రెనో క్విడ్ ఏఎమ్‌టి Vs మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి: పోలిక

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఏఎమ్‌టి మరియు రెనో క్విడ్ ఏఎమ్‌టి వేరియంట్ల పోలిక ద్వారా డిజైన్, సాంకేతిక వివరాలు, ఫీచర్లు, భద్రత, మైలేజ్ ధర వంటి వివరాలు కంపారిజన్‌తో పాటు విలువైన తీర్పు కోసం...

By Anil

మారుతి సుజుకి 1999 డిసెంబర్‌లో తమ వ్యాగన్ ఆర్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లో విపణిలోకి విడుదలయ్యే ప్రతి కారుకు సవాళ్లు విసురుతూ వరుసగా 17 ఏళ్ల పాటు భారీ అమ్మకాలను సాధిస్తోంది.

రెనో క్విడ్ ఏఎమ్‌టి Vs మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి

తాజాగ రెనో ఇండియా క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్‌ను మార్కెట్లోకి పరిచయం చేసింది. ఇది 17 ఏళ్ల పాటు అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉన్న వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్ మీద పోటీని సృష్టిస్తుందా..? అధిక మొత్తంలో వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్ వేరియంట్‌ను ఎంచుకుంటున్న ఇండియన్స్ స్వీకరిస్తారా లేదా ? ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం రండి...

ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) ఎలా పనిచేస్తుంది:

ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) ఎలా పనిచేస్తుంది:

ఏఎమ్‌టి అనేది సింపుల్ ఎలక్ట్రో హైడ్రాలిక్ సిస్టమ్. ఎలక్ట్రానిక్ యూనిట్ మరియు హైడ్రాలిక్ సిస్టమ్ డ్రైవర్ క్లచ్ వినియోగించకుండానే గేర్ మార్పిడి చర్యకు కారణమవుతాయి. ఈ మొత్తం వ్యవస్థను ఏఎమ్‌టి అంటారు.

డిజైన్

డిజైన్

రెనో ఇండియా తాజాగ అందుబాటులోకి తెచ్చిన క్విడ్‌ను కొలతల పరంగా వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్‌తో పోల్చితే 80ఎమ్ఎమ్ పొడవైనది, 84ఎమ్ఎమ్ వెడల్పైనది, 22 ఎమ్ఎమ్ పొడవైన వీల్ బేస్ మరియు 15ఎమ్ఎమ్ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. అయితే పొడవైన వ్యక్తులు క్విడ్‌లో కన్నా వ్యాగన్ ఆర్ లో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

రెనో క్విడ్ ఏఎమ్‌టి Vs మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి

కొలతల పరంగా చూస్తే రెనో క్విడ్ అన్నింటిలో వ్యాగన్ ఆర్ కన్నా ఎక్కువగానే ఉంది అయితే క్యాబిన్ స్పేస్ పరంగా వ్యాగన్ ఆర్ ఉత్తమం అని స్పష్టంగా తెలుస్తుంది. వెనుక సీటులో ముగ్గురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించే వెసులుబాటు, ఉత్తమ లెగ్ రూమ్, సౌకర్యవంతమైన ప్రయాణం, ఇండియన్ రోడ్ల మీద తిరిగే కార్లకు ఉండాల్సిన గ్రౌండ్ క్లియరెన్స్ మరియు వీల్ బేస్ పరంగా రెనో క్విడ్ బెస్ట్ అనొచ్చు.

రెనో క్విడ్ ఏఎమ్‌టి Vs మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి

రెండు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్ల ముందు వైపున్న డిజైన్ పరంగా చూస్తే రెనో క్విడ్ కాస్త కండలు తిరిగిన దేహంతో ఎస్‌యువి రూపంలో ఉంటుంది. మరియు ప్రక్కవైపుల డోర్ల మీద ఉన్న ప్లాస్టిక్ క్లాడింగ్, వీల్ ఆర్చ్‌లు దీనిని చిన్న ఎస్‌యువి క్రిందకు నెట్టేసాయి.

