రెనో క్విడ్ వర్సెస్ మారుతి ఆల్టో 800: వీటిలో ఏది అతి ఉత్తమమైన కారు ?

By Anil

ప్రస్తుతం కాలంలో కారు కొనడం ఎంతో సులభమైపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉద్యోగం చేస్తున్నారు అంతే కాకుండా బ్యాంకు వారు కుడా వీరికి కారు లోన్ అందివ్వడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో కారు ఒక నిత్యావసర వస్తువైపోయిందని చెప్పవచ్చు.

భారతదేశంలో ప్రవేశ స్థాయిలో గల కార్లలో ముందు వరుసలో ఉంది మారుతి ఆల్టో 800, అమ్మకాల పరంగా కూడా మారుతి ఆల్టోదే పై చేయి చాలా కాలం వరకు కూడా ఇదే దోరణి కొనసాగుతూ వస్తోంది. దీనిని కారణంగా మారుతి ఇతర మోడల్ అయిన స్విఫ్ట్ డిజైర్ ప్రభావం మార్కెట్లో తగ్గపోయినప్పటికి తిరిగి పుజుకుంది. అయితే మారుతి ఆల్టో ఎప్పుడూ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ వచ్చింది. ఆ గుర్తింపు ఇపుడు దానిని మొదటి స్థానంలో ఉంచింది.

అయితే ఈ మధ్యనే భారత మార్కెట్లోకి వచ్చి చేరిన అతి చిన్న కారు రెనో క్విడ్. రెనో ఇపుడు తీసుకువచ్చింది సరసమైన ధరకు అతి పెద్ద ప్యాకేజి గల క్విడ్. క్విడ్ మారుతి కన్నా చాలా ఉత్తమమైనదని, ఇది మీ మనస్సును దోచుకుంటుందని ఈ కంపెని ప్రతినిధులు పేర్కొన్నారు

మరి ఈ రెనో క్విడ్ మీ మనసును దోచుకుంటుందో లేదో చూడాలంటే, ఈ రెండు కార్ల యొక్క ధర, ఫీచర్స్, డిజైన్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ మరియు భద్రత వంటి ఎన్నో అంశాలను గమనించాల్సిందే. అయితే పదండి ముందుకు..........
ఇక్కడ క్లిక్ చేయండి:యుఎమ్ మోటర్ సైకిల్స్ నుండి కొత్త క్రూజర్ బైక్
దీనికి సంభందించిన మరింత సమాచారం కోసం ఇక్కడ గల స్లైడ్స్‌ని క్లిక్ చేయండి.

ధర:

ధర:

ఈ మధ్యనే విడుదలైన రెనో క్విడ్ ధర 3 నుండి 4 లక్షల మధ్య ఉంది, మారుతి ఆల్టో 800 యొక్క రిటైల్ వ్యాపారంలో మొదటి శ్రేణి ధర 2.53 లక్షలు మరియు దీని యొక్క టాప్ ఎండ్ మోడల్ ధర 3.69 లక్షలుగా ఉంది.

డిజైన్:

డిజైన్:

రెనో క్విడ్:

డిజైన్ పరంగా రెనో క్విడ్ ముందు భాగాన బోల్డ్‌గా ఉంటుంది. ఒక కస్టమర్ డిజైన్ పరంగా కోరుకునేది ఏంటి, ముందు మరియు వెనుకవైపు ఒక నూతనమైన స్టైల్ మరియు అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఈ లక్షణాలు క్విడ్‌లో ఉన్నాయి. ఒక విధంగా చూస్తే క్విడ్‌ని యస్.యు.వి యొక్క బిడ్డ అని చెప్పవచ్చు ఎందుకంటే దీనికి కూడా యస్.యు.వి కు గల బోల్డ్ హెడ్‌లైట్స్ మరియు ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కలదు.

