికి ఉంటుంది. ఇది పైకి ఉన్నప్పుడు విండ్‌షీల్డ్ వలె పనిచేస్తుంది మరియు వి10 ఇంజిన్ యొక్క ప్రత్యేకమైన ధ్వనిని పెంచుతుంది.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌ కన్వర్టిబుల్ సూపర్ కార్ కాబట్టి, పైకప్పుకు ఎక్కువ స్పేస్ అవసరం కాబట్టి ఇక్కడ వి 10 ఇంజిన్ పూర్తిగా కనిపించదు. ఇంజిన్ కోసం కార్బన్ ఫైబర్ కవర్ కూడా ఎంచుకోవచ్చు. కవర్ ఓపెన్ చేసినప్పుడు ఇంజిన్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ యొక్క ఒక భాగాన్ని మాత్రమే చూడగలిగే అవకాశం ఉంటుంది.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

కాక్‌పిట్ మరియు ఇంటీరియర్స్:

లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌ యొక్క లోపలి భాగంలో 8.4-అంగుళాల హెచ్‌ఎంఐ టచ్‌స్క్రీన్‌ ఉంటుంది. ఇది టెలిఫోన్ కాల్స్, ఇంటర్నెట్ యాక్సెస్ మరియు ఆపిల్ కార్ప్లే వంటి కనెక్టివిటీని అందిస్తుంది. దాని పైన టోగుల్ స్విచ్‌లు కూడా ఉన్నాయి. మొత్తం సెటప్ విమానం యొక్క కాక్‌పిట్ నుండి తీసినట్లు అద్భుతంగా కనిపిస్తుంది.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

హురాకాన్ యొక్క సీట్లు బ్లాక్ కలర్ లో పూర్తయ్యాయి. అంతే కాకుండా కస్టమర్ కి కావలసిన స్టిచ్చింగ్ కలర్ కూడా ఇక్కడ మీరు ఎంచుకోవచ్చు. కొనుగోలుదారులు 300 వేర్వేరు కలర్స్ లో మీకు నచ్చిన ఎక్స్టీరియర్ కలర్ ఎంచుకోవచ్చు. ఈ కారు లోని స్టీరింగ్ వీల్, లెదర్ మరియు అల్కాంటారాలో చుట్టబడి ఉంటుంది. స్టీరింగ్ వీల్‌లో అనిమా బటన్‌ను ఉంటుంది. ఈ బటన్ డ్రైవింగ్ మోడ్‌లను కంట్రోల్ చేస్తుంది.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్:

లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ 5.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి 10 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 602 బిహెచ్‌పి మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 560 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 3.5 సెకన్లలో 0 నుండి 100 కి.మీ / గం వేగవంతం చేస్తుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 324 కి.మీ వేగంతో వెళుతుంది.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

స్పైడర్ కార్ అల్యూమినియం మరియు థర్మోప్లాస్టిక్ రెసిన్ బాడీ సైట్స్ అల్యూమినియం మరియు కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన లైట్స్ వెయిట్ హైబ్రిడ్ చాసిస్ మీద ఉంటుంది. దీని బరువు 1,509 కేజీల వరకు ఉంటుంది. శక్తి నుండి బరువు నిష్పత్తి, కిలోగ్రాముకు 0.39 బిహెచ్‌పి దాకా ఉంటుంది.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ దాని డ్రైవర్ నైపుణ్యాల ఆధారంగా దాని పనితీరును నిర్ధారిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా ట్యూన్ చేయబడిన పి-టిసిఎస్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్ని పరిస్థితులలోనూ మంచి పనితీరు కోసం రూపొందించబడింది. ఇది స్థిరమైన టార్క్ అందిస్తుంది.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

ఇందులో ఉన్న ‘స్ట్రాడా' మోడ్ అన్ని పరిస్థితులలో స్థిరత్వం మరియు భద్రతను అందిస్తుంది. కావున వెనుక-చక్రాల జారడం తగ్గిస్తుంది. ‘స్పోర్ట్' మోడ్ డ్రైవర్‌ డ్రిఫ్టింగ్ ను సరదాగా ఆస్వాదించడానికి అనుమతిస్తుంది. యాక్సిలరేషన్ మరియు డ్రిఫ్టింగ్ సమయంలో రియర్ వీల్ స్లిప్ మరియు స్లైడ్‌కు స్పోర్ట్ మోడ్ సహాయపడుతుంది. ఈ మోడ్‌లో టార్క్ పరిమితం కాబట్టి డ్రైవర్ కారును స్థిరీకరించవచ్చు మరియు కంట్రోల్ చేయవచ్చు.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

ఇందులోని కోర్సా మోడ్ మరింత పనితీరును అందిస్తుంది మరియు ఒక మూలలో నుండి నిష్క్రమించేటప్పుడు డైనమిక్స్ మరియు వేగాన్ని పెంచడం ద్వారా కారు యొక్క ట్రాక్షన్ మరియు చురుకైనదాన్ని పెంచుతుంది.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

ఈ కారు ముందు మరియు వెనుక భాగంలో 40/60 వైట్ డిస్ట్రిబ్యూషన్ పొందుతుంది. హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన పిరెల్లి పి జీరో టైర్లను పొందుతుంది. అయితే, కంపెనీ 20 ఇంచెస్ రిమ్స్ మరియు కార్బన్-సిరామిక్ బ్రేక్‌లను అప్షనల్ గా అందిస్తుంది.

మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌పై మా అభిప్రాయం:

లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లలో వెల్లడైంది. కానీ ఇప్పుడు కంపెనీ ఈ సూపర్ కార్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.మేము చూసిన కారు యజమాని తన కారును తనకు నచ్చిన విధంగా అనుకూలీకరించారు. ఈ లంబోర్ఘిని కారు యొక్క ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ మరియు బ్రేక్ కాలిపర్స్ సంబంధించి ఏ కలర్ ఎంచుకున్నా అద్భుతంగా ఉంటుంది, దీనిపై ఎటువంటి సందేహం లేదు.

Most Read Articles

English summary
Lamborghini Huracan Evo RWD Spyder First Look Review. Read in Telugu.
Story first published: Tuesday, June 8, 2021, 9:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X