రెనో క్విడ్ ఏఎమ్‌టి Vs మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి

మారుతి వ్యాగన్ ఆర్ ఏ విధమైన అనవసరపు సొబగులు లేకుండా పొడవుగా గదిని తలపించే బాడీతో ఉంటుంది. ముందు మరియు ప్రక్కవైపున ఏ విధమైన డిజైన్ కర్వ్‌లు లేవు. అయినప్పటికీ ఇండియ్ మార్కెట్లో మంచి విజయం సాధించిన ప్రయోగాత్మక ఉత్పత్తిలా ఉంటుంది. అయితే క్విడ్ లో కూడా ఇదే తరహా సౌకర్యంతో పాటు కాసిన్ని ఎస్‌యువి డిజైన్ లక్షణాలు ఉన్నాయి.

డిజైన్ పరంగా రెండు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల రేటింగ్

డిజైన్ పరంగా రెండు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల రేటింగ్

  • రెనో క్విడ్ ఆటోమేటిక్ 9/10
  • మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్ 7.5/10
  • ఇంజన్ స్పెసిఫికేషన్స్

    ఇంజన్ స్పెసిఫికేషన్స్

    రెనో క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్ 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న ఎస్‌సిఇ (స్మార్ట్ కంట్రోల్ ఎఫిషియన్సీ) నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేయును.

    ట్రాన్స్‌మిషన్ వివరాలు

    ట్రాన్స్‌మిషన్ వివరాలు

    దీనికి రెనో 5-స్పీడ్ ఈజీ-ఆర్ రోటరీ నాట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసింది. దీనినే రెనో ఏఎమ్‌టి టెక్నాలజీ అంటాము.

    వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి ఇంజన్ స్పెసిఫికేషన్స్

    వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి ఇంజన్ స్పెసిఫికేషన్స్

    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్ వేరియంట్లో 998సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

    రెనో క్విడ్ ఏఎమ్‌టి Vs మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి

    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ లోని ఇంజన్ 5-స్పీడ్ ఆటో గేర్ షిఫ్ట్ పరిజ్ఞానం గల ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేసింది. క్విడ్ ఏఎమ్‌టిలోని ట్రాన్స్‌మిషన్ వ్యాగన్ ఆర్ తో పోల్చుకుంటే కాస్త వేగంగా స్పందిస్తుంది.

    రెనో క్విడ్ ఏఎమ్‌టి Vs మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి

    ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కార్లన్నింటితో పోల్చితే రెనో తమ క్విడ్‌లో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. గేర్‌నాబ్‌ను పూర్తిగా తొలగించి రౌండ్‌గా తిరిగే రోటరీ గేర్ నాబ్‌ను అందించింది. వీటిని సాధారణంగా జాగ్వార్, ఆడి వంటి లగ్జరీ ఉత్పత్తుల్లో మాత్రమే గుర్తించగలం.

    సాంకేతిక వివరాల పరంగా పూర్తి స్థాయి రేటింగ్

    సాంకేతిక వివరాల పరంగా పూర్తి స్థాయి రేటింగ్

    • రెనో క్విడ్ ఆటోమేటిక్ 8.5/10
    • మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 8/10
    • మైలేజ్

      మైలేజ్

      మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఆటోమేటి లీటర్‌కు 20.5 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు (మారుతి కథనం ప్రకారం). రెనో క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్ లీటర్‌కు సుమారుగా 21 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.

      రెనో క్విడ్ ఆటోమేటిక్ లోని ఫీచర్లు

      రెనో క్విడ్ ఆటోమేటిక్ లోని ఫీచర్లు

      మ్యాన్యువల్ వేరియంట్‌లోని అన్ని ఫీచర్లు రెనో క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్ లో ఉన్నాయి. రెనో ఈ క్విడ్ ఆటోమేటిక్ వెర్షన్‌ను క్విడ్ శ్రేణిలో ఉన్న టాప్ ఎండ్ వేరియంట్, ఆర్ఎక్స్‌టి(ఒ) లో పరిచయం చేసింది.