ఆల్టో 800 డిజైన్:

ఆల్టో 800 డిజైన్:

ఆల్టో కారు యొక్క డిజైన్ ఇప్పుడు అన్ని వైపులా ఉంది. కారుకు ఇరువైపులా ఆకాశంలో గల ఒక సుందరమైన ఆకృతిని సృష్టించారు మరియు విండోలో గల ఏటవాలు అలలు ఎంతో అందంగా ఉంటాయి. అంతేకాకుండా మారుతి సుజుకి ఫ్రంట్ వేవ్ డిజైన్ కూడా కలిగి ఉంది.

ఫీచర్స్:

ఫీచర్స్:

రెనో క్విడ్:

రెనో క్విడ్, 2-డి.ఐ.ఎన్ ఆడియో సిస్టమ్ బ్లూటూత్ తో, పవర్ విండోస్ మీడియా న్యావిగేషన్, ఏడు అంగుళాల తాకే తెర, 13 అంగుళాల వీల్స్ మరియు 180 ఎమ్.ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ వంటి మరిన్ని ఫీచర్స్ ఎన్నో ఇందులో ఉన్నాయి.

ఆల్టో 800:

ఆల్టో 800:

ఆల్టో 800 ని రెనో క్విడ్‌తో పోలిస్తే అతి తక్కువ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కేవలం ఆడియో సిస్టమ్ విత్ యు.యస్.బి మరియు ఏ.యు.ఎక్స్ కనెక్టివిటి, ఫ్యాబ్రిక్ సీట్లు మరియు పవర్ స్టీరింగ్ మాత్రమే ఉన్నాయి.

ఇంజిన్ స్పెసిఫికేషన్స్:

ఇంజిన్ స్పెసిఫికేషన్స్:

రెనో క్విడ్:

ఇంజిన్: 800సీసీ

సిలిండర్ల సంఖ్య: 3-సిలిండర్లు

ఇంధన రకము: పెట్రోల్

పవర్: 57 బి.హెచ్.పి

ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్

ఆల్టో 800:

ఆల్టో 800:

ఇంజిన్: 796సీసీ

సిలిండర్ల సంఖ్య: 3-సిలిండర్లు

ఇంధన రకము: పెట్రోల్

పవర్: 47 బి.హెచ్.పి

ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్

మైలేజి:

మైలేజి:

క్విడ్ శ్రేణిలో 25 కె.పి.యల్ అతి ఉత్తమమైన మైలేజ్‌ని ఇస్తుంది. మరియు ఆల్టో 800 యొక్క ఫ్యూయెల్ ఎఫిషియన్సి 21.38 కె.పి.యల్ ని ఇస్తుంది.

భధ్రత:

భధ్రత:

ప్రవేశ స్థాయిలో ఏ ఒక్క కారుకు కూడా టాప్ ఎండ్ సేఫ్టి ఫీచర్ లేదు. క్విడ్ మరియు ఆల్టో 800 రెండింటికి డ్రైవర్ వైపున మాత్రమే ఎయిర్ బ్యాగ్‌లను ఆప్షనల్ గా ఇచ్చారు. అయితే భధ్రత పరంగా వీటి మధ్య ఏవిధమైన వ్యత్యాసం లేదు అని చెప్పవచ్చు.

తీర్పు:

తీర్పు:

రెనో క్విడ్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అంతే కాదండోయ్ ఇందులో చాలా ఫీచర్‌లు ఉన్నాయి దీని యొక్క అద్వితీయమైన ఇంజిన్ మీకు ఇస్తుంది అదిక మైలేజ్. అయితే మారుతి సుజుకి ఆల్టో 800 కారు క్విడ్ నుండి చాలా పోటీనే ఎదర్కుంటోంది. కాని మారుతి సుజుకి తమ యొక్క వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఉత్తమమైన సర్వీసులను ఉచితంగా అందిస్తోంది. మీ అభిరుచికి తగిన కారును ఎంచుకోవడం కాస్త కస్టమే. అయితే మాకు తెలిసి రెనో క్విడ్ చాలా ఉత్తమమని చెప్పవచ్చు మరి మీరేమంటారు..?

Most Read Articles

English summary
Buying a car in recent times has been an easy task. As soon as a person starts earning, the banks are behind him to offer a loan to buy a car.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X