గ్రాండ్ ఎంట్రీకి సిద్దమవుతున్న 'మారుతి సుజుకి గ్రాండ్ విటారా' రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్

భారతీయ మార్కెట్లో కొత్త వాహనాలకు రోజురోజుకి క్రేజ్ బలే పెరిగిపోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి ఆధునిక ఉత్పతులను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కార్ బ్రాండ్ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) తన పాపులర్ SUV 'గ్రాండ్ వితారా' ని కొత్త హంగులతో మార్కెట్లో ఆవిష్కరించింది, ఇక త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

Recommended Video

Maruti Grand Vitara బుకింగ్స్ | వివరాలు

నిజానికి మారుతి సుజుకి 2009 లో తన గ్రాండ్ విటారాను తీసుకురావడంతో మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందింది. అయితే ఇప్పుడు మరింత ఆధునిక డిజైన్ మరియు ఫీచర్స్ తో త్వరలోనే దేశీయ విఫణిలోకి విడుదలకానుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా దేశీయ మార్కెట్లో విడుదల కాకముందే మేము ఈ SUV ని టెస్ట్ డ్రైవ్ చేసాము. కావున ఈ కొత్త SUV యొక్క డిజైన్ ఎలా ఉంది, అప్డేటెడ్ ఫీచర్స్ ఏమిటి మరియు ఇంజిన్ పనితీరు ఎలా ఉంది అనే మరిన్ని విషయాలు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

మారుతి సుజుకి గ్రాండ్ విటారా - డిజైన్

మారుతి సుజుకి తన కొత్త గ్రాండ్ విటారాను కంపెనీ మునుపటి మోడల్స్ కంటే కూడా భిన్నంగా రూపొందించింది. కావున ఇది ఇప్పుడు చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

కొత్త మారుతి గ్రాండ్ విటారా ముందుభాగంలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు కొంత తక్కువ భాగంలో విస్తరించి ఉన్నాయి. అయితే ఫ్రంట్ బంపర్ దిగువ భాగంలో చిన్న ఎయిర్ ఇన్‌టేక్‌ కూడా అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ క్రోమ్ కలిగి ఉంటుంది, ఫ్రంట్ బంపర్ లో మీకు చాలా ఆకర్షణీయమైన పెద్ద బ్రాండ్ లోగో కూడా లభిస్తుంది, దీనికి ఇరువైపులా క్రోమ్ కూడా లభిస్తుంది. అదే సమయంలో ఫ్రంట్ బంపర్ అంచులలో బ్లాక్ క్లాడింగ్ కనిపిస్తుంది, ఇది ఈ SUV యొక్క వెనుక బంపర్ వరకు కొనసాగుతుంది, అక్కడ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఎలిమెంట్‌తో కలిసిపోతాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ 17 ఇంచెస్ డ్యూయల్-టోన్ ప్రెసిషన్-కట్ అల్లాయ్ వీల్స్‌ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అదే సమయంలో కొత్త గ్రాండ్ విటారా యొక్క సిగ్మా & డెల్టా వెర్షన్‌లు ఫుల్ వీల్ క్యాప్‌లతో 17 ఇంచెస్ స్టీల్ వీల్స్‌ పొందుతాయి. మొత్తం మీద సైడ్ ప్రొఫైల్ లో చంకీ వీల్ ఆర్చ్‌లు మరియు బ్లాక్ సి పిల్లర్‌ వంటవి లభిస్తాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రియర్ ప్రొఫైల్ లో స్ప్లిట్ లైటింగ్ సెటప్‌ చూడవచ్చు. దేనికి కింది భాగంలో మధ్యలో సుజుకి లోగోకు కనెక్ట్ చేయబడిన LED బ్రేక్ లైట్లు ఉన్నాయి. దానికి మద్య భాగంలోనే 'గ్రాండ్ విటారా' బ్యాడ్జింగ్‌ స్పష్టంగా కనిపిస్తుంది. వీటితోపాటు కింది భాగంలో నిలువుగా ఇరువైపులా పేర్చబడిన లైటింగ్ సెటప్ చూడవచ్చు. మొత్తం మీద గ్రాండ్ విటారా మంచి డిజైన్ పొందుతుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

మారుతి సుజుకి గ్రాండ్ విటారా - ఇంటీరియర్స్

మారుతి సుజుకి గ్రాండ్ విటారా మంచి డిజైన్ కలిగి ఉండటమే కాదు, మంచి ఇంటీరియర్ డిజైన్ కూడా పొందుతుంది. అయితే కస్టమర్ ఎంచుకునే పవర్‌ట్రెయిన్ ఆప్సన్ ఆధారంగా రెండు కలర్ థీమ్స్ లో పొందవచ్చు.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