      రెనో క్విడ్ ఏఎమ్‌టి Vs మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి

      మారుతి వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్ విషయానికి వస్తే క్విడ్ కన్నా రెండు అదనపు ఫీచర్లను కలిగి ఉంది. సౌకర్యవంతంగా డోర్ల మీదున్న అద్దాలను వినియోగించుకునేందుకు పవర్ విండో ఆప్షన్, ఎలక్ట్రిక్ ద్వారా అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లను అడ్జెస్ట్ చేసుకునే వెసులు బాటు కల్పించారు.

      రెనో క్విడ్ ఏఎమ్‌టి Vs మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి

      మారుతి వ్యాగన్ ఆర్ పైపై మెరుగులతో మురిపించినప్పటికీ క్విడ్ లో అత్యంత విప్లవం సృష్టించిన తాకే తెర గల మీడియా శాటిలైట్ న్యావిగేషన్ సిస్టమ్ కలదు. నాలుగు డోర్లకు పవర్ విండోలు, ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ అద్దాలు మరియు అదనపు స్టోరేజ్ సామర్థ్యం ఉంది.

      ఫీచర్ల పరంగా రేటింగ్

      • రెనో క్విడ్ ఆటోమేటిక్ 8.5/10
      • మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్ 8/10
      • భద్రత

        భద్రత

        క్విడ్ లో భద్రత పరంగా అతి ముఖ్యమైన ఫీచర్లను అందించడంలో రెనో కాస్త వెనకడుగు వేసింది. డ్రైవర్ మరియు కొ-డ్రైవర్‌కు ఎయిర్ బ్యాగులను అందివ్వలేకపోయింది. అయితే మారుతి సుజుకి తమ వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్ వేరియంట్లో ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగులను, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు కొల్లాప్సిబుల్ స్టీరింగ్ అందించింది.

        భద్రత పరంగా రెండు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల రేటింగ్

        భద్రత పరంగా రెండు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల రేటింగ్

        • రెనో క్విడ్ ఆటోమేటిక్ 8/10
        • మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్ 8.5/10
        • ధర వివరాలు

          ధర వివరాలు

          రెనో క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్ ధర సుమారుగా రూ. 4.3 నుండి 4.5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మారుతి సుజుకి లోని వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్ మెటాలిక్ వేరియంట్ ధర రూ. 5.19 లక్షలు మరియు నాన్ మెటాలిక్ ధర రూ. 5.15 లక్షలు. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.

          తీర్పు

          తీర్పు

          రెనో క్విడ్ కొన్ని అద్బుతమైన ఫీచర్లతో కాస్త తక్కువ ధర శ్రేణితో వ్యాగన్ ఆర్ కన్నా ముందంజలో ఉంది. డిజైన్, ధర, ఫీచర్లు వంటి అంశాల పరంగా మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్ వేరియంట్ క్విడ్ ఆటోమేటిక్ నుండి గట్టి పోటీని ఎదుర్కుంటోంది.

          రెనో క్విడ్ ఏఎమ్‌టి Vs మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి

          భద్రత అంశాల పరంగా క్విడ్ తో పోల్చుకుంటే వ్యాగన్ ఆర్ ఏఎమ్‌టి ఉత్తమమైనదే. మార్కెట్లో మరింత విజయాన్ని చేజిక్కించుకోవడానికి రెనో తమ క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్లో ఆప్షనల్‌గా అయినా కనీస భధ్రత ఫీచర్లను అందించాల్సి ఉంటుంది.

          రెనో క్విడ్ ఏఎమ్‌టి Vs మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి

Most Read Articles

English summary
Read In Telugu: Renault Kwid AMT vs Maruti Wagon R AMT — Who Takes The Lead?
Story first published: Friday, November 11, 2016, 12:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X