ఇందులో మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కలిగిన గ్రాండ్ విటారా సిల్వర్ యాక్సెంట్‌లతో బ్లాక్ అండ్ బోర్డియక్స్ థీమ్ లో లభిస్తుంది. అయితే స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ఎంచుకునే కస్టమర్లు షాంపైన్ గోల్డ్ యాక్సెంట్‌లతో కూడిన ఆల్ బ్లాక్ ఇంటీరియర్‌ను పొందుతారు. ఈ రెండు కలర్ ఆప్సన్ కూడా చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా క్యాబిన్‌ చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా, మల్టీ-లేయర్ డాష్‌తో ఎక్కువ భాగాల్లో సాఫ్ట్ టచ్ మెటీరియల్‌లను పొందుతుంది. కావున ఇది చాలా ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. అదే సమయంలో ఇందులో ఉపయోగించిన హార్డ్ ప్లాస్టిక్‌ క్వాలిటీ కూడా చాలా మెరుగ్గా ఉంటుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

గ్రాండ్ విటారాలోని వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు సమ్మర్‌లో మరింత క్రేజ్ అందిస్తాయి. అదే సమయంలో ఫాక్స్ లెదర్ అపోల్స్ట్రే మరింత ప్రీమియం కనిపించడమే కాకుండా, ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఇందులోని డాష్‌బోర్డ్ మధ్యలో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది వైర్‌లెస్‌ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా 'సుజుకి కనెక్ట్' యాప్ ద్వారా వినియోగదారులు 40 కి పైగా కార్ ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కింద భాగంలో హీటింగ్ వెంటిలేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ (HVAC) సిస్టం, 12వి సాకేట్, USB పోర్ట్స్ మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా మీరు ఎంచుకునే మోడల్ ఆధారంగా మీరు ఆల్ వీల్ డ్రైవ్ కోసం రోటరీ డ్రైవ్ మోడ్ సెలెక్టర్ లేదా కొత్త విటారా గేర్‌బాక్స్ లభిస్తుంది, దాని పక్కనే స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ కోసం బటన్‌లను కూడా పొందుతారు.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

కొత్త గ్రాండ్ విటారాలో పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, హెడ్స్ అప్ డిస్‌ప్లే మరియు 360-డిగ్రీ కెమెరా వాటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

గ్రాండ్ విటారా SUV లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ హోల్డ్ అసిస్ట్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

మారుతి సుజుకి గ్రాండ్ విటారా - స్పెక్స్ & డైమెన్షన్స్

కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా రెండు పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి మైల్డ్ హైబ్రిడ్ 1.-5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, మరొకటి స్ట్రాంగ్ హైబ్రిడ్ 1.5-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

ఇందులోని మొదటి 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ విషయానికి వస్తే, ఇది మారుతి బ్రెజ్జా వంటి కార్లలో కూడా కనిపిస్తుంది. ఈ ఇంజిన్ 101.1 బిహెచ్‌పి పవర్ మరియు 117 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ లేదా సుజుకి ఆల్-గ్రిప్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో జత చేయగల 5-స్పీడ్ మాన్యువల్ ఆప్సన్స్ పొందుతుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

మైలేజ్ విషయానికి వస్తే ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ మ్యాన్యువల్ ఆప్సన్ లో అలా లీటరుకు 21.1కిమీ మైలేజ్ అందిస్తుంది. అదే సమయంలో ఆల్ వీల్ డ్రైవ్ మాన్యువల్ ఒక లీటరుకు 19.38 కిమీ మైలేజ్ మరియు ఆటోమేటిక్ వెర్షన్ ఒక లీటరుకు 20.58 కిమీ మైలేజ్ అందిస్తుందని ARAI చేత ద్రువీకరించబడింది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

స్ట్రాంగ్ హైబ్రిడ్ 1.5-లీటర్ 3-సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇంజన్ 91.1 బిహెచ్‌పి పవర్ మరియు 122 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో మోటార్ 79 బిహెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. అయితే కంబైన్డ్ సిస్టమ్ పవర్ 114 బిహెచ్‌పి వరకు పరిమితం చేయబడింది. ఇది 27.97కిమీ/లీ (ARAI) మైలేజిని అందిస్తుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

కొత్త గ్రాండ్ విటారా మంచి పరిమాణంలో ఉంటూ వాన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కావున ఈ కొత్త SUV యొక్క కొలతల విషయానికి వస్తే, పొడవు 4,345 మిమీ, వెడల్పు 1,795 మిమీ, ఎత్తు 1,645 మిమీ మరియు వీల్‌బేస్ 2,600 మిమీ వరకు ఉంటుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

మారుతి సుజుకి గ్రాండ్ విటారా - డ్రైవింగ్ ఇంప్రెషన్స్

డిజైన్, ఫీచర్స్ గురించి తెలుసుకున్నాము, ఇప్పుడు గ్రాండ్ విటారా యొక్క డ్రైవింగ్ ఇంప్రెషన్స్ గురించి తెలుసుకునే సమయం వచ్చేసింది.

నిజానికి స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్ టయోటా హైరిడర్‌లో కనిపించింది. అయితే ఇప్పుడు మన గ్రాండ్ విటారాలో కూడా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్సన్ ఉంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది. నార్మల్ మరియు ఎకో మోడ్ లో కొంత లేజీ త్రాటల్ రెస్పాన్స్ చూడవచ్చు. అయితే పవర్ మోడ్ లో రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ యొక్క బానెట్ కింద ఉన్న K15C ఇంజన్ మారుతి లైనప్‌లోని ఇతర కార్ల మాదిరిగానే అదే మైలేజ్ అబ్సెసివ్ ట్యూన్‌ను కలిగి ఉంది. మీరు సుజుకి యొక్క ఆల్-గ్రిప్ ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌తో గ్రాండ్ విటారాను ఎంచుకున్నట్లయితే, పవర్ సజావుగా ముందుకు సాగుతుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

ఆల్-గ్రిప్ సెటప్ కోసం ఇందులో స్నో, ఆటో లాక్ మరియు స్పోర్ట్ అనే నాలుగు మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. స్నో మోడ్ తక్కువ గ్రిప్ ఉపరితలాల కోసం ఉద్దేశించబడింది. కావున ఈ మోడ్ లో విటారా మంచి పనితీరుని అందిస్తుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

మీకు మరింత ఉత్సాహమైన డ్రైవింగ్ అనుభూతి కావాలనుకుంటే అది స్పోర్ట్స్ మోడ్ లో సాధ్యమవుతుంది. ఇందులో మెరుగైన యాక్సలరేషన్ మరియు మంచి త్రాటల్ రెస్పాన్స్ వంటివి పొందుతారు. ఈ మోడ్ లో మీరు తప్పకుండా మంచి డ్రైవింగ్ ఫీల్ పొందుతారు.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

ఆటో మోడ్ అనేది ఎక్కువగా టూ-వీల్ డ్రైవ్ సెటప్, కానీ ముందువైపు గ్రిప్ లెవెల్స్ ఊహించిన దాని కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పవర్ వెనుక చక్రాలకు పంపబడుతుంది. ఆల్-గ్రిప్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా లాక్ మోడ్ నిర్ధారిస్తుంది మరియు ముందు మరియు వెనుక యాక్సెల్ మధ్య పవర్ సమానంగా పంపబడుతుంది. ఈ మోడ్ లో కూడా మేము టెస్ట్ చేసాము. గ్రాండ్ విటారా ఈ మోడ్ లో కూడా ఎలాంటి సమస్యలకు లోను కాకుండా బురదలో కూడా ముందుకు వెళ్లగలిగింది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

కొత్త మారుతి గ్రాండ్ విటారాలో సస్పెన్షన్ సెటప్ చాలా అద్భుతంగా ఉంది. కావున ఎలాంటి రోడ్డులో అయినా డ్రైవింగ్ చేయడానికి గ్రాండ్ విటారాను అనుమతిస్తుంది. స్మూత్ గా ఉండే రోడ్లమీద గానీ, బంప్స్ మరియు ఇతర ఎగుడుదిగుడు రోడ్లపైన కూడా సజావుగా ముందుకు వెళుతుంది. ఇందులో బ్రేకింగ్ సెటప్ కూడా చాలా అద్భుతంగా ఉంది, అయితే స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌తో రీజెన్ బ్రేకింగ్ అందుబాటులో ఉంటుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ.. లేటెస్ట్ డిజైన్ & అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా ఎన్నో..

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి సుజుకి తన కొత్త 'గ్రాండ్ విటారా' ను దేశీయ మార్కెట్లో ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. అయితే ఇప్పటికే విపరీతమైన బుకింగ్స్ పొందుతూ ప్రస్తుతం మార్కెట్లో యమా క్రేజుని సొంతం చేసుకుంది. ఈ SUV మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ మరియు అద్భుతమైన ఇంజిన్ పర్ఫామెన్స్ కలిగి ఉంది. కావున మార్కెట్లో తప్పకుండా ఒక సక్సెస్ మోడల్ అయ్యే అవకాశం ఉంది. ఈ SUV గురించి దాదాపు మొత్తం వివరాలు తెలిసిపోయాయి, ఇక కేవలం ధర మాత్రమే తెలియాల్సి ఉంది. అయితే గ్రాండ్ విటారా ధరలు త్వరలోనే వెల్లడవుతాయి, కావున గ్రాండ్ విటారా ధరలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Maruti suzuki grand vitara review design features engine performace and driving impressions
Story first published: Sunday, September 18, 2022, 10:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X